Wednesday, July 21, 2010
వారిలో ఒకరు (ONE OF THEM)-- P.P. Ramachandran
వారిలో ఒకరు
స్కూలు బస్ స్టాప్ వద్ద అమ్మాయిలు
బస్సుకోసం ఎదురుచూస్తున్నారు
ఎంత ప్రయత్నించినా
వలికే దేహ సౌందర్యాన్ని
గొడుగులు, బ్యాగులు, జోళ్లు, యూనిఫార్మ్ లు
నిలువరించలేక పోతున్నాయి.
బయటకురికే వారి హృదయాలను
వారి మాటలు, చూపులు, భంగిమలూ
ఏ మాత్రం దాచలేక పోతున్నాయి.
కళ్ళముందే బస్సులు దాటిపోతూంటే
ఆందోళన పెరుగుతూంటుంది.
*****
వారిలో ఒకామె ప్రభుత్వాధికారి
మరొకామె ఓ గృహణి అవుతారు
ఇంకొకామె దారి తప్పుతుంది.....
ఆ స్కూలు పక్కనుంచి సాగే బస్సులో
ఒళ్లో పిల్లాడ్ని పెట్టుకొని కూర్చున్న ఆమె తన భర్తతో
"ఈ స్కూల్లోనే నేను చదువుకొన్నది" అంటోంది.
అక్కడ ఇంకా ఒకరు బస్సుకోసం
ఎదురుచూస్తూనే ఉంటారు
ఇప్పటికీ!
Source: ONE OF THEM -- P.P. Ramachandran
Subscribe to:
Post Comments (Atom)
బాబా గారూ!
ReplyDeleteఇదెప్పటికీ ఓ 'సమకాలీన' కవిత!
థాంక్స్!
baagundi
ReplyDeleteప్రియమైన ఆము, మన యానంలోని ఏకైక బ్లాగ్ వీరుడవు నీవేనని అనుకుంటున్నా. నీ బ్లాగులని ఫాలో అవుతున్నా. కానీ విషయము నా స్థాయిని మించి వుంది. నేను నీ స్నేహితుడనయినందుకు సంతొషిస్తున్నా. all the best
ReplyDeletedear khandavilli ramakrishna
ReplyDeletehow are you
you are the first person to call me as amu in this blogworld after 3 years of existence here.
very very happy of it.
thank you
krishnasree gaaru, john hide gaariki dhanyavaadaalu
bollojubaba
బాబాగారు,
ReplyDeleteనాకు అనువాదాలతో పరిచయం తక్కువ పైగా మీది రెండో తరం అనువాదమనుకుంటా.
మాటలతికాయనిపించింది కాని ...స్పిరిట్ ....మ్మ్. The flavour of active attempts of girls to contain their racing hearts is missing from your english version. ముఖ్యంగా lined with anxiety.....కి న్యాయం జరగలేదనిపించింది.
ఒక చిన్న అనుమానం ...పాత్రోచితమనా "ఒకామెకు" గౌరవవాచకం ఇంకోకామెకు ఏకవచన ప్రయోగం?
ఆకుపచ్చని తడి గీతంతో మీరు గుర్తుండిపోవటం మీ తప్పే మరి :-)