Wednesday, May 12, 2021

Imported post: Facebook Post: 2021-05-12T23:47:08

Mona Sa'udi కవిత్వం . Mona Sa'udi 1945 లో జోర్డాన్ లో జన్మించారు. కవయిత్రిగా, ఆధునిక శిల్పకారిణిగా ఈమె ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. Darwish, Adonis లు తనకు ప్రేరణ అనే ఈమె కవిత్వంలో దార్విష్ శైలి ప్రముఖంగా కనిపిస్తుంది. Ruya Ula (First Visions), In Times of War Children Testify ఈమె కవిత్వ సంపుటులు. Mona Sa'udi కవిత్వంలో దుఃఖపు జీర, మిరిమిట్లు గొలిపే ప్రతీకలు ఆకర్షిస్తాయి. *** 1. అంధనగరం దాని వీధుల్లో నా చూపులు విస్తరిస్తాయి వస్తువుల గందరగోళంలో నిద్రలేమి పద్మవ్యూహంలో నిశ్చల సముద్రం, కాలం రాత్రి మృత్యువుల నిశ్శబ్దపు స్వరాలు వింటాను. దుఃఖించే పేవ్ మెంట్లతో నన్ను నేను వెచ్చబరచుకొంటాను అక్కడ చిన్న నీటిగుంటలో సైతం కాంతి చిమ్మే జీవితం తళుక్కున మెరుస్తుంది. 2. ఉప్పు స్పటికాల ఓడలపై ఎడారులు నిండిన నిశీధి నగ్నత్వంపై నక్షత్రాల త్రోవల్లో, గ్రహాల దారుల్లో నా ప్రయాణం. స్వప్నాల రేవులో నాకు నేను దొరుకుతాను ఈ ప్రపంచం ఒక ఆటబొమ్మ స్థాయికి కుదించుకుపోయింది అంధగాయకుడొకరు పాటఎత్తుకొంటాడు రాత్రి చీకటిపై కాసేపు తచ్చాడుతాను అంధులైన అందరితో ప్రేమలో పడతాను ఈ రాత్రి నేను జన్మిస్తాను ఈ రాత్రి నేను మరణిస్తాను జీవించి ఉన్న అందరకూ అభినందనలు మరణించినవారికి కూడా. 3. శవపేటికలోని ఏకాంతం అంగడిలోని అనామక వస్తువులపై కాసేపు వాలి అంత్యక్రియల రోదనశబ్దాలుగా పైకి లేచింది. నేను కన్నీళ్ళకన్నా ధృఢంగా మారతాను కన్నీళ్ళు శిలారూపం పొందుతాయి శిల, నేను నిలుపుకోలేకపోయిన ఓ స్నేహితుడు సకల పరిమాణాలలో నేను విచ్ఛిన్నమౌతాను హెచ్చవేయబడతాను ద్రవంలా భిన్న ఆకారాలు పొందుతాను. . Source: Mona Sa'udi poems అనువాదం: బొల్లోజు బాబా

No comments:

Post a Comment