Wednesday, May 5, 2021
Imported post: Facebook Post: 2021-05-05T23:00:42
రక్తచుంబనం
దయలేని ఈ సాయింత్రం
కళ్ళల్లో
ఎండుటాకుల్నీ, తుమ్మముళ్ళనీ
ఎడారి తునకల్ని, తూనీగరెక్కల్ని
కుమ్మరిస్తోంది.
గరుకుకాగితంలాంటి తన నాలుకను
నోట్లో జొనిపి
గాఢంగా గొప్ప తమకంతో చుంబిస్తోంది
నోరంతా ఉప్పని రక్తం రుచి
సాయింత్రపు తీరంపై అలలు అలలుగా
ఒకే మృత్యుగీతం పదే పదే
ప్రతిధ్వనిస్తోంది
ఇంతమందిని
దాటుకొంటూ ముందుకు నడవటం
ఎవరి నీడల మధ్య వారే సంచరించటం
శిక్షే కావొచ్చు బహుశా ఎప్పటికీ!
బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment