Thursday, May 29, 2008

ఉదయగీతం

ఉదయగీతం

దినం యవ్వనంతో ఉన్నవేళ
పెదవులు హృదయ రహస్యాల్ని
దాచలేవు.

జాజుల వాసనకు తనువు
సాంద్రరూపమౌతుంది.

పేదవాని స్వర్గ ద్వారాలు
తెరచుకొన్నవేళ…….

ప్రణయ తేజం దేహాల్ని
ప్రకాశింపచేస్తూంటే,


జ్వలిస్తూ, దహిస్తూ,
తపిస్తూ, తరిస్తూ
వలపుల కొలిమిలో
జంటగా ద్రవించటం
సృష్టి రహస్య చామరం.

బొల్లోజు బాబా

16 comments:

 1. Hi babaya

  have changed my blog name

  I liked your poem on global warming
  cu soon

  ReplyDelete
 2. Helo Baba garu gdm.[:)]
  meeru Pruthvi gaari pic ki raasina kavitha chadivi aa roje mee blog choosaa meeku coment raaddam anukone logaa net probs valana raayaleka poyaanu.
  But eeroju nundi intlo malli net connection vochchindi so anduke first meeke coment raastunnaa
  really its a very very nice poetry n coment tooo
  chaalaa bagundandi mee responce

  just mee kavithalanni chustunnaa first de chaalaa bagundi if u don't mind "jaajulu" anekante "Mallelu" ante inkaa suvaasana bharithamemo ani oka chinna feeling sorry if i hurts "U"
  Thanks
  Usha

  ReplyDelete
 3. ౧. ఉదయ గీతం బాగుంది.
  ౨.ఉష గారి సలహా జాజులు కు మారుగా మల్లెలు కూడా బాగానే వుంటుందపిస్తుంది.
  ౩.చామరం ఈ పదానికి నాకు తెలిసి వీవన(విసనకర్ర)అనే అర్ధం కాక వేరే అర్ధాలుంటే తెలియజేయండి.మీరు ఏ అర్ధంలో వాడారు?

  ReplyDelete
 4. ౧. ఉదయ గీతం బాగుంది.
  ౨.ఉష గారి సలహా జాజులు కు మారుగా మల్లెలు కూడా బాగానే వుంటుందపిస్తుంది.
  ౩.చామరం ఈ పదానికి నాకు తెలిసి వీవన(విసనకర్ర)అనే అర్ధం కాక వేరే అర్ధాలుంటే తెలియజేయండి.మీరు ఏ అర్ధంలో వాడారు?

  ReplyDelete
 5. ఉష గారికి క్రితజ్ఞతలు, మీసూచన పాటిస్తాను. ధన్యవాదములు, నరసింహ గారికి,
  ధన్యవాదములు.
  చామరం అంటే విసనకర్ర అనే అర్ధంలోనే వాడాను. అంటే హాయినిచ్చేది అనే భావంకోసం.
  బొల్లోజు బాబా

  ReplyDelete
 6. నువ్వుశెట్టి బ్రదర్స్June 1, 2008 at 11:14 AM

  మీ కవిత్వం చాలా బాగుంది.

  ReplyDelete
 7. Namaste Boju garu.[:)]
  Sorry with out ur permission mee name [Bahusa SIR name anukuntaa]
  short cut chesaa.

  Thanks andi mee post coment ki nijaaniki naaku ee formalities nachavu frnds madyalo ivi dooraanni penchutaayi ani feel avutaanu
  but mee opinion elaantidoo telidu gaa so anduke patistunnaa
  ok leave it
  ika mee coment chadivina taruvaatha
  naa meeda naake doubt gaa undi nenu edo manasulo kalige samudraghosha ni ilaa padaalalo annaa panchukunte ee jeevaniki kaasta manassanti kalugutundemo ane aasatoo modalu pettukunna pichchi rathalu meerantunnattu naaku antha chakkagaa raayatam raadandi
  but mee andarivi Blogs lo bhaavalani chaduvutunte naaku ee feeling kalugutundi
  but meelanti valla coments chustunte manasu uppongi potundi nenu bhaavam vyakteekarinchagalugutunnanu ani
  but satisfaction maatram inkaa raaledu
  sorry ededo raasestunnaa
  Thanks
  Usha

