కాలేజీ చదువులకని
ఇల్లు విడిచిన పిల్లలు
ఇంకా తిరిగి రారు.
వృద్దాశ్రమంలో అంతా బాగానే ఉంటుంది.
వేళకు తిండి, వైద్యం, కాలక్షేపం.
కానీ
మెలుకువ నిద్రపొడవునా వ్యాపిస్తూంటుంది.
చలిచేతుల్ని
అనుభవాల చుట్టూ వేసి
వెచ్చచేసుకోవాల్సిందే.
జ్ఞాపకాల్ని వింటూ కొవ్వత్తి
రాత్రిలోకి వలికిపోతుంది.
కాలం నిండా ఘనీభవించిన చీకటి.
ఇసుక గడియారంలోని
ఒంటరి ఎడారి ధార
భారంగా జారుతుంది.
గాలి తన బరువుని
చెట్లపై ఈడ్చుకుంటూ సాగుతూంటుంది.
పాదముద్రలను
కెరటం నోట కరచుకు పోయింది.
మౌనం పంజరంలా
దేహంపై దిగింది.
కాలేజీ చదువులకని
ఇల్లువిడిచిన పిల్లలు వచ్చారు.
బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
"మెలకువ నిద్ర పొడవునా వ్యాపిస్తుంది"
ReplyDelete"ఇసుక గడియారంలోని ఒంటరి ఎడారి ధార"
"..కొవ్వొత్తి రాత్రి లోకి వలికిపోతుంది.."
బాబాగారు,
మీరు పత్రికలకు చాలా అన్యాయం చేస్తున్నారండీ!
once again...powerful expression...Kudos!
ReplyDeleteఎప్పుడూ వ్యాఖ్యానించేప్పుడు కొన్ని పద చిత్రాలను ఉటంకించే వాడిని. కానీ ఇందులో ప్రతి వాక్యం పదిసార్లు చదవాల్సినవే. చాలా చాలా బాగుంది.
ReplyDeletechala manchi message
ReplyDeleteవెనుతిరిగి చూసుకొంటే, జీవితంలో మిగిలిన జ్ఞాపకాల పాదముద్రలన్నింటిని కాలపు కెరటాలు నోట కరుచుకొని పోతాయి.
ReplyDeleteఒంటరి జీవితంలోని నిరాశపు ఇసుక తుఫాను టోర్నడో లాగా ప్రవేశిస్తుంది.
మిగులుచుకొన్న కొన్ని అనుభూతుల్ని పంచుకోవడానికి ఎవరులేని ఏకాంతం మౌనంగా, అనుమతి లేకుండా, దేహంపై దిగిన పంజరంలా వెక్కిరిస్తూ ఏతెస్తుంది.
ఇన్ని భావాలని ఒలికించే మీ కవితలు ఎన్నటికి నా హృదయంపై శిలాక్షరాలు.
నేను సుజాతగారితో ఏకీభవిస్తున్నా. కొన్ని వాఖ్యాలు చదువుతుంటే చూపు అక్కడే ఆగిపోయి కదలనంది.
ReplyDeleteప్రతికవితతోనూ నన్ను కదిలించేస్తారండీ! మళ్ళీ చెప్పిన మాటలే చెప్పలేక, అప్పుడప్పుడూ కామెంటేమిరాయాలో తెలీనిపరిస్థితిలోకి నెట్టేస్తారు.
ReplyDeleteబాగుంది.చాలా బాగుంది.అద్భుతంగా ఉంది.మనసుకు హత్తుకునేలావుంది.నిద్రనుంచీ తట్టిలేపేలావుంది.అనుభవించినట్లుగా వుంది.అనుభవాల్ని పంచినట్లుగా వుంది.
చాలా.చాలా..చాలా...చాలా........!బాగుంది బాబాగారు.మీ ప్రతి రచనలో వైవిద్యం నాకు చాలా బాగా నచ్చుతుంది.మనసును హత్తుకునేలా వుంది మీ టపా.
ReplyDeleteమీ శ్రీసత్య
ప్రతి వాక్యం నిలబెట్టేసింది.
ReplyDeleteకానీ చివరి వాక్యం అర్ధం కాలేదు. అంటే కాలం సైక్లిక్ అంటున్నారా? ఈనాడు వారి తలిదదండ్రులున్న స్థానంలో ఇంకొన్నేళ్ళలో పిల్లలు ఉంటారు అంటున్నారా?
నేను ఇలా అర్ధం చేసుకున్నాను. బాబాగారు, తప్పయితే చెప్పండి...
ReplyDeleteఆ తల్లితండ్రులు చనిపోయిన తరువాత వారి అంత్య క్రియలకు ఇల్లు విడిచిన పిల్లలు తిరిగి వచ్చారు అని...
i have been away from my place on tour.
