ఈమాట వెబ్ పత్రిక యొక్క దశమ వార్షికోత్సవ సంచికలో ప్రచురింపబడిన " సార్ గారండీ, సార్ గారండీ" అనే కవిత మరియు మూడు నవంబరు న ఆంధ్రభూమి సాహితి పేజీలో ప్రచురింపబడిన " మట్టికనుల నా పల్లె" అనే కవితల లింకులను ఇక్కడ ఇస్తున్నాను. (పేజీ చివరలో ఉంటుంది)
నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న మిత్రులకు, పెద్దలకు సదా కృతజ్ఞుడనై ఉంటాను.
ధన్యవాదములతో
భవదీయుడు
బొల్లోజు బాబా
http://www.eemaata.com/em/issues/200811/1348.html
http://andhrabhoomi.net/sahiti.html
నగర మర్యాద
రహదారికిరుపక్కలా చెట్లు క్రమేపీ తగ్గి
హోర్డింగులు మొదలైతే
నగరంలోకి ప్రవేశిస్తున్నామన్నమాటే.
రకరకాల రంగుల్లో, వింతైన వెలుగులతో
హోర్డింగులు వంగి వంగి స్వాగతం పలుతూంటాయి.
నోరూరించే రుచులూ, ఇంటిని మరిపించే ఆతిధ్యం అంటూ
కొన్ని హోర్డింగులు అత్యంత అతి వినయంతో ఆహ్వానిస్తాయి.
"తలతిరుగుడా అయితే పక్షవాతం కావొచ్చు" అంటూ మన క్షేమం కోరుతూ
కిడ్నీలెక్కడ దొంగిలింపబడతాయో చెపుతూంటాయి.
వేయబోయే కొత్త వేషాలకు దుస్తులు మావద్దే కొనుక్కోమని
కొన్ని హోర్దింగులు ప్రాకులాడుతూంటాయి.
మేమమ్మే చదువులే టౌనులో బెస్టంటూ
మీర్రాకపోతే మామీద ఒట్టంటూ కొన్ని ప్రాధేయపడతాయి.
మాదే " అసలైన అనువంశీక షాపంటూ" కొన్ని దీనంగా నమ్మబలుకుతాయి.
నిక్కచ్చైన KD బంగారం మావద్ద మాత్రమే లభ్యం
రండి రండి రండంటూ మరికొన్ని గారాలు పోతాయి.
"మిక్సీ కొనండి మారుతీ కారు ఖచ్చితంగా పొందండి" అంటూ
కొన్ని హోర్డింగులు రోడ్డు గుద్ది మరీ, సాదరంగా పిలుస్తాయి.
ఆఖరుకు చస్తే
మార్చురీ వేను ఫోను నంబర్లతో సహా (ఉపయోగపడే సమాచారమిది)
హోర్డింగులు ఆత్మీయంగా, సవివరంగా, సవినయంగా,
తెలుపుతూ నగరానికి ఆహ్వానిస్తాయి.
తెచ్చుకొన్న చమురు ఇంకి పోయేదాకా
నగరమన్నాకా, ఆమాత్రం మర్యాద చేయద్దూ మరి?
బొల్లోజు బాబా
ఆ మర్యాద నగరాలనుండి పట్టణాలకు కూడా వచ్చేసిందండీ!
ReplyDeleteకాకినాడలో ఎక్కడ చూసినా M&M హోర్డింగులే
బాబాగారు మీకు మీరే సాటండి.ఆ పదజాలం కాని,ఆ మాల కూర్చినట్టు పదక్రమం కాని మీరు రాసినట్టు ఇంకేవరు రాయలేరంటే నమ్మండి.చాలా బాగుందండి...
ReplyDeleteమీ శ్రీసత్య...
you have forgotten one more thing. It is about cleaning of letrin tanks. you better include that also.
ReplyDeletenarasimha rao
అభినందనలు బాబా గారు.. ఆంధ్రభూమిలో ప్రచురితమైన 'మట్టికనుల నాపల్లె ' చాలా చాలా నచ్చిందండి!
ReplyDelete"మబ్బుల మధ్య గుంపును కోల్పోయిన
కొంగపిల్ల తుమ్మచెట్టుకు గాయమై
వేలాడడమే!"
పదచిత్రాల ఆవిష్కరణలో మీకు మీరే సాటి!
అభినందనలండి.అసలు కవిత్వం అంటే ఏమిటని ఎవరన్నా అడిగితే ఏ వివరణలు చెప్పక్కర్లేకుండా మీ కవితలని చూపిస్తే సరిపోతుంది.మీది పత్రికల స్థాయి.ఇక నుండి తరచుగా పత్రికల్లో కనిపిస్తారని ఆశిస్తున్నాను.
