Sunday, January 31, 2021
Imported post: Facebook Post: 2021-01-31T12:13:37
కొన్ని సందేహాలు
.
1. సమాజం నుంచి స్మశానం ఎన్నో తీసుకొంటుంది దేన్నీ తిరిగి ఇవ్వదు. మనుషుల్ని స్మశానాల్లా కాకుండా పంటచేల లాగ బ్రతకమనటం తప్పెందుకుకవుతుంది?
2. జీవశాస్త్రం ప్రకారం జీవుల విధి "To live and leave a generation behind". దీన్నుంచి జీవో కాదో కూడా తెలియని వైరస్ కూడా తప్పించుకోలేదు. దీనిని కాసేపు జీవనేచ్ఛ అనుకొందాం. మానవులు జీవనేచ్ఛ లేకుండా బ్రతకటం అసహజం అని చెప్పటం తప్పెందుకవుతుంది?
3. ఒక పాత్ర అపసవ్య పాత్ర అని అనిపిస్తే దాని అస్తిత్వాన్ని ఆ సమూహ అస్తిత్వంగా నిర్ధారించటం ద్వారా ఆ సమూహాన్ని అవమానిస్తున్నామన్న స్పృహ లేకపోవటం; ఇంకొంచెం ముందుకుపోయి ఆ రచయితకు ఆ పాత్ర లక్షణాలను ఆపాదిస్తూ అవమానించటం; తద్వారా సాహిత్యంలోని బహుళతను, వైవిధ్యాన్ని, రచయిత స్వేచ్ఛని చంపేప్రయత్నం చేయటం; ఎంతటి సమకాలీన విషాదం?
4. సాహిత్యంలో ఆత్మగౌరవాలు, విజయాలు, ఘర్షణలు మాత్రమే ప్రతిబింబించాలని జీవితంలో ఉండే అనూహ్యతలు, అసంభావ్యతలు, అసంబద్దతల గురించి మాట్లాడకూడదని, కథలు ఇలాగే రాయాలని రూల్స్ ఫ్రేమ్ చేసి, చట్రాలను, క్లిషేలను నిర్మించే విమర్శకులకూ- త్రిశూలాలు తిప్పుతూ తిరిగే గుంపులకూ తేడా ఏముందీ?
.
బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment