Friday, November 26, 2010
Friday, November 19, 2010
Saturday, November 13, 2010
Saturday, November 6, 2010
ఫ్రెంచి పాలనలో యానాం..... 2
స్పందించి మరలా నన్ను బ్లాగ్లోకంలోకి ఆహ్వానించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
తెలుగులో స్థానిక చరిత్రల వెలికితీత “లోకలిస్టు” బంగొరె అస్తమయంతో కుంటుపడిందనే నా అభిప్రాయం. ఈ రచనను చదివిన నా మిత్రుడు (మంచి అభిరుచికలిగినవాడే) “చరిత్ర ఎవరికి కావాలండీ- ప్రపంచం జెట్టుస్పీడుతో ముందుకు పోతున్న ఈ కాలంలో” అని పెదవి విరిచాడు. యానానికి సంబంధించి ఇక్కడి చరిత్ర ఒక్క స్థానీయమే కాక అంతర్జాతీయ ప్రభావితమని అనిపిస్తుంది
జనజీవన స్రవంతిలో కలవటం ఆనందంగానే ఉంది కానీ రోజు సుమారు ఆరుగంటల ప్రయాణం ప్రాణాల్ని హరించివేస్తుంది. ఫామిలీ షిఫ్ట్ చేసాక కానీ పూర్తిగా రీజువునేట్ కాలేనేమో.
మరలా కలుద్దాం
పి.ఎస్. ఈ వ్యాసాల ప్రింటులో అనేక ముద్రారాక్షసాలు, వాక్యాల మిస్సింగులు ఉన్నాయి. ప్లీజ్ బియర్
భవదీయుడు
బొల్లోజు బాబా
Thursday, November 4, 2010
ఫ్రెంచి పాలనలో యానాం.....
చాలా కాలం గాప్ తరువాత మరలా .......
ఈ విరామ సమయంలో ఎంతో ఆత్మీయంగా నా క్షేమాన్ని విచారించిన అఫ్సర్ గారికి, కత్తి మహేష్ గారికి, చైతన్య గారికి ఇతర మిత్రులకు సదా కృతజ్ఞుడను.
ఈ మధ్య నూతన గృహప్రవేశం, ఆ వెంటనే దూర ప్రాంతానికి ప్రమోషనుమీద (డిగ్రీ కాలేజీ లెక్చరరుగా) బదిలీ కావటం, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక సంవత్సర కాలంగా ఎంతో శ్రమనోడ్చి రచించిన " ఫ్రెంచి పాలనలో యానాం" అనే పుస్తకాన్ని తుది రూపానికి తీసుకురావటం ..... వంటివన్నీ నా ఈ బ్లాగు విరామానికి కారణాలే.
" ఫ్రెంచి పాలనలో యానాం" అనే పుస్తకంలో ఫ్రెంచివారు ౧౭౨౩ లో యానాంలో ప్రవేశించిన నాటినుండి ౧౯౫౪ లో యానాన్ని విడిచివెళ్ళేవరకూ జరిగిన అనేకానేక సంఘటనలు, విశేషాలు ఉంటాయి.
ఈ కాలంలో జరిగిన వాణిజ్యం, యానాన్ని పాలించిన ఫ్రెంచి అధికారులు (పెద్దొరలు), ఇక్కడ ఉన్న ఫ్రెంచి సమాధులలోని వ్యక్తుల వివరాలు, అనాటి విద్యావిధానం, రాజకీయ చిత్రణ, యానాంలో జరిగిన బానిస వ్యాపారం, ఆనాటి సాహితీవేత్తలు, సామాజిక వ్యవస్థ, ప్రకృతి భీభత్సాలు, ఫ్రెంచివారు యానాంలో చేసిన పబ్లిక్ వర్క్ లు, అప్పటి జ్యుడిషియల్ వ్యవస్థ, బాల్య వివాహాలు వంటి వివిధ అంశాలతో కూడుకొన్న వ్యాసాలతో (ఒక్కొక్కటి మూడునుంచి ముప్పై పేజీల మధ్య మొత్తం నూటయాభై పేజీలు) ఈ పుస్తకం ఉంటుంది. దీని రచనకొరకు సుమారు ఓ రెండువేల డాక్యుమెంట్లను పరిశోధించవలసి వచ్చిందనటం అతిశయోక్తికాదు. (ఎక్కువ శాతం ఫ్రెంచి లో ఉన్నవి- ఈ సందర్భంలో గూగుల్ ట్రాన్స్ లేటర్ ఎంతగానో ఉపయోగపడింది. మాచవరం మాధవగారు, బులుసు చైతన్య, కె. క్యూబ్ వర్మ గారికి ధన్యవాదాలు)
వీటిని ప్రస్తుతం ’జనమిత్ర’ అనే ఒక స్థానిక పత్రికలో సీరియల్ గా వెలువరించటం జరుగుతున్నది. త్వరలో పుస్తకరూపంలోకి తీసుకు రావాలని ఉంది.

Wednesday, July 21, 2010
వారిలో ఒకరు (ONE OF THEM)-- P.P. Ramachandran
వారిలో ఒకరు
స్కూలు బస్ స్టాప్ వద్ద అమ్మాయిలు
బస్సుకోసం ఎదురుచూస్తున్నారు
ఎంత ప్రయత్నించినా
వలికే దేహ సౌందర్యాన్ని
గొడుగులు, బ్యాగులు, జోళ్లు, యూనిఫార్మ్ లు
నిలువరించలేక పోతున్నాయి.
బయటకురికే వారి హృదయాలను
వారి మాటలు, చూపులు, భంగిమలూ
ఏ మాత్రం దాచలేక పోతున్నాయి.
కళ్ళముందే బస్సులు దాటిపోతూంటే
ఆందోళన పెరుగుతూంటుంది.
*****
వారిలో ఒకామె ప్రభుత్వాధికారి
మరొకామె ఓ గృహణి అవుతారు
ఇంకొకామె దారి తప్పుతుంది.....
ఆ స్కూలు పక్కనుంచి సాగే బస్సులో
ఒళ్లో పిల్లాడ్ని పెట్టుకొని కూర్చున్న ఆమె తన భర్తతో
"ఈ స్కూల్లోనే నేను చదువుకొన్నది" అంటోంది.
అక్కడ ఇంకా ఒకరు బస్సుకోసం
ఎదురుచూస్తూనే ఉంటారు
ఇప్పటికీ!
Source: ONE OF THEM -- P.P. Ramachandran
Wednesday, July 14, 2010
ప్రార్ధన
ఇప్పుడిక ఓ ఎడారిని ప్రసాదించు
వర్షించే ఇసుకా, ప్రవహించే ఎండా
దిగంతాలవరకూ
పరచుకొన్న ఏకాంతం
నిర్జల సరోవరాల తో కూడిన
ఓ ఎడారి కావాలిపుడు.
దానికేమాత్రం తగ్గినా
ఈ ఘడియ రక్తికట్టదు.
లేదా
ఓ సముద్రాన్నిప్పించు
దేహాన్ని తేల్చుతూ ఉండేంత ఉప్పని నీరు
చుట్టూ విశాలంగా విస్తరించిన ఏకాంతం
కింద వెచ్చని బడబాగ్ని
పైన చల్లని సుడిగాలులతో కూడిన
ఓ ఉప్పని సముద్రమైనా చాలు
సరిగా సరిపోతుంది.
లేక పోతే
ఓ రాత్రిని అనుగ్రహించు
అన్ని వైపుల్నుంచీ వీచే నల్లని గాలి
మువ్వలచేతికర్రతో సాగే నేత్రధ్వయం
స్పటికం లా వణికే చిక్కని నీలిమా
పొదలమాటున మెరిసే కనుల ఏకాంతంతో కూడిన
ఓ రాత్రయినా చాలు సందర్భోచితంగా ఉంటుంది.
లేదా.........
బొల్లోజు బాబా
Tuesday, July 6, 2010
శిలపరశెట్టి పురస్కార సభా విశేషాలు

ముందు పోస్టులో చెప్పిన విధంగా శిలపరశెట్టి పురస్కార సభ ఆంధ్రాయూనివర్సిటీ తెలుగువిభాగం సమావేశమందిరంలో జరిగింది. ఈ సభకు ప్రముఖ కవయిత్రి, అనువాదకురాలు జగద్దాత్రి గారు అధ్యక్ష్యత వహించారు. డా. కాళీపట్నం రామారావు గారు ముఖ్య అతిధి గా వచ్చారు. ప్రముఖ కవి విమర్శకులు శ్రీ రామతీర్ధ గారు నా కవితా సంకలనం పై సుదీర్ఘమైన విశ్లేషణ చేసారు. కాళీపట్నం రామారావు గారి చేతులమీదుగా శ్రీరాధేయ గారికి నాకు పురస్కారాలు ప్రధానం చేయటం జరిగింది. ట్రుస్టు నిర్వాహకులైన శ్రీ సనారా గారు, శ్రీ శిలపరశెట్టి మోహన్ కుమార్ గారు ప్రసంగించారు. ఈ కార్యక్రమం తరువాత కుమారి నికితా మోహన్ రచించిన "Penchant" అనే ఇంగ్లీషు కవితా సంకలనావిష్కరణ జరిగింది. ఈ పాప వయసు 12 సంవత్సరాలు. ఈ సభలో శ్రీ కొంపెల్ల, శ్రీ జోగారావు, శ్రీ గరిమెళ్ల నాగేశ్వరరావు, శ్రీ ఎల్.ఆర్. స్వామి వంటి ప్రముఖ సాహితీ వేత్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాకు అభినందనలు తెలియచేసిన అందరకూ ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.
