Friday, November 28, 2025

ఉత్తరం రాసిన 272 మంది.

భారతరాజ్యాంగ అధికారులపై దాడిచేస్తున్నారని అభియోగిస్తూ ఇటీవల 272 మంది సమాజంలోని కొందరు మర్యాదస్తులు ఉత్తరం రాసారు. ఈ రాసినవారు “ఎవరు” అని గ్రోక్ ని అడిగాను. దాని సమాధానం నాకు ఆశ్చర్యం కలిగించలేదు.

వీరిలో 16 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 123 రిటైర్డ్ బ్యూరోక్రాట్లు, 133 రిటైర్డ్ ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు.
 
వీరి సామాజికవర్గాన్ని విశ్లేషించమని అడిగినపుడు గ్రోక్ ఇలా చెప్పింది…

వీరిలో బ్రాహ్మణులు+క్షత్రియులు+కాయస్తులు+వైశ్యులు లాంటి ఉన్నతవర్ణాలకు చెందిన చెందిన వారు సుమారు 248 మంది ఉన్నారని - సింగ్, రావు, గుప్తా, వర్మ దలాల్ లాంటి పేర్లద్వారా తెలుస్తుంది. అంటే సంతకాలు చేసినవారిలో 91 శాతం ఉన్నతవర్గాలకు చెందినవారే. దేశజనాభాలో వీరు 10 శాతం కన్నా తక్కువ.
 
ఇక ఈ 248 మందిలో 61 శాతం అంటే సుమారు 165 మంది బ్రాహ్మణ వర్గాలకు చెంది ఉన్నట్లు - శర్మ మిశ్రా, తివారి, శుక్లా, త్రివేది, ద్వివేది, అయ్యర్, శ్రీ వాస్తవ, సిన్హా, మాథుర్, పాఠక్, త్రిపాటి, భండారి, భరద్వాజ భార్గవ, చతుర్వేది, చావ్లా, మెహతా వంటి ఇంటిపేర్ల ద్వారా తెలుస్తుంది.
ఈ లిస్టులో దళితులు, బహుజనులు ముస్లిముల ప్రాతినిధ్యం అతి స్వల్పం. నిజానికి ఈ దేశ జనాభాలో వీరు 90%. క్రిష్టియన్ లు లేనే లేరు. స్త్రీలు 5 % కూడా మించలేదు.
***

ఇదీ ఆధునిక భారతదేశపు సామాజిక స్వరూపం. రాజకీయ వాస్తవం. సమాజం ఎంత లోతుగా పోలరైజ్ అయిపోయిందో ఈ ఉదంతం ద్వారా తెలుస్తుంది. ఈ 10 శాతం వ్యక్తులు దేశప్రజలకు ఎలా ప్రాతినిథ్యం వహిస్తారనేది ప్రశ్నార్ధకం.
 
ఈ ఉత్తరంలో మరొక కనిపించని పార్శ్వం ఏమిటంటే ఈ దేశంలోని ఉన్నతపదవులలో ఉన్నతవర్ణాలు ఏ స్థాయిలో తమ ప్రభావాన్ని నేటికీ కూడా చూపగలుగుతున్నాయో అనే అంశం.
"ఈ సవర్ణ లాబీయింగ్ దేనికొరకు అనే విషయాన్ని ఎవరికి వారే గ్రహించాలి.

బొల్లోజు బాబా

No comments:

Post a Comment