గొప్ప సహృదయులు, పండితుడు, విజ్ఞానఖని, నిరంతర సాహితీకృషీవలుడు శ్రీ రాపాక ఏకాంబరాచార్యులు గారికి, వారి సతీమణి గారికి నా నివాళులు
శ్రీ రాపాక ఏకాంబరాచార్యులు గారు 15 సంవత్సరాలు విజయవాడ ఎస్. ఆర్. ఆర్. కళాశాలలో చరిత్రోపన్యాసకులుగా పనిచేసి 1977 లో సహకారశాఖలో డిప్యూటి రిజిస్ట్రారుగా ప్రవేశించి చివరగా జాయింట్ రిజిస్ట్రారుగా 1998 జూన్ లో పదవీవిరమణ చేసారు. వీరు చరిత్ర, సాహిత్య విషయాలపై సుమారు 400 వ్యాసాలు, పలుగ్రంధాలు వ్రాసి సాహిత్యవేత్తగా పేరుగాంచారు.
శ్రీ ఏకాంబరాచార్యులు 9-9-1940 లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తాలూకాలోని పల్లెపాలెం గ్రామంలో శ్రీమతి గున్నమ్మ, శ్రీ రామస్వమి దంపతులకు జన్మించారు. స్వగ్రామంలో ప్రాధమిక విద్య, కోలంకలో హైస్కూలు విద్య, నర్సాపురం వై.ఎన్ కాలేజీలో ఉన్నత చదువులు అభ్యసించారు.
వీరి రచనలు
1. భారతదేశ చరిత్ర (ఇది ఆంధ్రవిశ్వవిద్యాలయ కరస్పాండెన్స్ కోర్సు వారికొరకు వ్రాయబడినది
2. గణితబ్రహ్మ - లక్కోజు సంజీవరాయశర్మ
3. ప్రసంగ తరంగిణి
4. సుప్రసిద్ధ చరిత్ర శాసన పరిశోధకులు శ్రీ బి.ఎన్. శాస్త్రి
5. వ్యాసకేదారం
6. కొప్పరపు సోదర కవులు
7. మల్లంపల్లి సోమశేఖర శర్మ
8. విశ్వబ్రాహ్మణ సర్వస్వము
9. అవధాన సర్వస్వం
2009 లో పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం వారిచే గౌరవ డాక్టరేట్ పొందారు.
వీరి అర్ధాంగి శ్రీమతి రుక్మిణి. ఈ దంపతులకు రాపాక వెంకట గోపాల్, రఘురామ్, సత్యనారాయణమూర్తి, రాపాక కనకమ్మ అనే సంతానం కలదు. వీరికి సాహితీ సుత్రామ అనే బిరుదు కలదు.
బొల్లోజు బాబా
No comments:
Post a Comment