Friday, May 23, 2008

అవసరమేనేమో?

కసాయివాడు రేపేది చేయాలనుకొంటున్నాడో
తెలియని గొర్రె పిల్ల ఆనందాలు మనవి.
తెలియక పోవటం ఒక వరం కాదూ!

దొరికిపోయే కాలానికి వేటగానివద్దకే కుందేలు పరిగెట్టినట్లు
మనమూ కృషీ బ్యాంకులు, పృడెంషియల్ బ్యాంకుల వైపే నడుస్తాం.

సముద్రపు ఒడ్డున రాసే రాతలు మన ఆలోచనలు.
ఇలా రాస్తూంటే అలా చెరిపేస్తూంటాయి
ఆధునిక కాల ఆర్ధికవిధానాలు, కారీరిజం,
గొర్రె చర్మం తొడుక్కున్న తోడేళ్లు.

నేను నీతిగా బతుకుతున్నాను అనెవడన్నా అంటే
వాడేదో రహస్యం దాస్తున్నాడన్నమాట.

చిన్నప్పుడు అద్దంలో చందమామను చూసి మోసపోయినట్లుగా
పెద్దయ్యాకా వెలిసిపోయిన కలల్ని మోసుకుంటూ ........


ఏకకాలంలో మంచుపూల వర్షాన్ని
వడగాడ్పుల ఉక్కపోతనీ సృష్టించగల
సంక్లిష్టతలజీవనాన్ని ఎదుర్కోవటానికి
ఇంత తెంపరితనం అవసరమేనేమో!


బొల్లోజు బాబా

7 comments:

  1. @బాబా గారు
    ఇలాంటివి అనుభవంతోనే రాయగలమేమో...

    ReplyDelete
  2. can not understand the words
    "charmam krinda Todeellu" How these words fit in there in that sequence

    ReplyDelete
  3. కొత్తపాళీ గారికి ధన్యవాదాలు,
    దీపు గారు థాంక్యూ వెరీ మచ్. మీరన్నట్లు కొంతవరకూ స్వానుభవమే?

    నరశింహ గారికి,
    చర్మం క్రింది తోడేళ్లు అంటే నాఉద్దేశ్యం గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు అని.
    మన ఆశలను ఆశయాలను నాశనం చేసే వివిధ అంశాలలో మోసగింపబడటం ఒకటి.

    ఆర్ధిక విధానాలు కారీరిజం అనేవి మనంతట మనం వెళ్లి దొరికి పోయిన ఉచ్చులు. మనల్ని మనలా జీవించనివ్వని అంశాలు.

    ఇక మోసపోవటమనేది అవతలి వ్యక్తి పధకం ప్రకారం మనలను వంచిచటం. ఆ అవతల వ్యక్తి గొర్రె చర్మం క్రింది ఉన్న తోడేలు వంటి వాడు.
    ఆపదం బదులుగా గొర్రె చర్మం తొడుక్కున్న తోడేళ్లు అని ఉంటే ఈ అస్ఫష్టత ఉండదేమో.

    ప్రస్తుత పరిస్థితులలో మనల్ని మనలా బ్రతకనివ్వని అంశాలలో ఈ మూడూ ప్రధాన పాత్ర వహిస్తున్నాయని నా అభిప్రాయం.
    బహుసా మీరన్న తరువాత చదువుతుంటే నాకూ ఆ పదం కాస్త మిస్ప్లేస్ అయినట్లు అనిపిస్తుంది.
    థాంక్యూ వెరీమచ్ సర్ .

    అన్నమయ్య పై మీకు మంచి కమాండు ఉన్నట్లుంది. అభినందనలు.
    సాంఫ్రదాయ టపాలు వ్రాసే చాలా బ్లాగులలో నాకు బాగా నచ్చి, గౌరవం కలిగిన బ్లాగు
    http://www.tadepally.com/2008/05/blog-post_16.html

    వీలైతే సందర్శించండి.

    ధన్యవాదములతో
    బొల్లోజు బాబా

    ReplyDelete
  4. బొల్లోజు బాబా గారికి
    మీరు చాలా తొందరగా ప్రతిస్పందించినందుకు ధన్యవాదాలు.తాడేపల్లి వారి బ్లాగును కూడా చూస్తుంటాను.జవాబు వ్రాయటం లేటయినందుకు మన్నించ గోర్తాను. మరోసారి కలుద్దాం.

    ReplyDelete
  5. అద్భుతం గా వుంది.మీ వివరణ కూడా చాలా బాగుంది.

    ReplyDelete
  6. రాధిక గారికి, నరసింహ గారికి ధన్యవాదములు
    బొల్లోజు బాబా

    ReplyDelete