Monday, June 8, 2026

ఎవరికీ పట్టని విషాదం


ఈ సంవత్సరం
ఒక్క వలసపక్షీ రాలేదని
స్థానిక పత్రికలో
ఒక మూల చిన్న వార్త

కానీ
రేపు
గూడకొంగల రెక్కలనీడలో
విచ్చుకొనే వసంతం కూడా రాదని
సారసపక్షుల దేహకాంతులను
ధరించే శరత్తు కూడా కనిపించదని
ఉల్లంకి పిట్టలు విడిచివెళ్ళే
పసిడి వెలుగుల
హేమంతం కూడా కరుణించబోదని
ఎవ్వరూ
మాట్లాడుకోవటం లేదు
ఆశ్చర్యంగా


బొల్లోజు బాబా
(పర్యావరణ దినోత్సవం సందర్భంగా - రానున్న నా కొత్త కవిత్వ సంపుటి నుంచి)

No comments:

Post a Comment