పార్కు బెంచీపై ఒంటరిగా కుర్చొన్నాను
కేరింతలు వినబడనంత దూరంగా
పిల్లలు ఆడుకొంటున్నారు
ఎక్కడినుంచి వచ్చాయో కిచకిచమంటూ
పిచ్చుకల గుంపొకటి నా ముందు వాలింది
రొద... రొ..ద...రొ...ద
ఒకటే శబ్దబీభత్సం
పాడు పిచ్చుకలు... పాడుపిచ్చుకలు
చెట్లను తప్పించుకొంటూ
గుంపుగా పైకి లేస్తూ వాలుతూ
రొద... రొ..ద... ఒకటే రొద
చెవులు గళ్ళెత్తిపోతున్నాయి
సన్నని తీగలా నొప్పి మొదలైంది
రెండుచెవుల్లో
సన్నని తీగలా నొప్పి మొదలైంది
రెండుచెవుల్లో
దూరంగా వెళిపోదామనుకొనే లోపే
రెక్కలు తపతపలాడించుకొంటు
ఎటో ఎగిరిపోయాయి
భయంకరమైన నిశ్శబ్దం
బొల్లోజు బాబా
ReplyDeleteపిచ్చుకలొచ్చే రొదరొద
లొచ్చే భీభత్సమైన రొచ్చులు ! ఛీ! సీ!
పిచ్చుక లెగిరెన్ శాంతం
బిచ్చట నిశ్శబ్దమై ప్రవేశించెనుగా !
జిలేబి
అవునవును అండీ
Delete