ReplyDeletei thank one and all for responding to my poem and encouraging me.
i will give detailed reply soon.
thank you
వృద్దాశ్రమంలో అంతా బాగానే ఉంటుంది.
ReplyDeleteవేళకు తిండి, వైద్యం, కాలక్షేపం.
కానీ
మెలుకువ నిద్రపొడవునా వ్యాపిస్తూంటుంది.
చదివినవారికి నిద్ర కరువయ్యేలా రాసారండీ
కాలేజీ చదువులకని
ReplyDeleteఇల్లువిడిచిన పిల్లలు వచ్చారు....
అర్థం కాలేదు. వివరించండి.
మిత్రులు చెప్పినట్టు ప్రతీ లైను చివరా చూపు నిలిచిపోయి మళ్ళీ మళ్ళీ చదివింపజేస్తుంది. ఏది ఏమైన పదాలలో ఇంత మంచి బంధాన్ని చూపించినందుకు మిమ్మల్ని మనసారా అభినందించాలి. అద్భుతమైన భావం. మీ కలం నుండి మరొక ఆణిముత్యం.
ReplyDeletebaba garu andhrajyothi lo ekkada vachindo link ivvagalara?
ReplyDeletenaku kanipincatledu,.thank you sir.
radhika
"మెలకువ నిద్ర పొడవునా వ్యాపిస్తుంది"
ReplyDelete"ఇసుక గడియారంలోని ఒంటరి ఎడారి ధార"
"..కొవ్వొత్తి రాత్రి లోకి వలికిపోతుంది.."
మీకు మీరే సాటి...
మీసాహితీ యానపు కవితా కిరీటంలో మరొకవజ్రాన్ని పొదిగినందుకు చాలా సంతోషం గావుంది..కీపిటప్..
ReplyDeleteసుజాత గారికి,
ReplyDeleteఅటువంటిదేమీ లేదండి. ఇది వరలో పంపించేవాడిని, నాలుగైదు ప్రచురింపబడ్డయి కూడా. తరువాత తిరిగొచ్చేసేవి. నాకూ నిరాశ కలిగి వదిలేసాను. ఇప్పుడు మరలా మొదలెట్టాను. (మీరందరి ప్రోత్సాహంతో)
ఈ రోజే ఆంధ్రభూమి సాహితి పేజీలో నా " మట్టికనుల నా పల్లె" అనే కవిత ప్రచురితమైంది. ఈ లింకులో గమనించగలరు.
http://dc-epaper.com/andhrabhoomi/DC/AB/2008/11/03/INDEX.SHTML
బహుసా మీ నోటి చలవే అని భావిస్తున్నాను. మంచ్చి నోరు మీది.(ఒత్తుతో పలుకవలెను).
థాంక్సండీ.
గిరీష్ గారికి,
థాంక్సండీ.
మురళి గారు
మీ అభిమానం అంతే. అంతకు మించేమీ కాదు.
నరేష్ గారు
you gave a good twist to my thoughts sir. thankyou.
ప్రతాప్ తమ్ముడూ
మీ వివరణ చాలా బాగుంది. థాంక్యూ.
చైతన్య గారికి
అవునా. థాంక్సండీ.
మహేష్ గారూ,
అంతే నంటారా? మీ కామెంటుకు ఒక్కోసారి ఏమి సమాధానవివ్వాలో అర్ధం కాదు. అంత కట్టి పడేస్తారు నన్ను. థాంక్యూ.
శ్రీ సత్య గారూ,
థాంక్సండీ.
కొత్తపాళీ గారికి
గురువు గారు,
ఈ కవితను పూర్తిగా ఇమేజెస్ పైనే ఆధారపడుతూ వ్రాసానండి. చాలా రోజుల కొట్టివేతలతో చివరకు ఈ రూపంలోకి వచ్చింది.
ఈ కవితకు వచ్చినకామెంట్లను బట్టి ఈ కవితను మూడు రకాలుగా అర్ధంచేసుకొన్నారనిపిస్తుంది.
1. నరేష్ గారి ప్రకారం మంచి మెసేజ్ : నేను మెసేజులు కూడా ఇచ్చేస్తున్నానా అనిపించింది.:-) . కానీ ఆలోచిస్తే అలా ఇల్లు వదిలిన పిల్లలు, తమ తల్లితండ్రుల దైన్యానికి చలించి మరలవారి వద్దకు చేరారు అని ఎందుకు అనుకోకూడదు అనిపించింది.
2. ఇక మీ వాఖ్య ప్రకారం: ఈ కవిత సైక్లిక్ గా ఉందనిపించింది. ఒక తరం వెళ్లి పోయింది. క్యూ కొంచెం ముందుకు జరిగింది. ప్రస్తుతం ఇల్లు విడిచిన పిల్లల వంతు వచ్చింది. ఇదీ కూడా ఒక కోణమే.
