Monday, November 30, 2020
Imported post: Facebook Post: 2020-11-30T01:57:11
ఒక పుస్తకాన్ని వెలువరించటానికి ఎతనయో వెలివేషంగళ్
ఆవిష్కరణ సభ, ఫ్లెక్స్ లు, వక్తల ప్రసంగాలు, శాలువాలు, ప్రెస్ కవరేజ్ వాటిఫొటోలు, వీడియోలు మరలా సోషల్ మీడియాలో షేర్ చేయటం, పుస్తకం పలానా 9866115655 నంబరులో లభిస్తుంది సంప్రదించండీ అంటూ ప్రకటనలు ..... ఎల్లాం వెలివేషం....
***
మరి ఇంట్లో ఏంజరుగుతుంది? కొన్ని విషయాలు వీళ్లకే తెలుస్తాయి
వేళకాని వేళల్లో ఎన్నెన్ని టీలు కాఫీలు....
ఏదో అర్ధరాత్రిపూట మేల్కొని నా గదిలో లైటు ఫాను కట్టేసి రెక్కపట్టుకొని లాక్కొని పోవటం...
ఏ రామకృష్ణతోనో, శివకామేశ్వరరావు గారితోనో గంటలతరబడి
ఫోన్ చర్చలు...
మీరు వెళ్ళి వచ్చేయండి.... నాక్కొంచెం పని ఉంది అంటూ నే చేసిన అభ్యర్ధనలూ....
ఇవన్నీ వీళ్లకే తెలుస్తాయి... బయట వాళ్లకేం తెలుస్తాయి.... అక్కడ నేను కట్టే వేషం వేరు కదా!
***
కరోనా కాలం కదా సభ జరుపుకొనే అవకాశం ఉండకపోవచ్చు అంటూ పుస్తకాలు ప్రెస్ నుంచి వచ్చిన రోజే ఇంట్లో మా పిల్లలు ఆవిష్కరణ సభ ఏర్పాటు చేసేసారు. మా ఆవిడ ఆవిష్కర్త... ఒక శాలువా, రచయితగా నాకు మూడు శాలువాలు....ముగ్గురినుంచీ...
ఉపన్యాసాలేమీ లేవు.... ఉత్త ప్రేమ, కొన్ని ఘనీభవించిన క్షణాలు తప్ప
బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment