Thursday, November 4, 2010

ఫ్రెంచి పాలనలో యానాం.....

చాలా కాలం గాప్ తరువాత మరలా .......
ఈ విరామ సమయంలో ఎంతో ఆత్మీయంగా నా క్షేమాన్ని విచారించిన అఫ్సర్ గారికి, కత్తి మహేష్ గారికి, చైతన్య గారికి ఇతర మిత్రులకు సదా కృతజ్ఞుడను.


ఈ మధ్య నూతన గృహప్రవేశం, ఆ వెంటనే దూర ప్రాంతానికి ప్రమోషనుమీద (డిగ్రీ కాలేజీ లెక్చరరుగా) బదిలీ కావటం, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక సంవత్సర కాలంగా ఎంతో శ్రమనోడ్చి రచించిన " ఫ్రెంచి పాలనలో యానాం" అనే పుస్తకాన్ని తుది రూపానికి తీసుకురావటం ..... వంటివన్నీ నా ఈ బ్లాగు విరామానికి కారణాలే.

 " ఫ్రెంచి పాలనలో యానాం"  అనే పుస్తకంలో ఫ్రెంచివారు ౧౭౨౩ లో యానాంలో ప్రవేశించిన నాటినుండి ౧౯౫౪ లో యానాన్ని విడిచివెళ్ళేవరకూ జరిగిన అనేకానేక సంఘటనలు, విశేషాలు ఉంటాయి.

ఈ కాలంలో జరిగిన వాణిజ్యం, యానాన్ని పాలించిన ఫ్రెంచి అధికారులు (పెద్దొరలు), ఇక్కడ ఉన్న ఫ్రెంచి సమాధులలోని వ్యక్తుల వివరాలు, అనాటి విద్యావిధానం, రాజకీయ చిత్రణ, యానాంలో జరిగిన బానిస వ్యాపారం, ఆనాటి సాహితీవేత్తలు, సామాజిక వ్యవస్థ, ప్రకృతి భీభత్సాలు, ఫ్రెంచివారు యానాంలో చేసిన పబ్లిక్ వర్క్ లు, అప్పటి జ్యుడిషియల్ వ్యవస్థ, బాల్య వివాహాలు వంటి వివిధ అంశాలతో కూడుకొన్న వ్యాసాలతో (ఒక్కొక్కటి మూడునుంచి ముప్పై పేజీల మధ్య మొత్తం నూటయాభై పేజీలు) ఈ పుస్తకం ఉంటుంది.  దీని రచనకొరకు సుమారు ఓ రెండువేల డాక్యుమెంట్లను పరిశోధించవలసి వచ్చిందనటం అతిశయోక్తికాదు. (ఎక్కువ శాతం ఫ్రెంచి లో ఉన్నవి- ఈ సందర్భంలో గూగుల్ ట్రాన్స్ లేటర్ ఎంతగానో ఉపయోగపడింది. మాచవరం మాధవగారు, బులుసు చైతన్య, కె. క్యూబ్ వర్మ గారికి ధన్యవాదాలు)

వీటిని ప్రస్తుతం ’జనమిత్ర’ అనే ఒక స్థానిక పత్రికలో సీరియల్ గా వెలువరించటం జరుగుతున్నది. త్వరలో పుస్తకరూపంలోకి తీసుకు రావాలని ఉంది.

బొల్లోజు బాబా

9 comments:

  1. అభినందనలు. జనజీవనస్రవంతిలో మళ్ళీ కలిసినందుకు ఆనందంగా ఉంది :)
    We surely missed you.

    ReplyDelete
  2. Welcome back Baba garu.. Congratulations for completing your work.

    ReplyDelete
  3. అవును, కత్తి అన్నట్టు..మీరు జనజీవన స్రవంతిలోకి రావడం బాగుంది.

    మీ రాక మాకు ఎరువాక!

    స్థానిక చరిత్రల మీద ఎంత వీలయితే అంత పని జరగాలి. ఆ దిశగా మీరు అడుగు వేసినందుకు సంతోషంగా వుంది. పైగా, నన్ను కదిపీ కుదిపిన యానాం గురించి రాస్తే అంతకన్నా సంతోషం ఏముంది?

    ReplyDelete
  4. సంతోషం. అన్ని అభివృద్ధులకీ కలిపి ఒక్క అభినందన మాల.

    ReplyDelete
  5. welcome back Baba gaaru,
    అభివృద్దులన్నిటికీ అభినందనలు :-)

    ReplyDelete
  6. ముందుగా మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందినందుకు అభినందనలు.
    రాం ద్వారా యానాం కూడా నాకు కన్నఊరులా అయ్యింది. మన ఊరి చరిత్రను పుస్తక రూపంలో తెస్తున్నందుకు అభినందనలు...
    ఇకపై కవిత్వాన్ని ఆశిస్తూ...

    ReplyDelete
  7. thank you mahesh, afsargaru, kothapali garu, varmagaru, saayi kiran gaaru.

    thank you very much for the warmth upon me

    bollojubaba

    ReplyDelete
  8. baba garu, have released your book "Frencchi palanalo Yanam" if so where can i get these book.
    i very much interested to know more about french rule in yanam, suggest me some books


    tanikella sreenivas

    ReplyDelete