Tuesday, July 6, 2010

శిలపరశెట్టి పురస్కార సభా విశేషాలు



ముందు పోస్టులో చెప్పిన విధంగా శిలపరశెట్టి పురస్కార సభ ఆంధ్రాయూనివర్సిటీ తెలుగువిభాగం సమావేశమందిరంలో  జరిగింది.  ఈ సభకు ప్రముఖ కవయిత్రి, అనువాదకురాలు జగద్దాత్రి గారు అధ్యక్ష్యత వహించారు. డా. కాళీపట్నం రామారావు గారు ముఖ్య అతిధి గా వచ్చారు.  ప్రముఖ కవి విమర్శకులు శ్రీ రామతీర్ధ  గారు నా కవితా సంకలనం పై సుదీర్ఘమైన విశ్లేషణ చేసారు. కాళీపట్నం రామారావు గారి చేతులమీదుగా శ్రీరాధేయ గారికి నాకు పురస్కారాలు ప్రధానం చేయటం జరిగింది. ట్రుస్టు నిర్వాహకులైన శ్రీ సనారా గారు, శ్రీ శిలపరశెట్టి మోహన్ కుమార్ గారు ప్రసంగించారు.  ఈ కార్యక్రమం తరువాత కుమారి నికితా మోహన్ రచించిన "Penchant" అనే ఇంగ్లీషు  కవితా సంకలనావిష్కరణ జరిగింది.  ఈ పాప వయసు 12 సంవత్సరాలు. ఈ సభలో శ్రీ కొంపెల్ల, శ్రీ జోగారావు, శ్రీ గరిమెళ్ల నాగేశ్వరరావు, శ్రీ ఎల్.ఆర్. స్వామి వంటి ప్రముఖ సాహితీ వేత్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాకు అభినందనలు తెలియచేసిన అందరకూ ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.

భవదీయుడు
బొల్లోజు బాబా

10 comments:

  1. అభినందనలు

    ReplyDelete
  2. మరొకసారి అభినందనలు. ఈ వివరాలకి థాంక్స్.

    ReplyDelete
  3. చాలా చాలా ఆనందంగా ఉంది. hearty congrats.

    ReplyDelete
  4. బాబాగారూ, అభినందనలు. ఫొటోలో మరోసారి చూస్తే కాని మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను! :-)

    ReplyDelete
  5. అభినందనలు. చాలా ఆనందంగా ఉంది.

    ReplyDelete
  6. నా అభినందనలు కూడా అందుకోండి బాబాగారు.

    ReplyDelete
  7. బాబాగారు, ఇప్పుడే చూశాను... చాలా సంతోషంగా ఉంది. నా హృదయపూర్వక శుభాకాంక్షలు..మరిన్ని అవార్డ్స్ అందుకోవాలని కోరుకొంటూ..మీ
    దార్ల

    ReplyDelete