Saturday, May 22, 2021

Imported post: Facebook Post: 2021-05-22T21:11:01

చిన్నారి థాంక్యూ. చిన్నారి నా బాల్యమిత్రుడు. ఒకటోతరగతి నుంచి ఒకే బెంచిమీద కూర్చొని చదూకున్నాం. టెంత్ తరువాత తను ఆర్ట్స్ కి నేను సైన్సుకీ విడిపోయాం. నా పుస్తకాలకు కవర్ పేజ్ లు చిన్నారితో వేయించుకోవటం నాకు సెంటిమెంట్. కొన్నింటికి ఫ్రంట్ పార్ట్ బయటివారు వేసినప్పటికీ బాక్ పేజ్ చిన్నారి చెయ్యవలసిందే. అలా చేయటానికి ఏనాడు ఈగో ఫీలవకపోవటం చిన్నారి మంచితనం. కవర్ పేజ్ చేసేటపుడు ఇక్కడ రంగుమార్చు, ఈ ఫాంటు మార్చు, ఇది సైజు పెంచు అంటూ ఎంత ఇబ్బంది పెట్టినా ఏనాడూ విసుగు అనేది నేను చూడలేదు. అంత ఓపిక వృత్తిరీత్యా డ్రాయింగ్ టీచర్. పాతికేళ్ళక్రితం రీజెన్సీ సిరామిక్స్ లో పనిచేసేటపుడు ఫొటోషాప్ డిజైనింగ్ ఇటలీ వెళ్ళి నేర్చుకొన్నాడు. అప్పట్లో యానాం రీజెన్సీ టైల్స్ డిజైన్స్ అన్నీ చిన్నారి చేసినవే. డిజిటల్ ఆర్ట్ ని పక్కన పెడితే చిన్నారి is best at Charcoal Art. అతని ఇంట్లో గోడలను అలంకరించి ఉండే అనేక పెయింటింగ్స్ చూస్తే ఇతని నైపుణ్యానికి ఆశ్చర్యపడతాం. ఇప్పుడు ఫేస్ బుక్ వాల్స్ పై మిత్రుల ఫొటోలను డిజిటల్ పిక్స్ గా చేసి అందరినీ సర్ ప్రైజ్ చేస్తున్నాడు. చిన్నారికి ఖాళీ ఎక్కడ ఉంటుందా అని ఆశ్చర్యం వేస్తుంది. బహుసా ఈ కరోనా క్వారన్ టైన్, లాక్ డౌన్ ప్రభావం కావొచ్చు. ఇంత భయానక పరిస్థితులలో నలుగురికీ నవ్వులు, సర్ప్రైజెస్ పంచుతోన్న ఈ ప్రయత్నం మిత్రుల పై నిష్కల్మషమైన ప్రేమే తప్ప మరేమీ కాదని అనుకొంటాను. వారి తండ్రిగారి టైము నుంచే ఆర్ధికంగా బాగా ఎదిగిన కుటుంబం వీరిది. నాకు తెలిసి యానాంలో మా సర్కిల్ లో పది లక్షల విలువచేసే స్పోర్ట్స్ బైక్ వాడింది చిన్నారే. చిన్నారి అన్నగారు డాక్టరు. చిన్నారికి ఇద్దరు అబ్బాయిలు, వారి శ్రీమతి ప్రభుత్వ టీచర్. చిన్నారి మంచి కవి. అతని వద్ద కనీసం ఒక ఐదు పుస్తకాలకు సరిపడా కవితలు ఉన్నాయి. పుస్తకం తేవయ్యా మహానుభావా అంటే నవ్వి ఊరుకొంటాడు. బద్దకం కాదు, పెర్ ఫెక్షన్ కోసం అనుకొంటాను. నిజానికి చిన్నారి అముద్రిత కవితలు పెర్ ఫెక్షన్ కు ఓ మెట్టు పైనే ఉంటాయి. ఎంతచెప్పినా నా మాట నమ్మడు. (మీరైనా చెప్పండీసారి.. వీలైతే) చిన్నారి మంచి ఆర్గనైజర్. తన గంభీరమైన స్వరంతో సమయోచిత చతురోక్తులతో సభలను ఆద్యంతం రక్తికట్టించేలా నడిపిస్తాడు. కవి సంధ్య యానాంలో జరిపే సభల వెనుక చిన్నారి పాత్ర గణనీయమైనది. సౌమ్యుడు, సమర్ధుడు, సహృదయుడు అయిన చిన్నారి నా బాల్యమిత్రుడు కావటం అదృష్టంగా భావిస్తాను. నీ తలపుల్లో నేను ఉన్నందుకు, నీ జ్ఞాపకాల నీడలలో నాకూ చోటున్నందుకు, నీ సమయాన్ని నాకొరకు వెచ్చించగలిగే అర్హత నాకిచ్చినందుకూ .... అనంతానంత ధన్యవాదములతో, అభినందనలతో, బొల్లోజు బాబా






No comments:

Post a Comment