భవదీయుడు
బొల్లోజు బాబా
Saturday, July 3, 2010
నా కవితా సంకలనానికి శిలపరశెట్టి స్మారక ప్రత్యేక ప్రశంస అవార్డు
నా "ఆకుపచ్చని తడిగీతం" కవితాసంకలనం 2009 సంవత్సరానికి గాను శిలపరశెట్టి రాములు నాయుడు స్మారక ప్రత్యేక ప్రశంసా పురస్కారానికి ఎంపికయ్యింది.
ప్రముఖ కవి, విమర్శకుడు శ్రీ రాధేయ గారి "అవిశ్రాంతం" ఉత్తమ కవితా సంపుటి పురస్కారం పొందింది. "మగ్గం బతుకు" అనే కవితాసంపుటి ద్వారా చేనేత కార్మికుల దీన స్థితిగతులను అద్భుతంగా అక్షరీకరించి లబ్ధప్రతిష్టులైన రాధేయ గారి సరసన కూర్చునే అదృష్టాన్ని కలిగించిన శిలపరసెట్టి రాములు నాయుడు ట్రస్టు నిర్వాహకులు శ్రీ మాధవీ సనారా గారికి, న్యాయనిర్ణేతలు శ్రీ రామతీర్ధ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.
సమావేశ వివరాలు
సమయం: 5:30 ని.
తేదీ: 04-07-2010
స్థలం: ఆంద్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సమావేశ హాలు
పురస్కార ప్రధాత: డా. కాళీపట్నం రామారావు గారు.
భవదీయుడు
బొల్లోజు బాబా

సమావేశ వివరాలు
సమయం: 5:30 ని.
తేదీ: 04-07-2010
స్థలం: ఆంద్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సమావేశ హాలు
పురస్కార ప్రధాత: డా. కాళీపట్నం రామారావు గారు.
నన్నింతకాలం ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించిన బ్లాగ్మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.
భవదీయుడు
బొల్లోజు బాబా
Thursday, June 3, 2010
ఆంధ్రప్రభ దిన పత్రికలో వచ్చిన ఒక వ్యాసంలో నా కవిత ప్రస్తావన .....
ఆంధ్రప్రభ దిన పత్రికలో వచ్చిన ఒక వ్యాసంలో నా కవితల ప్రస్తావన .....
వ్యాసకర్త సాంధ్యశ్రీ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.
ఈ పాపికొండల్నే మరో కవి దర్శించాడు. ఆ నదీ నీటి బిందువులోంచి మధుర నాదం విన్పించిందట. అక్కడి ప్రజలగుండెల్లో ఆ నదికీ ఆ కొండలకీ గొప్ప మహత్తు ఉందంటున్నారు ఆ నది పిల్లలకు చాక్లెట్లు పంచిపెట్టే చర్చి ఫాదర్‌లా జాలర్లకు చేపలు పంచుతోందంటున్నాడు. ''నదికి అడ్డంగా పెద్దకొండ / ప్రవాహం ఆగలేదు/ మలుపు తీసుకొంది/ జీవితంలానే / డామ్ సంకెళ్లు వేయించుకోబోతున్న / ఈ నదీ ప్రవాహాన్ని చూస్తూంటే జాలేస్తుంది/ ఇకపై కూడికలు, తీసివేతలు ప్రకారం ప్రవహించాలి / ఒక్క క్షణం ఆగానో లేదో/ నది నన్ను దాటుకొని / నవ్వు కొంటూ వెళ్లిపోయింది. - బొల్లోజు బాబా
పూర్తి వ్యాసాన్ని ఈ క్రింది లింకులో చదవగలరు
http://www.andhraprabha.in/search/article-112855

Subscribe to:
Posts (Atom)