Sangishetty Srinivas అన్నా, థాంక్యూ సో మచ్.
.
ఫ్రెంచి ఇండియా పోరాట యోధుడు
రఫేల్ రమణయ్య జీవిత కథ
.
స్వాతంత్య్రోద్యమం అంటే ఆధిపత్య కులాల వాండ్లు చేసిన పోరాటంగానే ఇన్నేండ్లు చరిత్రలో రికార్డయింది. 1990ల తర్వాత సబాల్టర్న్ వర్గాల నుంచి కొత్తగా అకరాలు సేకరించి నూతన విషయాలను వెలుగులోకి తెస్తూ ఉండడంతో బహుజనులు కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారనేది రికార్డవుతోంది. అట్లాంటి పుస్తకాల్లో మిత్రుడు బొల్లోజు బాబా రాసిన ‘శ్రీదడాల రఫేల్ రమణయ్య’ పుస్తకం ఒకటి. పోయిన నెలలో అచ్చయిన ఈ పుస్తకంలో ఫ్రెంచ్ ఇండియా స్వాతంత్య్ర సమరయోధుడి పోరాటాల గురించి చెప్పిండు.
1908లో పుట్టి 1991లో చనిపోయిన రఫేల్ రమణయ్య నెహ్రూ మొదలు అనేక మంది జాతీయ నాయకులతో కలిసి పనిచేసిండు. తన ఆత్మకథను 1974లో ‘మై స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రెంచ్ ఇండియా ` యాన్ అటో బయోగ్రఫీ’ పేరిట రాసిండు. అయితే బొల్లోజు బాబా ఇది ఇంగ్లీషులో దళితుడు రాసిన తొలి ఆత్మకథగా చెప్పిండు.
యానాంను భారతదేశంలో విలీనం చేయాలనే డిమాండ్ జరిగిన ఉద్యమంలో రమణయ్య సెల్లాన్ నాయకర్ నాయకత్వంలో పనిచేసిండు. చేస్తున్న ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చిన రమణయ్య గురించి ఇప్పటి తరానికి దాదాపు తెలియదు అని చెప్పవచ్చు. అట్లాంటి దళిత్ క్రిస్టియన్ చరిత్రను వివిధ పత్రికల్లో 1950వ దశకంలో పత్రికల్లో వచ్చిన వార్తలను జోడిరచుకొని సంక్షిప్తంగానే అయినా వివరమైన జీవిత చరిత్రను రాసిన బొల్లోజు బాబా అభినందనీయుడు.
ఆనాటి పత్రికల క్లిప్పింగ్స్‌ని కూడా ఈ పుస్తకంలో ప్రచురించడంతో దీనికి సాధికారత వచ్చిందని చెప్పవచ్చు. ఈ పుస్తకానికి బెంగళూరులో స్థిరపడ్డ వ్యాపారవేత్త, దడాల కుటుంబానికి చెందిన ప్రవీణ్ కె. దడాల ముందుమాట రాసిండు. ఇందులో కుల పరమైన, జెండర్ పరమైన వివక్షను ఆయన ప్రస్తావించారు. 80 పేజీల ఈ పుస్తకాన్ని జనవరి, 2023లో విజయవాడకు చెందిన పల్లవి పబ్లికేషన్స్ వారు ప్రచురించారు.
పుస్తకం చదువాలనుకునే వారు పల్లవి పబ్లికేషన్స్‌కు చెందిన దవారిని 9866115655. వెల. వంద రూపాయలు.
No comments:
Post a Comment