Tuesday, September 2, 2008
అన్నీ ఒకేలా ఉంటాయి
ప్రతీదీ ఎక్కడో చూసినట్టే ఉంటుంది.
ఎప్పుడో అనుభవించినట్లే ఉంటుంది.
అన్నీ ఒకేలా ఉంటాయి.
ఉదయాలు, మరణాలు
విజయాలు, వేదనలు
ఎత్తుగడలు, దొరికిపోవటాలు
కలలూ కన్నీళ్లూ, బంధాలూ ప్రేమలూ,
అన్నీ ఒకేలా ఉంటాయి.
ప్రతీదీ ఎప్పుడో ఒకప్పుడు
స్వప్నించినట్లే ఉంటుంది.
అవును, కాదు
కావొచ్చు, అప్పుడప్పుడూ,
లాంటి మాటల మధ్య జీవితం
గానుగెద్దులా తిరుగుతుందన్న విషయం
ఎపుడో ధ్యానించినట్టే ఉంటుంది.
పంజర పక్షి పదే పదే వినిపించే గానంలా
జీవితం కనే కలలు
ఎప్పుడూ ఒకేలా ధ్వనిస్తాయి.
ఏం చదివినా
అవే అక్షరాలు, అవే అర్ధాలు
పునరావృతమైనట్టే అగుపిస్తాయి.
ఆఖరుకు
కాలం దిబ్బపై మొలచిన
పిచ్చిమొక్కలు కూడా
క్లోన్డ్ సంతతిలా అనిపిస్తాయి.
బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
బావుంది.
ReplyDelete"బిస్మిల్లా ఖాన్ బిస్మిల్లా ఖాన్ లాగానే షెహనాయీ వినిపిస్తుంటాడు."
ఆ పద్యం చదివారా ఎక్కడన్నా?
ఆఖర్న క్లోనింగ్ concept ని పరిచయం చేసి మొత్తం కవితని చూసే ధృక్కోణాన్ని మార్చేసారు.
ReplyDeleteAwesome!
ReplyDeleteనిజమే ఎన్ని issues fix చేసినా వస్తూనే ఉంటాయి.. ప్రతీ క్రొత్త issue పాతదానిలానే ఉంటుంది...!
ReplyDeleteమీ ఈ కవిత కూడా ఎప్పుడో ఎక్కడో ఎలానో చదివినట్టే విన్నట్టే అనిపిస్తుందెందుచేతో---
ReplyDeleteకొత్తపాళీ గారికి
ReplyDeleteచినవీరభద్రుడిగారి కవిత చాన్నాళ్ల క్రితం చదివాను. మీరుటంకించిన తరువాత మరలా రచ్చబండ డిస్కషన్లలో చదివాను. అదొక గొప్ప కావ్యం సారు.
మహేష్ గారు థాంక్యూ వెరీమచ్ సారు.
పూర్ణిమ గారు పిడిఫ్ కు ధన్యవాదములు మేడం. నేనే అడుగుదామనకకుంటుండగా మీరే పంపించారు.
మేధ గారు థాంక్యూ.
నరసింహ గారు,
ఇలాంటి కామెంటుని నేను ఎదురుచూస్తున్నాను.
మీకెందుకలా అనిపించిందంటే
శ్రీశ్రీ ఒకసారి
"ఏం రాయాలన్నా
ఎప్పుడో రాసేసినట్టే ఉంటుంది
ఎక్కడో చదివినట్టే ఉంటుంది" అని వాపోతాడు.
(బహుసా అవే పదాలు కాకపోవచ్చు)
థాంక్యూ సర్
బొల్లోజు బాబా
bhaavakavulaku subhaakaamxalu.
ReplyDeleteఅసలు మిమ్మల్నే ఎక్కడో చూసినట్టుంది
ReplyDeleteనేను కవిత్వాన్ని ఆస్వాదిస్తున్న తరుణంలో యువ నుంచి యువదాకా అనే సంకలనాన్ని చదివాను
అందులో చిన వీరభద్రుడు
కవిత చదివినట్టు గుర్తు
బహూశ అప్పటినుంచీ
కవిత్వమంటే మమకారాన్ని పెంచుకున్నానేమో!
మళ్ళీ ఒకసారి తిరగ వేయాలి
babaji...anni okela vuntai chala bavundi..annattu nakkonni doubts vunnai phone lo dorakara..?
ReplyDeletevery good.
ReplyDeletemarvoless,beautiful,exellent,very good
ReplyDelete