Saturday, July 3, 2010

నా కవితా సంకలనానికి శిలపరశెట్టి స్మారక ప్రత్యేక ప్రశంస అవార్డు

నా "ఆకుపచ్చని తడిగీతం" కవితాసంకలనం 2009 సంవత్సరానికి గాను శిలపరశెట్టి రాములు నాయుడు స్మారక  ప్రత్యేక ప్రశంసా పురస్కారానికి ఎంపికయ్యింది.

ప్రముఖ కవి, విమర్శకుడు శ్రీ రాధేయ గారి "అవిశ్రాంతం"  ఉత్తమ కవితా సంపుటి పురస్కారం పొందింది. "మగ్గం బతుకు" అనే కవితాసంపుటి ద్వారా చేనేత కార్మికుల దీన స్థితిగతులను అద్భుతంగా అక్షరీకరించి లబ్ధప్రతిష్టులైన రాధేయ గారి సరసన కూర్చునే అదృష్టాన్ని కలిగించిన శిలపరసెట్టి రాములు నాయుడు ట్రస్టు  నిర్వాహకులు శ్రీ మాధవీ సనారా గారికి, న్యాయనిర్ణేతలు శ్రీ రామతీర్ధ గారికి   ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను. 

సమావేశ వివరాలు

సమయం: 5:30 ని.


తేదీ: 04-07-2010

స్థలం: ఆంద్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సమావేశ హాలు

పురస్కార ప్రధాత:  డా. కాళీపట్నం రామారావు గారు.


నన్నింతకాలం ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించిన బ్లాగ్మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.

భవదీయుడు
బొల్లోజు బాబా

20 comments:

  1. congrats sir. you deserve it.

    ReplyDelete
  2. బాబా గారూ హృదయపూర్వక శుభాకాంక్షలు..

    ReplyDelete
  3. బాబా: హృదయ పూర్వక అభినందనలు. పురస్కారాలు మంచి కవిత్వానికి కొలమానాలు కావు గానీ, మంచి కవిత్వానికి పురస్కారాలు దక్కినప్పుడు- పురస్కారాల మీద గౌరవం పెరుగుతుంది. పురస్కారాల చరిత్ర కూడా బాగుపడుతుంది. ఇది అలాంటి ఆకుపచ్చని దృశ్యం.

    ReplyDelete
  4. బాబా గారూ, హృదయ పూర్వక అభినందనలు. Sometimes some happenings just reassure us of the good values and this is one among such! You deserve it pretty much. Having read the book, affectionately signed by you I had wished the then day for a honor at this level. Kudos and sure you would share with us many more.

    ReplyDelete
  5. A well deserved recognition. Congratulations!!!!

    ReplyDelete
  6. అఫ్సర్ గారి మాట అక్షరాలా నిజం!

    కాళీపట్నం రామారావు గారి చేతుల మీదుగా పురస్కారం అందుకోబోతున్నారన్నమాట. మనఃపూర్వక అభినందనలు బాబాగారూ!

    ReplyDelete
  7. హృదయపూర్వక అభినందనలు

    ReplyDelete
  8. హృదయపూర్వక అభినందనలు. ప్రత్యేకంగా కాళీపట్నం మాష్టారు చేతులమీదుగా అందుకున్నందుకు మీకు మరీ మరీ రెట్టింపు అభినందనలు.

    ReplyDelete
  9. అభినందనలండి. మీ ద్వారా తెలుగు బ్లాగుకు కూడా ఓ ప్రశంస లభించింది.

    ReplyDelete
  10. అభినందనలు తెలిపిన అందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను. అఫ్సర్ గారి ఆశీస్సులకు సదా కృతజ్ఞుడను.

    భవదీయుడు
    బొల్లోజు బాబా

    ReplyDelete
  11. మీకు నా అభినందనలు బాబా గారూ !

    ReplyDelete
  12. బొల్లోజు బాబాగారూ, ఇప్పుడే చూశాను మీకవితా సంకలనానికి పురస్కారం వచ్చినట్టు. మనఃపూర్వక అభినందనలు. మీరిలాగే ఇతోధికంగా కవితలు రాయాలనీ, పురస్కారాలు అందుకోవాలనీ శుభాకాంక్షలతో,

    మాలతి

    ReplyDelete
  13. బాబాజీ !! బ్లాగ్లోకం వైపు దృష్టి కేంద్రీకరించక, ... మీ బ్లాగును వీక్షించక కూడా చాల రోజులైంది . ఈ వేళ "మరువం" లో ఉష గారికి మీరందించిన ఉపశమన వ్యాఖ్యను చూసి, మీ బ్లాగును పలకరిద్దామని ఒకసారి అలా వస్తే మీ .."ఆకుపచ్చని తడి గీతం"
    సంకలనానికి పురస్కారం వచ్చిన విషయం యిప్పుడే తెలిసి కొంచం విలంబన జరిగినా .. అందుకోండి.
    ఇవే నా హృదయపూర్వక అభినందనలు.మరింకె న్నెన్నో పురస్కారా లందుకొని, మీ సాహితీవనంలో సాహితీ మధువులనందించే పుష్పాలు విరబూయాలని ఆకాంక్షిస్తూ ...అభినందనలతో శ్రేయోభిలాషి ...నూతక్కి

    ReplyDelete