Friday, May 2, 2008

యానాం విమోచనోద్యమం

యానం విమోచనోద్యమం పుస్తకం గురించి

యానం అనేది గొదావరి ఒడ్డున ఉన్న ఒక యూనియన్ టెరిటరీ. ఇది భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరిజిల్లాలో ఉన్నప్పటికీ పాలనాపరంగా పుదుచేరీ (పాతపేరు పాండిచేరీ) తో అనుసంధానింపబడి ఉంటుంది. అంతేకాక పుదుచేరీ, కారైకాల్, మాహే మరియు యానంలకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇవి 2 శతాబ్ధాల పాటు ఫ్రెంచివారి పాలనలో ఉండి, పంతొమ్మిదివందల యాభైనాలుగులో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందాయి.

భారత స్వాతంత్ర్యసంగ్రామం గురించి ప్రతిభారతీయునికి కొద్దోగొప్పో అవగాహన ఉంటుంది. కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు లో బ్రిటిష్ వారు వెళ్లిపోయిన తరువాత 7 సంవత్సరాలపాటు ఈ స్వతంత్ర్య భారతావని లోని కొన్ని ప్రాంతాలను ఫ్రెంచి వారు పరిపాలించారన్న విషయం, చరిత్ర చదివిన వారికి మాత్రమే తెలుస్తుంది. మరి వారిని కూడా ఈ దేశం నుంది వెళ్ల గొట్టటానికి జరిపిన పోరాటాలు ఎట్టివి? వాటిలో హీరోలెవ్వరు? అసువులు బాసిందెవ్వరు? వంటి విషయాలతొ నేను యానాం విమోచనోద్యమము అనే పుస్తకాన్ని వ్రాయటం జరిగింది.
13-6-1954 న జరిగిన యానం విమోచననేపద్యం, ఆనాటి భావోద్వేగాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, అప్పుడు జరిగిన వివిధ సంఘటనల సమాహారమే ఈ పుస్తకం.

ఈ పుస్తకంలోని కొన్ని అంశాలను క్లుప్తంగా ఈ క్రింది లింకులో పొందుపరిచాను. చదవండి।
http://yanamgurimchi.blogspot.com/2008/05/blog-post.html

3 comments:

  1. ఈ వ్యాసంలో తెలియని చాలా విషయాలు ఉన్నాయి .
    శ్రీనివాస్

    ReplyDelete
  2. మీరు నాకీ పుస్తకాన్ని పంపించారు. థాంక్స్. శైలి బాగుంది. యానానికి సంబంధించి అనేక చారిత్రక విషయాలను తెలుసుకోవడానికి ఎంతోఉపయోగ పడుతుంది. పుస్తకంలో చరిత్రలో మరుగున పడిపోకుండా మంచి చిత్రాలన్నీ పొందుపరిచారు.అభినందనలు
    మీ
    దార్ల

    ReplyDelete
  3. బొల్లోజు బాబా గారూ
    మీ పుస్తకంలో చాలా చారిత్రక విషయాలు వివరించారు.అబినందనలు.కానీ చారిత్రిక నేపద్యం ఒకటే తప్పతెలుగురాష్ట్రంలో యానాన్ని కలపకపోటానికి మరేకారణం లేదుగా?యానాం ను రాష్ట్రంలో కలపాలని అడగకుండా సమైక్యవాదులు ఈ కాలంలో కూడా ఎందుకు విడిచిపెడుతున్నారో అర్ధం కావటం లేదు.ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో890కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 890కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది. గోదావరి తూర్పు డెల్టా కింద యానాం తాగునీటి ట్యాంకులను నింపాల్సి ఉంది.పుదుచ్చేరికి రాష్ర్ట ప్రతిపత్తి కల్పించేందుకు ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నిస్తున్నది. తాళ్లరేవుకు కూతవేటు దూరంలో ఉన్న పుదుచ్చేరి కేంద్రం పాలిత ప్రాంత పరిధిలో యానాం వాసులకు అనేక ప్రత్యేక రాయితీలు అందుతోన్న విషయం విదితమే. రాష్ట్రాలతో పోల్చి చూస్తే కేంద్రపాలిత ప్రాంతంలో పన్ను రాయితీలు ఉన్నందున అక్కడ రేట్లు తక్కువగా ఉంటాయి. జిల్లా మధ్యలో ఉన్న యానాం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నందున కేంద్ర పాలిత ప్రాంత ప్రత్యేకతలు జిల్లావాసులకు ఎరుకే. అక్కడి సౌకర్యాలు అంది పుచ్చుకునేందుకు యానాం వాసులుగా నకిలీ ధ్రువపత్రాలతో ఆంధ్రావాసులు యానాంలో ఉంటున్నట్లు తెలుస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతాలు పరిధి తక్కువ కావడంతో కేంద్ర నిధులు భారీగా ఉండడమే కాకుండా ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు.ఒకరూపాయికే కిలో బియ్యం పధకం ప్రవేశపెట్టారు.యానాంలో పరిశ్రమల స్థాపనకు భారీ మొత్తాల్లో సబ్సిడీలు, ఇతరత్రా సదుపాయాల కోసం అక్కడ పరిశ్రమల స్థాపనకు ఆంధ్రా పారిశ్రామిక వేత్తలు ఉత్సాహం చూపేవారు. అయితే సౌకర్యాలు పొందిన తర్వాత పరిశ్రమలను మధ్యలో వదిలివేసిన సంఘటనలున్నాయి.క్రమేపీ పుదుచ్చేరికి రాష్ర్ట ప్రతిపత్తి కల్పించేందుకు పుదుచ్చేరి ముఖ్యమంత్రి సుముఖత చూపుతుంటే, మంత్రి మల్లాడి కృష్ణారావు మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఇన్ని దశాబ్దాల తరువాతకూడా యానాం ప్రజలు అటు రాష్ట్రప్రతిపత్తికీ ఇటు గ్రేటర్ కాకినాడలో విలీనానికీ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. యానాం ముఖ్యమంత్రి వి వైద్యలింగం కృష్ణాగోదావరి బేసిన్‌ నుంచి తమ ప్రాంతానికి 2.515 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల సహజవాయువును ప్రతిరోజూ సరఫరా చేయాలని గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ గ్యాస్‌ను ఉపయోగిస్తామని పేర్కొన్నారు. కాకినాడ-పుదుచ్చేరిల మధ్య జల మార్గానికి జాతీయ హోదా కల్పించే బిల్లుకు లోక్‌సభ రాజ్య సభ ఆమోదం లభించింది. దాదాపు 970కిమీల పొడవు కలిగిన ఈ జలమార్గంలో 888కిమీలు మన రాష్ట్ర పరిధిలో ఉండగా, ఈ ప్రదేశంలో 14 టెర్మినల్స్ ఏర్పాటు జరుగనుంది.అనసరమైన చోట్ల బకింగ్ హామ్ కాలువకు, బంగాళా ఖాతానికి మధ్య వంతెనలు నిర్మించాలని కోరారు. ఈ జాతీయ జలమార్గం ఏర్పాటు ద్వారా కాకినాడ కాలువ, ఏలూరు కాలువ, కొమ్మమూరు కాలువ, బకింగ్ హామ్ కాలువ,పరిధిలోకి వస్తాయి. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేశారు.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెట్టారు.యానాంలో దేశంలోనే అతిపెద్ద 26 అడుగుల భారతమాత కాంస్య విగ్రహాన్ని విజయవాడకు చెందిన బొర్రా శివప్రసాద్‌ సుందరంగా తీర్చిదిద్దారు.తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.యానాంను తెలుగు ప్రాంత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి.

    ReplyDelete