యానం అనేది గొదావరి ఒడ్డున ఉన్న ఒక యూనియన్ టెరిటరీ. ఇది భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరిజిల్లాలో ఉన్నప్పటికీ పాలనాపరంగా పుదుచేరీ (పాతపేరు పాండిచేరీ) తో అనుసంధానింపబడి ఉంటుంది. అంతేకాక పుదుచేరీ, కారైకాల్, మాహే మరియు యానంలకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇవి 2 శతాబ్ధాల పాటు ఫ్రెంచివారి పాలనలో ఉండి, పంతొమ్మిదివందల యాభైనాలుగులో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందాయి.
భారత స్వాతంత్ర్యసంగ్రామం గురించి ప్రతిభారతీయునికి కొద్దోగొప్పో అవగాహన ఉంటుంది. కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు లో బ్రిటిష్ వారు వెళ్లిపోయిన తరువాత 7
సంవత్సరాలపాటు ఈ స్వతంత్ర్య భారతావని లోని కొన్ని ప్రాంతాలను ఫ్రెంచి వారు పరిపాలించారన్న విషయం, చరిత్ర చదివిన వారికి మాత్రమే తెలుస్తుంది. మరి వారిని కూడా ఈ దేశం నుంది వెళ్ల గొట్టటానికి జరిపిన పోరాటాలు ఎట్టివి? వాటిలో హీరోలెవ్వరు? అసువులు బాసిందెవ్వరు? వంటి విషయాలతొ నేను యానాం విమోచనోద్యమము అనే పుస్తకాన్ని వ్రాయటం జరిగింది.
13-6-1954 న జరిగిన యానం విమోచననేపద్యం, ఆనాటి భావోద్వేగాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, అప్పుడు జరిగిన వివిధ సంఘటనల సమాహారమే ఈ పుస్తకం.
ఈ పుస్తకంలోని కొన్ని అంశాలను క్లుప్తంగా ఈ క్రింది లింకులో పొందుపరిచాను. చదవండి।
