Monday, June 8, 2026

నడిచిన అడుగులు



అనేక : తెలుగుప్రభ సాహిత్య పేజీ లో నా కవిత.


ఒకట్రెండు నక్షత్రాలు రాలినా
ఆకాశం కూలిపోదు
ఒకట్రెండు రాళ్ళు తీసినా
ఏరు ఆగిపోదు
నువ్వు నేనూ లేకపోయినా
ఈ లోకం తిరుగుతూనే ఉంటుంది
మనం వదిలిన కథలను మోసుకొంటూ

పడిపోయి లేచావు చూడు అదొక కథ
తప్పుచేసి ఒప్పుకొన్న కథ
ప్రేమించి గోడదూకిన కథ
ఒక నిజం కోసం నిలిచిన కథ
నీ గురించి చెప్పేటపుడు
కళ్లలో వెలుగు రావాలి,
“తను ఒక కథ” అని
హృదయం గర్వంగా పలకాలి.

నువ్వు కాదు…
నువ్వు మిగిల్చిన కథలు మాత్రమే శాశ్వతం


బొల్లోజు బాబా
స్కై బాబా అన్నకు ధన్యవాదములతో



No comments:

Post a Comment