బిక్కవోలు ఐకనోగ్రఫీ - 3
బిక్కవోలు గోలింగేశ్వరుని ఆలయ ఉత్తరగోడపై ఏకపాదంతో ఉండే శివుని ప్రతిమ ఉంటుంది. హిందూ దేవుళ్ల రూపాలు అనేక చేతులతో వివిధ ఆయుధాలు ధరించి ఉంటాయి కానీ కాళ్ళుమాత్రం సాధారణంగా రెండే ఉంటాయి.
ఈ ప్రతిమకు ఒకే కాలు, నాలుగు చేతులు కలవు. ఈ రూపాన్ని ఏకపాద మూర్తి అంటారు. ఇది ఈశ్వరుని ప్రాచీనమైన రూపము.
వేదాలలో "అజ ఏకపాద" పేరుతో రుద్రుని వర్ణనలు కలవు. విశ్వకర్మ రచించిన శిల్పశాస్త్రంలో ఈశ్వరుని పదకొండురూపాల్లో ఏకపాద మూర్తి ఒకటి. ఇది కఠోరతపస్సు చేస్తున్న స్థితికి సంకేతం. ఈ మూర్తిని పూజించినట్లయితే ఐహిక సుఖాలను కలగచేస్తాడని ప్రతీతి.
ఏక పాదంతో ఉండే ఈశ్వర రూపాలు మూడురకాలుగా ఉంటాయి. అవి ఏకపాద శివమూర్తి, ఏకపాద భైరవ, ఏకపాద త్రిమూర్తి.
బిక్కవోలు ఆలయంలో ఉన్న రూపం ఏకపాద శివమూర్తి. ఏకపాద శివమూర్తి శిల్పాలు భారతదేశంలో మూడుచోట్ల మాత్రమే ఉన్నాయి. 1. ఒరిస్సా Chaunsanth Yogini Temple 2. ఆంధ్రప్రదేష్ లోని ముఖలింగం వద్ద సోమేశ్వర ఆలయం 3. బిక్కవోలు గోలింగేశ్వర ఆలయం.
బిక్కవోలులోని ఆలయాల శిల్పసంపద చాలా ప్రత్యేకమైనది. హిందూ మత శిల్పాకృతులు ఇంకా పూర్తిగా రూపుదిద్దుకొనక ముందు నిర్మించిన ఆలయం కనుక అత్యంత ప్రాచీనమైన, అరుదైన దేవతా రూపాలు ఈ ఆలయంలో కనిపిస్తాయి.
బొల్లోజు బాబా
Ref: "Single Footed Deities: Glimpses from Art and Literature" by
Prachi Virag Sontakke - Heritage: Journal of Multidisciplinary Studies in Archaeology 3: 2015
(రానున్న తూర్పుగోదావరి జిల్లా-ప్రాచీనపట్టణాలు పుస్తకం నుంచి)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment