నిన్ను
నీవు పగలకొట్టుకొనేదాకా ఆడుతూనే ఉండు --
రూమీ
నేను
ఈ గాలిలో ఎక్కడో తప్పిపోయాను – రూమీ
నేను
నవ్వుతున్నానో ఏడుస్తున్నానో ఎవరూ
చెప్పలేకపోతున్నారు, నాకే ఆశ్చర్యంగా ఉంది – రూమీ
తలుపలా తడుతూనే ఉండు
లోపలి ఆనందం కిటికీ తెరచి “ఎవరదీ?” అని చూసే దాకా! -- రూమీ
లోపలి ఆనందం కిటికీ తెరచి “ఎవరదీ?” అని చూసే దాకా! -- రూమీ
ప్రేమ
మతం ఒక్కటే ఇక్కడ రాసి ఉంది. ఎవరు చెపుతారు
ఈ మాట?
నువ్వు
నన్ను తెలుసుకో, లోతుగా తెలుసుకో! -- రూమీ
హృదయాన్ని
జాగ్రత్తగా పోషించు. ఎందుకంటే అది మాత్రమే
స్వర్గానికి చేరుతుంది -- రూమీ
నా
ఒక్కని అంగీకారంతోనే నేనిక్కడికి రాలేదు, అలాగే వెళిపోనూ లేను. ఎవరైతే నన్నిక్కడికి పంపించారో, ఆయనే నన్ను
ఇంటికి తీసుకెళ్ళాలి – రూమీ
సూర్యకాంతిలో
ధూళిరేణువుల్ని నేను
గుండ్రటి
సూర్యబింబాన్ని నేను
ధూళి
రేణువులతో నిలిచిపో
సూర్యునితో
కదలిపో అన్నాను నేను
నేనే
నీవు -- రూమీ
దూరంనుంచి
నీవు నా కాంతిని మాత్రమే చూస్తావు, దగ్గరకు రా... నేనే నీవని తెలుసుకొంటావు – రూమీ
నేను
నా ప్రేయసితో నాట్యం చేస్తూ ఉన్నాను
నా
హృదయంతో ఊసులాడుకొంటున్నాను
ఈశ్వరుడా
ఉదయాన్ని
తెరచే తాళంచెవి
కనిపించకుండా
చేయి ఈ రాత్రికి – రూమీ
ఈ
రాత్రి నాగురించి వెతక్కు. ఈ రాత్రికి నేను లేను -- రూమీ
No comments:
Post a Comment