  ReplyDelete
 8. ఉష గారికి
  మీరు మీ భావాల్ని సూటిగా, స్ఫష్టంగా చెప్పగలరు. మీనుంచి మరెన్నో టపాలను ఎదురుచూస్తున్నా. మీ స్నేహ హస్తానికి ధన్యుడను. నాకు స్త్రీవాద కవయిత్రులలో కొండేపూడి నిర్మల గారంటే చాలా అభిమానం. వారి కవితలేమైనా చదివారా. ముఖ్యంగా నడిచేగాయాలు అనే కవితా సంపుటి. మీకుండిన సున్నితమైన భావాలకు ఆ పుస్తకం ఖచ్చితంగా నచ్చుతుందని భావిస్తాను.

  మరలా కలుద్దాం.

  ReplyDelete
 9. మీరు కవిత మొదలుపెట్టిన విధానం చాలా హాయినిచ్చింది..
  కాని అందులో రాసిన "పేదవాని స్వర్గ ద్వారాలుతెరచుకొన్నవేళ……." అన్న వాక్యం ఎందుకో రుచించలేదు. కాని ముగింపు అత్యద్భుతం..

  ReplyDelete
 10. ప్రతాప్ గారు
  ఆ ఒక్క వాక్యమె చాలా చాలా పల్చగా ఉంది కదూ. మార్చెద్దాం.

  బొల్లోజు బాబా

  ReplyDelete
 11. "పేదవాని స్వర్గ ద్వారాలు తెరుచుకున్న వేళ...." లో నాకు అర్థంకాని భావాల్ని నింపినట్టున్నారు! అది out of context, కాక defining వాక్యమో అర్థం కావటం లేదు.

  నా బ్లాగులోని Part 7.2 మీద చర్చ రసవంతంగా మారుతోంది. కాస్త ఓ లుక్కు విసరండి.

  ReplyDelete
 12. కొన్నాళ్ళ క్రితం స్నేహమా అనే బ్లాగులో ప్రయాణం అనే కవితపై నేను కొన్ని కామెంట్లు చేసాను. (పెద్ద పుడింగులాగ). నాకామెంట్లలో నేను ఏవైతే ఆ కవితపై ఆపాదించపూనానో, ఆ భావాలతో ఈ ఉదయగీతం అనే కవిత వ్రాసాను.ు
  కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా నచ్చిందనే భావిస్తున్నాను.
  కామెంట్లిచ్చినందరికీ ధన్యవాదములు

  బొల్లోజు బాబా

  ReplyDelete
 13. చాలా బాగుంది ,ఉదయగీతం'. "జ్వలిస్తూ, దహిస్తూ, తపిస్తూ, భరిస్తూ ... వలపు కొలిమిలో జంటగ ద్రవించటం". చాల బాగుంది మీ పద ప్రయూగం, ప్రాస కానివ్వండి లేక అందులొని భావం కానివ్వండి బాగ నచ్హింది నాకు. ప్రాసతో పాటు , నాకు అందులొని సున్నితమైన శౄంగారం కుడా మీ 'ఉదయగీతం' న్ని పతాకస్థాయికి తీసుక వెళ్ళయి అని అనిపిస్తోంది. తప్పు ఐతే క్షమించగలరు. మరి మీ అభిప్రాయన్ని తెలుపగలరు. ఎందుకు అంటె నా భావన తప్పా లేక ఒప్పా తెలుసుకొవాలి అని వుంది . మరి నా సంశయన్ని తీర్చవలసినా వారు మీరె కదా!

  ReplyDelete
 14. బాబా గారు,
  చాలా deep గా ఉంది, మీ కవితలన్నింటిలాగానే! మీ ప్రతి కవితా నేను చదువుతాను కానీ, నాకు కవితా పూర్వకమైన భాష లేదు అదే రేంజ్ లో ప్రశంసించడానికి, అందుకే మౌనంగా ఆస్వాదిస్తుంటాను! పృధ్వి గారి 'జ్యోతి ' చిత్రానికి మీరు రాసిన బుల్లి కవిత కూడా నాకు బాగా నచ్చింది. నాక్కూడా కొండెపూడి నిర్మల గారి కవితలు నచ్చుతాయి కొన్ని! ఉదాహరణకు ఆమె గారు రాసిన 'ఓణీ ' కవిత నాకు భలే ఇష్టం! అప్పట్లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఈవారం కవితలో ప్రచురితమైంది. దాని కటింగ్ ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది. మీరు చెప్పిన కవితా సంపుటిలో ఇది ఉందా?

  ఎండ్లూరి సుధాకర్ (ఈ మధ్య ఈయన ఎంచేతో రాయడం లేదు) గారి కవితలు కూడా బాగుంటాయి. చిన్ని పదాలలో అనంతమైన భావం పొదగడమే కదా వచన కవిత ప్రాథమిక లక్షణం!అది ఆయన బాగా చేయగలరు..మీ లాగే! ఆయన రాసిన 'ఘూర్ఖా ' చదివారా మీరు? చదవలేదంటే నా బ్లాగులో పెడతాను. (ఎప్పుడో పది పన్నెండేళ్ల నాటి దాని కటింగ్ కూడా ఉంది నా దగ్గర)

  ReplyDelete
 15. చైతన్య గారికి
  నా కవిత మీకు నచ్చినందుకు సంతోషం.
  ఈ కవితలో నేను చెప్పదలచుకొన్న విషయం సుస్ఫష్టమే.
  మీ భావన కరక్టే.
  చివరిపంక్తులు పతాక స్థాయిని చేరుకోవటాన్ని సూచించటం జరిగింది.
  ఇకపోతే నేను ముందు కామెంటులో చెప్పినవిధంగా ఈ కవితకు ప్రేరణ ఈ (http://snehama.blogspot.com/) లింకులో ఇచ్చిన మరో కవితపై నేను చేసిన గురితప్పిన విమర్శ.

  అక్కడ నేనేదైతె అన్యాయంగా ప్రయాణం అనే కవితకు ఆపాదించబోయానో,

  దానినే వస్తువుగా చేసుకొని వ్రాసిన కవిత ఇది. మీ మీ కామెంట్లను బట్టి ఇది సభ్య

  బ్లాగు సమాజం తో ఆమోదముద్ర వేయించుకున్నదనే భావిస్తున్నాను.

  సుజాత గారికి,
  మీ అభిప్రాయాలు తెలిపినందుకు ధన్యవాదములు.
  కొండేపూడి నిర్మల గారు నాకు చాలా చాలా ఇష్టమయిన కవయిత్రి. ఆమె కవితల్లో ఆర్ధ్రత, మంచిమంచి పదచిత్రాలు, సున్నితమైన భావాలు, లోతైన అర్ధాలు ఇవన్నీ నాకు నచ్చుతాయి.

  ఆమె కాక నాకునచ్చే ఇతరులు, చలం, తిలక్, శిఖామణి, ఆశారాజు, జుంబో, ఎండ్లూరి, ఎన్. గోపి, నందిని సిద్దారెడ్డి , రజని వంటివారు అంటే చాలా ఇష్టం.
  మీరు చెప్పిన గూర్ఖా కవిత చదివిన జ్ఞాపకం లేదు. శ్రమనుకోక పోతే, వీలుకుదిరినప్పుడు,పోష్టు చేయగలరు.

  పృధ్వీ గారికి వ్రాసిన బుల్లికవిత గురించయితే - ఆ రెండు వాక్యాలు వ్రాసేసినతరువాత , వాటికి ముందుకానీ తరువాతకానీ, ఎటువంటి వాక్యాలు పెట్టినా అల్పంగానే అనిపించాయి. కనుక ఆ వాఖ్య బుల్లిగానే ఉండిపోయింది.
  భవదీయుడు
  బొల్లోజు బాబా

  ReplyDelete