అనువాద కవిత్వం e-book
.
ఇంతవరకూ చేసిన అనువాద కవితలను అన్నింటిని ఒక ebook రూపంలోకి తీసుకొచ్చాను. దానిని ఇక్కడనుంచి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును.
.
https://archive.org/details/bolloju-baba-translations
***
ఈ పుస్తకానికి వ్రాసుకొన్న కొన్ని మాటలు, కవర్ పేజ్, కంటెంట్స్ పేజ్ ఫొటోలు.
***
మనవి మాటలు
ఒక అనువాద కవిత
మట్టి ముద్దను పాత్రగా మలచు
దాని శూన్యతలోనే
దాని ఉపయోగం ఉంటుంది.
గుమ్మాలు, కిటికీలతో
గృహాన్ని నిర్మించు
దాని శూన్యతలోనే
దాని ఉపయోగం ఉంటుంది.
దేన్నో పొందుతూ ఉంటాం కానీ
దాని శూన్యతనే వాడుకుంటూ ఉంటాం.
మూలం: టావో టె షింగ్ (Mould Clay into a vessel)
SEPTEMBER 22, 2008
నేను మొదటిసారిగా సోషల్ మీడియాలో నా బ్లాగు ద్వారా పోస్ట్ చేసిన అనువాదమిది. ఆ తరువాత విశ్వకవి రవీంద్రుని స్ట్రే బర్డ్స్ అనువదించి స్వేచ్ఛావిహంగాలు పేరుతో పుస్తకరూపంలో వెలువరించాను. ఇదే కాలంలో రవీంద్రుని క్రిసెంట్ మూన్ ను, వివిధ సూఫీకవుల గీతాలను “ఎడారి అత్తరులు” పేరిటా, పాబ్లోనెరుడా “Twenty love poems and a song of despair” ను అనువదించి e-books గా విడుదల చేసాను.
సప్తశతి గాథలు, కె.సచ్చిదానందన్ కవిత్వానువాదాలను పుస్తకరూపంలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాను.
ఇవి కాక ఈ పదమూడేళ్లలో చేసిన వివిధ భారతీయ, ప్రపంచకవుల కవితల అనువాదాలు అన్నింటినీ ఒకచోటికి చేర్చాలనే ప్రయత్నమిది. ఇవన్నీ నా వాల్ లేదా బ్లాగులో ప్రచురించినవే. భిన్నకాలాలకు, నేపథ్యాలకు చెందిన వివిధ కవుల కవిత్వం ఇది. వీటన్నింటిని ఏకబిగిన చదివినప్పుడు కవిత్వం ఒక్కటే అన్నింటినీ కలిపే అంతఃసూత్రంగా ఉందని అర్ధమైంది.
కవిత్వాన్ని ఇష్టపడేవారికి తప్పక నచ్చుతుందనీ, నిరాశపరచదనీ భావిస్తాను.
భవదీయుడు
బొల్లోజు బాబా 22/5/2021
another link
https://ia601400.us.archive.org/15/items/bolloju-baba-translations/Bolloju%20Baba%20Translations.pdf
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment