Friday, September 19, 2008

అలవాటయిపోయి.........ఒక బాంబ్ బ్లాస్ట్.
రక్త వర్షంలో దేహశకలాల వడగళ్ళు
హా హాకారాలు, ఆర్తనాదాలకి
ఉలిక్కిపడి నిద్ర లేచింది మృత్యు దేవత.

" ఎంతమంది చచ్చారు?
అలాగా మొన్నటి మీద తక్కువే!
దేహానికో లక్ష నజరానా ప్రకటించండి"

హలో హలో " మీరెలా ఉన్నారు?
ఏం కాలేదా! మీరు భలే లక్కీ.
ఇప్పటికి చాలా తప్పించుకొన్నారు.
ఇది ఎన్నోది?"

ఏమిటీ అంకులు వాళ్ళ ఫామిలీ బలయ్యిందా?
అలాగా! నిజానికి వాళ్ళసలు పోయినేడాది
గోకుల్ చాట్ వద్ద పోయేవాళ్ళే.
ఇప్పుడు పోయారన్న మాట"

ఈ మాంస ఖండంలో
గుండె ఇంకా కొట్టు కుంటూంది.
" జూమ్ చెయ్యి, జూమ్ చెయ్యి"
మైకు దగ్గరగా పెట్టి ప్రేక్షకులకు " లబ్ డబ్ " అందించు.
మొదటగా మా చానెల్ లోనే
వినండి వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా

తప్పుకోండి తప్పుకోండి.
మంత్రిగారు శవాలను పరామర్శిస్తారు.
క్లిక్.... క్లిక్.... క్లిక్ .

ఊహా చిత్రాలు గీయండి
చిత్రాలనిండా అభిప్రాయాలు నింపండి.

పాత సామాన్ల వ్యాపారి
పాంఫ్లెట్లు పంచుతున్నాడు.

" ఈ మందులు అర్జంటుగా తెండి"
" ఐ ఆమ్ సారీ. మేం చాలా ప్రయత్నించాం"
"ఇన్సూరెన్స్ క్లైములిప్పిస్తాం. 30% కమీషను."

పదివేలకే శ్మశానం పాకేజీ.
కాల్చాలా? పూడ్చాలా?
************

ఇవ్వాలి ఇవ్వాలి
ఢిల్లీ లో ఇచ్చినట్లు రెండు లక్షలివ్వాలి!

బొల్లోజు బాబా

బాంబు బ్లాస్టులకు అలవాటు పడదామా అని ప్రశ్నించిన మహేష్ గారి పోస్టు చదివి


5 comments:

 1. అవును మనం నిదానంగా అలవాటు పడుతున్నాం.

  ReplyDelete
 2. అవును, ఇదే ఇవాల్టి మానవ జీవితానికున్న విలువ!

  ReplyDelete
 3. బాగా చెప్పారు బాబా గారు

  ReplyDelete
 4. ప్చ్....నిజమే అలవాటుపడిపోతున్నాం....

  ReplyDelete
 5. ప్రతాప్ గారికి, సుజాత గారికి, వేణు గారికి, భగవాన్ గారికి, ధన్యవాదములు.

  ReplyDelete