Wednesday, December 31, 2008

నూతన సంవత్సర శుభాకాంక్షలు - బొల్లోజు బాబా


నా మిత్రులకూ, వారి మిత్రులకూ

నూతన సంవత్సర శుభాకాంక్షలు
మీ స్నేహానికి ధన్యవాదములు.
*******

ఈ క్రింద మరి కొన్ని నూతన సంవత్సర శుభాకాంక్షలు*


నీ కొరకై నా ఆకాంక్ష.
ఈ నూతన సంవత్సర దినాన నీ కోసం నేను కోరే కోర్కెలు.

నీ హృదయంలో శాంతి
కుటుంబము, మిత్రుల నుండి ప్రేమ
నీ మార్గాన్ని నడిపించే విశ్వాసం నిరంతరమూ వెన్నాడే ఆశ
రోజుల్ని వెలిగించే సూర్యకాంతి
దేవలోకపు
తారల అనుగ్రహం.
రేపున్నదని తెలిపే ఇంద్రధనస్సులు.
కరుణను పలికించే కన్నీటి చుక్కా
ప్రేమను నింపుకొనే హృదయం
అన్నింటినీ మించి
నీచేయిలో నాచేతి స్పర్శా
నీవు తడబడినపుడు,
నీకు ఆనందం అందించటానికి
ప్రేమనందించటానికి,
నాతో పంచుకొన్న నీ స్నేహపు మధురిమల్ని
తిరిగి ఇవ్వటానికి నేనున్నాను అనే జ్ఞానం

సదా నీవెంటే ఉండాలని ఆకాంక్షిస్తూ
*******మరొక కొత్త సంవత్సరం మనముందుంది

మరొక సంవత్సర ఆనందం తెచ్చింది.
బాధల్నీ, భయాల్నీ, అనుమానాల్నీ విడనాడి
ప్రేమించుకుందాం, ఆనందిద్దాం, పంచుకుందాం.
*******


ఈ కొత్తసంవత్సరాన్ని ఈశ్వరుడు మనకు ప్రసాదించాడు.
ప్రతీదినమూ నూత్నోత్సాహంతో జీవించటానికై
ఎత్తులకు ఎదుగుతూ, ఉత్తమంగా ఉండటానికై.

*******ఈ నూతన సంవత్సర దినాన.
నీ ప్రేమ నీడలో ఊయలలూగుతూ
నీ పెదవుల మృధుత్వాన్ని స్పర్శిస్తూ
నిన్ను నా హృదయానికి దగ్గరగా తీసుకొంటూ
నీ సమక్షంలో నేను ఒక అనంత స్వప్నాన్ని
స్వప్నిస్తున్నాను,

*******


నీవు స్వప్నించాలనుకొన్న ప్రపంచాలను స్వప్నించు
నీవు ప్రయాణించాలనుకొన్న దూరాలను సాగించు.
నీవెలా ఉండాలనుకొన్నావో అలానే ఆవిష్కరించుకో
ఎందుకంటే
నీ చేతిలో ఉన్నది ఒక్క జీవితమే
నీవు ఏపని చేయాలనుకొన్నా
ఉన్నది ఒక్క అవకాశం మాత్రమే.

*******


రాబోయే సంవత్సరంలో నీ కలలన్నీ
నిజంకావాలని ............
*******


శుభాశీస్సుల కవాతు
మిమ్ములను వెతుక్కూంటూ వస్తున్నది.
*******


ఒక నూతన సంవత్సరం విచ్చుకొంటూంది
-- ఇంకా పూర్తిగా విచ్చుకోని రేకల వెనుక సౌందర్యాన్ని దాచుకొన్న కుసుమంలా.
*******


ఓ పుస్తకాన్ని మనం తెరుస్తాం.
దానిపై కొన్ని మాటల్ని వ్రాసుకుంటాం.
ఆ పుస్తకం పేరు అవకాశం.
దాని మొదటి పేజీ నూతన సంవత్సర దినం
*******


మరో అవకాసం వచ్చింది.
తప్పులను సరిదిద్దుకోవటానికై
శాంతిని పెంపొందించుకోవటానికై
ఒక సంతోష తరువుని నాటటానికై
మరిన్ని ఆనందగీతాల్ని ఆలపించటానికై.
*******


ఈ రాత్రి నూతన సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం
వెలుగులు చిమ్మే బాణాసంచా కాంతులలో
పాత సంవత్సరానికి ముద్దులతో వీడ్కోలు పలికి
కొత్త సంవత్సరాన్ని సాదరంగా పిలుద్దాం
*******


విషాదం రేపటి బాధల్ని తగ్గించలేదు.
నేటి ఆనందాల్ని మింగేస్తుంది.
మిత్రమా,
నీ బాధల్ని తరిమికొట్టే
నూతన సంవత్సరాన్ని కాంతులతో
సంగీతంతో అహ్వానిద్దాం రా.
*******


ఈ కొత్త సంవత్సరం
నీవు నడిచిన అన్ని సంవత్సరాలలో కెల్లా
ఉత్తమమైనది గా ఉండాలనీ
ప్రతీ క్షణం గతించిన ఘడియ కన్నా మెరుగ్గా సాగాలనీ
నీ తీయని స్వప్నాలు ఫలించాలనీ
ప్రతి దీవననూ గుర్తించి, ఆనందించగలిగే
అవకాసం కలగాలనీ
ఆకాంక్షిస్తున్నాను.

నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇంకా మరెన్నో.

*******


నీకివే నా శుభాకాంక్షలు
నూతన ఆశయాలు గుభాళించే క్షణాలు అన్నీ ఫలించాలి నీ ప్రతీ నడకలో
నూతన సంవత్సర శుభాకాంక్షలు
*******


ఈ కొత్త సంవత్సరపు ప్రతీరోజూ
అష్టైశ్వరపు దీప కాంతులలో ప్రకాశించాలని
ఆకాంక్షిస్తూ
*******


నూతన సంవత్సరపు ఈ పచ్చని క్షణాన
ఆకుల వర్ణాలు భువంతా పరచుకోనీ.
*******


కొత్త ప్రమాణాలు,
కొత్త వాగ్ధానాలు
కొత్త నిర్ణయాలు
*******


అరవిరిసిన సుమాల అద్భుత స్ఫూర్తితో
నూతన సంవత్సర శుభాకాంక్షలు
*******


మేల్కొను, ఉదయించు, ఒక కొత్త ప్రపంచంలోకి
ఐశ్వర్యాలు ఆనందాలూ వర్షించనీ.
*******


నీ భవిష్య దినాలలో శాంతి పల్లవించుగాక!
*******


మన స్నేహం ఒక గులాబీ వంటిది.
మృధురేకల క్షణాలెన్నో
ఈ సమయంలో గుభాళిస్తున్నాయి.
ఒకటే తేడా, గులాబీ వాడిపోతుంది.
*******జీవించటానికి వేడుక చెయ్యి లేదా వేడుక కోసమే జీవించు.

*******


ఈ సంవత్సరం
జీవనాద్భుతాలను ఆస్వాదించే అదృష్టం కలుగుతుందని ఆశిస్తూ......
*******


మార్గాన్ని కాంతిమయం చేస్తున్న కొత్త సంవత్సరానికి
ఆహ్వానం
*******బొల్లోజు బాబా

*
వెబ్ లో దొరికిన కొన్ని గ్రీటింగులకు తెలుగు అనువాదం మాత్రమే నా స్వంతం కావు

9 comments:

 1. మీకు కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

  ReplyDelete
 2. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete
 3. హ్యాపీ న్యూ ఇయర్ :-)

  ReplyDelete
 4. నూతన సాల్ గ్రీటింగ్స్.......బాబాగారు.

  ReplyDelete
 5. ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా

  ReplyDelete
 6. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
  మీరు తెలియటం 2008 ఇచ్చిన గొప్ప బహుమతుల్లో మొదటిది.
  మీ బ్లాగు చదివే అదృష్టం కలగటం రెండోది.

  ReplyDelete
 7. ఓ పుస్తకాన్ని మనం తెరుస్తాం.
  దానిపై కొన్ని మాటల్ని వ్రాసుకుంటాం.
  ఆ పుస్తకం పేరు అవకాశం.
  దాని మొదటి పేజీ నూతన సంవత్సర దినం
  -- నాకు నచ్చిన భావన. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

  ReplyDelete
 8. నా మరువం పలికిన మాటో, పాటో మళ్ళీ ఇక్కడ వ్రాస్తున్నాను, దారి తప్పి నను చూసుకోక ఇటేపు వచ్చిన మిత్రులకు కూడా నా శుభాకాంక్షలు అందుతాయని ... :)
  ****************
  మోడులైన చెట్లు చెప్తున్నాయి ఆమనిలో పచ్చని చివురేస్తాం, మాకెందుకిక దిగులని,
  గూడొదిలి పోయిన గువ్వపిట్ట కబురంపింది, వేసవికి ముందే నా ఇల్లు విడిదడుగుతానని.
  మంచుకప్పిన నేల నవ్వేసుకుంటుంది, పచ్చ చీర నేత పూర్తవొచ్చిందని.
  నిద్ర నటిస్తున్న బుల్లి బన్నీ వ్రాసుకుంటోంది, అది చేయనున్న చిలిపి పనులచిట్టా.
  ఋతువు కూడా ఒప్పేసుకుంది, శీతువునంపి వసంతునికి కబురంపుతానని.
  మాసం మాత్రం మోసం చేస్తదా ఇక మరి, తాను తరలి వెళ్తదేమో.
  కొత్త కొత్త ఆశలు, వూహలు ఇలా నిత్యం ప్రకృతి నాకు కానుకిస్తూనేవుంటది.
  ప్రతి ఏడు వెళ్ళ్తూ వెళ్ళ్తూ ఇచ్చిన మాటా తప్పక తీర్చుకునేతీరతది.
  ఇహం, పరం, యోగం, భోగం, సూక్ష్మం, మోక్షం ...
  అన్ని కలిసిన ఈ ఆరు ఋతువుల జీవనం అమోఘం!!!
  *******************
  రండి అంతా కలిసి పలుకుదాం మరో ఏటికి సుమధుర స్వాగతం!!!
  మీ అందరకూ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు...

  ReplyDelete
 9. ఈ కొత్తలోకానికి ఒక తెలుగు జీవనదిలా మీ కవితా ప్రవాహం నిత్యనూతనంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తున్నాను.

  ReplyDelete