Saturday, May 3, 2008

చిత్రానికి కవిత

బుసాని పృధ్వీరాజు వర్మ గారు తన బ్లాగ్ లో తాను చిత్రించిన ఒక అద్భుతమైన చిత్రాన్నుంచి దానిపై కవిత వ్రాయమని అడిగారు. దాన్ని చూసి స్పందించి వ్రాసినది.
http://pruthviart.blogspot.com/2008/04/blog-post_30.html




ఒక సన్నని గీత
మనో కాన్వాసుపై విస్తరించి
ఆకైంది, కొమ్మైంది, చెట్టైంది,
కొండమలుపు వద్ద నదీ నడుం వంపైంది.

ఒక వర్ణ బిందువు
మది తెరపై వలికి
తూలికైంది, పక్షయింది, పక్షి గూడైంది,
తల్లి హృదయమై ఆకలి తీర్చుతుంది,

చిత్రకారుడిది , కవిదీ కూడా!

బొల్లోజు బాబా

7 comments:

  1. చాల బాగుంది కవిత.

    ReplyDelete
  2. ee kavita chaalaa baagundi. marinni chitra kavitaloo, kavitaa chitraaloo raanivvandi.

    afsar

    ReplyDelete
  3. చిత్రం లో అంతర్లీనంగా కనిపించే స్త్రీని మాతృ హృదయం గా పోల్చటం బాగుంది .

    పద్మ

    ReplyDelete
  4. చాలా బావుందండీ! పద్మ గారు చెప్పినట్లు అంతర్లీనంగా కనిపిస్తున్న దృశ్యాన్ని చక్కగా ఎలివేట్ చేశారు!

    ReplyDelete
  5. కాన్వాసు - ఈమాటకు బదులుగా -యవనిక అంటే బాగుంటుందేమో

    ReplyDelete
  6. bommani chusi intha baga feel ayyi rasara chaala adbutam ga undandi.Fell ayyi rasinaduku meeru great mimmalni feel cheeya galigina prudvi garu great.hatsoff to you both.

    ReplyDelete
  7. బాబాగారు,

    అద్భుతంగా ఉంది మీ ఈ చిన్ని కవిత. న్నది "చిన్నపోదు" అని నిరూపించారు.

    పైగా "ఒక వర్ణ బిందువు మది తెరపై వలికి.... " ఈ వర్ణన నిజంగా హృద్యంగా ఉంది.

    ReplyDelete