3. ఉమా శంకర్ గారు చెప్పిన అర్ధం: ఒక రకమైన విషాదంతం. ఈ కవితకు ఆపేరెందుకు పెట్టాను అని ఎవరూ అడగలేదు. మనకు తెలుసు ఆ కధలో తప్పిపోయిన కుమార్డు (దుర్వయపరుడైన) తిరిగివచ్చినప్పటికి తండ్రి ఉంటాడు. పండగ చేసుకొంటాడు. కానీ ఇక్కడ పరిస్థితివేరు. పరిస్థితి చేజారిపోయిన తరువాత కానీ రాలేదు. ఆకాలానికీ, ఈ కాలానికీ వేసిన లంకెలో ఒక ఐరనీ ఇది. (కనీసం నేనలా అనుకొన్నాను).
నా ఈ ఇంత బాధనీ ఉత్తి ఇమేజెస్ ద్వారా చెప్పయత్నించాను. చెప్పాననే అనుకొంటున్నాను సారు.
లలిత గారికి
థాంక్సండి.
క్రిష్ణ గారికి,
స్పందించినందుకు నెనర్లండీ.
సహి గారి
లింకులిచ్చాను గమనించారా? మెయిల్ ఐడీ లేదు కనుక కామెంటు రూపంలో వ్రాసాను. మీబ్లాగులో.
దిలీప్ గారు
ఊరుకోండి సారు.
నెనర్లు.
భగవాన్ గారు
థాంక్సండీ. మీ పోలిక బాగుంది.
స్పందించిన అందరకూ నెనర్లు.
బొల్లోజు బాబా
బాబా గారు, నేను చెప్పాలనుకున్నవి ఇప్పటికే అందరూ చెప్పేసారు.. అందుకే ఎప్పటిలానే, మామూలుగా 'అద్భుతం' అని తప్ప వేరేమీ చెప్పలేకపోతున్నాను..
ReplyDeleteyet another beautiful poem!
ReplyDeletei enjoyed it perhaps it has simpler words than your previous ones!
మా స్పందనలకు మీరు జవాబులు ఇవ్వడం నాకు బాగా నచిందండి. ఇకముందు కూడా మీ రచనలకు ఇలనే అందరిని ఆకట్టుకోవాలని కోరుకుంటున్నాను.త్వరలోనే నేను కూడా ఈ బ్లాగుల జాబితాలో చేరనున్నాను.నన్ను కూడా దీవించవలసిందిగా కోరుతున్నాను.
ReplyDelete**------------నవ కవి---------------**
బాబా గారూ, అన్ని వివరణలూ బాగున్నై. బైబ్ల్లో ప్రాడీగల్ సన్ కథ నాకు తెలుసు. మీ టైటిల్లోని ఆ ప్రస్తావన, దానిలో దాగున్న ఐరనీ నాకు మొదటే స్ఫురించింది.
ReplyDeleteమొన్న మా సమావేశాల్లో ఆచార్య వెల్చేరు ఒక మాట సెలవిచ్చారు. ఒక రచన ఒకటి కంటే ఎక్కువ అర్ధాలకి తావియ్యక పోతే అది సాహిత్యమే కాదని. ఇంత చిక్కని అర్ధాలకి తావిచ్చిందంటే, మీ కవిత ధన్యం.
Loved it. చాలా బాగుంది.
ReplyDeleteచాలా బావుందండీ -
ReplyDeleteటోపీలు తీశాం
బాగా చెప్పారు, స్వానుభవమా అన్నంతగా...
ReplyDeleteవ్యక్తీకరణ ఒక వరం, ఒక అభ్యాసం, ఒక పూర్వ జన్మ సుకృతం. కాదంటారా? చెప్పండి. ఆర్ద్రత కవిత నిండా నిండి పోయింది. ఉదహరించడం మొదలు పెడితే మొత్తం కవితంతా తిరగ వ్రాయాలి, మచ్చుకి ఈ
ReplyDelete"మెలుకువ నిద్రపొడవునా వ్యాపిస్తూంటుంది "
అన్న వాక్యం చాలు.
చాలా బాగుందండి.
కొత్తపాళీగారు చూసి మరలా మీ స్పందనను తెలియచేసినందుకు థాంక్సండీ.
ReplyDeleteఊక దంపుడు గారు, వికటకవిగారు థాంక్సండీ.
జాబిల్లి గారు నచ్చినందుకు థాంక్సండీ.
బొల్లోజు బాబా
Hats off బాబా గారు. "కాలేజీ చదువులకని ఇల్లు విడిచిన పిల్లలు ఇంకా తిరిగి రారు" అని రాసారు. "తిరిగి రాలేదు" అని రాస్తే బాగుండేది అని నాకు అనిపించింది. నేను కూడా ఆఖరి line చదివి, విషాదం అని అనుకున్నాను.
ReplyDelete