Monday, September 22, 2008
ఒక అనువాద కవిత
మట్టి ముద్దను పాత్రగా మలచు
దాని శూన్యతలోనే
దాని ఉపయోగం ఉంటుంది.
గుమ్మాలు, కిటికీలతో
గృహాన్ని నిర్మించు
దాని శూన్యతలోనే
దాని ఉపయోగం ఉంటుంది.
దేన్నో పొందుతూ ఉంటాం కానీ
దాని శూన్యతనే వాడుకుంటూ ఉంటాం.
మూలం: టావో టె షింగ్ (Mould Clay into a vessel)
బొల్లోజు బాబా
Labels:
అనువాదకవిత,
కవిత్వం,
సాహిత్యం
Subscribe to:
Post Comments (Atom)
దేన్నో పొందుతూ ఉంటాం కానీ [..]ఈ వాక్యం/లైను అర్ధం కాలేదు.
ReplyDeleteనాక్కూడా దిలీప్ గారి ప్రాబ్లమ్మే...కొంచం క్లారిఫై చెయ్యరూ...
ReplyDeleteనాక్కూడా దిలీప్ గారి ప్రాబ్లమ్మే...కొంచం క్లారిఫై చెయ్యరూ...
ReplyDeleteభగవాన్ గారికి, దిలీప్ గారికి
ReplyDeleteprobably i miserably failed in the translation.
మీరడిగిన పాదం యొక్క వరిజినల్ ఈ విధంగా ఉంటుంది.
SOME THING IS WHAT WE GAIN
BUT EMPTINESS IS WHAT WE USE.
ఈ కవితలో నాకు ఒక అద్బుతమైన మిస్టిక్ నెస్ కనిపించి విపరీతంగా నచ్చేసింది. జీవితంలో అప్పుడప్పుడూ కనిపించే ఎంప్టీనెస్ ను బాగా పట్టుకొన్నాడనిపించింది.
నా మృతమన్ను కవితలో అన్నట్లు " బాధంటే లేకపోవటమే" అన్న వాక్యంలోని ఫీల్ ను ఈ కవితలో పొందాను.
బహుసా సరిగ్గా బట్వాడా చేయలేక పోయానన్నది సుస్ఫష్టమైంది. ఇక ముందు అనువాదాల జోలికి పోను గాక పోను.
బొల్లోజు బాబా
మీది కాకినాడా .. అక్కడ నుండే రాస్తున్నారా. మాది పిఠాపురం.
ReplyDeleteబాబా గారూ,
ReplyDeleteమీ అనువాదం బావుంది.
మీరు ముక్తవరం పార్థసారథిగారి శూన్యం చదివారా?
ఈ కవితలోని సారాన్ని గ్రహించి వ్రాసిన నవల ఇది. చదవకపోతే చదవండి.
భలే వారే, కాస్థ క్లారిఫికేషం అడిగినంత మాత్రాన అనువాదం బాలేదని కాదు. అఫ్కోర్సు, అనువాదాలతో ఈ గొడవ ఎప్పుడూ ఉన్నదేగా! :)
ReplyDeleteపద్యం బాగానే ఉంది. కానీ కింద మీ వివరణతోనే విభేదిస్తాను. జీవితంలోని ఎంప్టీనెస్ ని పట్టుకోవడం కాదది. ఉదాహరణకి మన ఆధునిక జీవితంలో ఖాళీగా కూర్చోవడం అనేది ఒక సహించరాని విషయం. ఎప్పుడూ ఏదో చేస్తూండాలి. మళ్ళి స్ట్రెస్ ఎక్కువై యోగా, ధ్యానా, మెడిటేషం అంటూ బోలెడు ఫీజు కట్టి ఏసీ స్టూడియోల్లో ముక్కు మూసుకుని కూర్చుంటాం. ఖాళీ కూడా ముఖ్యమైనదే .. ఇంకా మాట్లాడితే ఖాలీయే ముఖ్యమైనది. నీలో ఉన్నది డొల్ల అనుకోకూ, ఆ డొల్లతోనే నీక్కావలసిన పని అంతా అవుతుందీ అని కవిహృదయం అని నాకనిపిస్తోంది. ఒక విధంగా మన ఉపనిష్ద్వాక్యం .. పూర్ణమదః పూర్ణమిదం ..
కొత్తపాళీ గారికి,
ReplyDeleteఈ కామెంటును ఇప్పుడే చూసాను.
ఆలశ్యానికి :-@
మీ వివరణ గొప్పగా ఉంది. కవితను మరోకోణంలోంచి చూపిస్తుంది.
కానీ ఎందుకో నేననుకొన్న కోణమే నాకు కంఫర్టబుల్ గా అనిపిస్తుంది.
బహుసా ఆమిస్టిక్ నెస్ వలననే ఇది గొప్ప కవితయ్యిందేమో సారు.