ReplyDeleteనన్ను ఎప్పటికప్పుడు వెన్ను తట్టే జాన్ హైడ్ గారికి,మీకు సదా ఋణపడి వుంటాను.
congrats maastaru..
ReplyDeleteఅభినందనలు అన్నయ్య గారు.
ReplyDeleteమీ కవితలు సామాజిక పరిస్ఠితులమీద కత్తులు దూసి చదివేవారిని ప్రశ్నిస్తాయి.
నాదో చిన్న కోరిక, మీ కవితలు ఇలానే అన్ని (ప్రేమ, విరహం, బాధ, స్నేహం, భవబంధాలు నిర్లిప్తత వగైరా) అంశాలని స్పృశించాలని కోరుతున్నాను.
nenu andhrabhoomi lo modata choosi ikkadiki vachanu comment cheyadaniki...kavita chaala bagundi
ReplyDeletei thank one and all for responding.
ReplyDeletebollojubaba
బాబా గారు,నా స్వంత http://www.vizagdaily.co.cc/ లో సాహితీవిభాగానికి మీ సాహితీయానం పేరుపెట్టా,ఇది చాలనుకుంటాను నా కామెంట్లు ఇక్కడ ఎందుకు రావట్లేదో :)
ReplyDeletemi kavita ee roju saakshi sunday book lo prachuritamayenade.
ReplyDeletehttp://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=14800&categoryid=10&subcatid=43
Edichav.
ReplyDeleteగురువు గారికి, నిన్న సాక్షి-ఫండే స్పెషల్ లో మీ కవిత చూసాను. చూడగానే మా బాబా గారి రచన అని అందరికి చదివి వినిపించాను. మా అమ్మగారు కూడా మీకు అభినందనలు తేలుపమన్నారు. మీ తరువాతి రచన కూడా ఇలనే అందరిని ఆకట్టుకోవాలని ఆకంక్షిస్తూ....
ReplyDeleteమీ శ్రీసత్య...
raajeMdra gaaru,
ReplyDeletei gave you a mail. you might have noticed sir.
i feel i am flattered to the peak by your deed sir.
thank you
మొదటి అనానిమస్ గారు
సాధారణంగా అనానిమస్ కామెంట్లంటే బ్లాగర్లకు భయం. ఎందుకంటే ఏంతిడతారో, ఎటువంటి భాష వాడతారో అని. ఎక్కువ సందర్భాలలో రచయితలు సున్నితమైన మనస్సునే కలిగి ఉంటారు. ఎవరైనా తిడితే అరరే వీరిని కూడా మెప్పించేలా రాయలేక పోయామే అనే సెల్ఫ్ డిఫెంస్ లో పడిపోతారు. కానీ మీ ఈ కామెంట్లు ఆ అభిప్రాయలకు భిన్నంగా ఒక సహృదయతో సమాచారం ఇచ్చేవిధంగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. మీకు సదా ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను. మీరు కూడా వెంటనే ఒక రిజిష్టరుడ్ మెంబరు గా మారి మీ అభిప్రాయాలను తెలియచేస్తారని భావిస్తాను. మీకు మీ సహృదయతకు నెనర్లు.
రెండవ అనానిమస్ గారికి
చూడుడు పై సమాధానము.
శ్రీ సత్యగారు
అవునా? చాలా ఆనందముగా ఉందండీ. మీ అమ్మగారికి నా వందనాలు తెలియచేయండి. థాంక్సండీ.
బొల్లోజుబాబా
మీ కవిత ఇవాళే సాక్షి సండే స్పెషల్ లో చూసా.. మా స్టాఫ్ అందరికీ చూపించా..నేను ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చా..మీరు ఇక్కడ మానేజ్ చేస్తూ మళ్ళీ ప్రింట్ మీడియాకు ..ఆ థ్రిల్లే వేరు సుమీ .. కంగ్రాట్స్ ..! విజృంభించండి..
ReplyDeleteరహదారికిరుపక్కలా చెట్లు క్రమేపీ తగ్గి
ReplyDeleteహోర్డింగులు మొదలైతే
నగరంలోకి ప్రవేశిస్తున్నామన్నమాటే .. well said.
తెచ్చుకొన్న చమురు ఇంకి పోయేదాకా
నగరమన్నాకా, ఆమాత్రం మర్యాద చేయద్దూ మరి? వ్యంగ్యంగా ప్రశ్నతో ముగింపు బాగుంది
మీరొకటి మర్చి పోయారండోయ్..
ReplyDeleteటోపీలు హెల్మెట్లు అమ్మేవాళ్ళు. వీళ్ళు నగర జీవనానినికి అత్యవసరమయినవి అమ్ముతారు.నగరమ్లో టోపీలు పెట్టేవారు,తలలని కవచాలలో కుక్కుకుని తిరిగేవారు ఎక్కువ.
చాలా బాగుంది.