శిఖామణి కవితా దర్శనం
మూడు దశాబ్దాల క్రితం “మువ్వల చేతికర్రతో” తెలుగు సాహిత్యలోకంలోకి అడుగుపెట్టారు శిఖామణి. సూర్యుడు, నెత్తురు, అడవి, తుపాకి గొట్టం, ఎన్ కౌంటర్లు లాంటి ఘాటైన పదాలతో తెలుగు కవిత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాలం అది. ఈ నేపథ్యంలో- తల్లి చేతి స్పర్శని, చిన్నప్పటి పిప్పరుమెంటు రుచిని, చెక్కిలిపై ఆరిన కన్నీటి చారికను, ఖేదమో మోదమో తెలీని తన్మయత్వాన్ని నింపుకొని వచ్చిన శిఖామణి కవిత్వం ప్రతిఒక్కరిని ఆకట్టుకొంది.
ఈ మూడు దశాబ్దాలలో శిఖామణి 11 కవితా సంపుటులు, 9 విమర్శనా గ్రంధాలు, ఇతర భాషలలోకి అనువదింపబడిన 5 కవిత్వ సంపుటులు వెలువరించారు. 5 పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ఆంధ్రదేశంలోని దాదాపు అన్ని సాహిత్య సంస్థలనుండి పురస్కారాలను అందుకొన్నారు. ఒక కవిగా, విమర్శకునిగా, పీఠికా కర్తగా, పరిశోధకునిగా, పరిశోధనా పర్యవేక్షకునిగా, ఒక కవిత్వ కార్యకర్తగా, సాహిత్య సభలలో వక్తగా, పత్రికా సంపాదకునిగా వీటన్నిటికీ మించి మార్దవత నిండిన మనిషిగా- శిఖామణి గారు నాకు సహస్ర బాహువులతో ప్రకాశించే కార్తవీర్యార్జునుని గా కనిపిస్తారు.
1. కవిగా శిఖామణి
జీవితపు రణగొణధ్వనుల మధ్య జారిపోయే సున్నితానుభవాలను నేర్పుగా ఒడిసిపట్టుకోవటం - నడచి వచ్చేసిన మార్గంలోని రాలుపూల పరిమళాల్ని నెమరువేసుకొంటూ కలల మాలలల్లటం - మనిషితనం తగలకపోతుందా అంటూ లోలోపలికి తవ్వుకుంటూ పోయేతత్వం - కాస్త అమాయకత్వం, లోకం మీద ఇంత దయా తప్ప మరే అలంకారాలూ లేకపోవటం - స్వప్నాన్ని కమ్మిచ్చుగుండా సాగదీసి సాగదీసి బంగారు తీగలాంటి ఓ వాక్య చిత్రాన్ని నిర్మించటం - మనచుట్టూ జరుగుతున్న అన్యాయాలపట్ల ధర్మాగ్రహం ప్రకటించటం- శిఖామణి కవిత్వంలో మనకు అడుగడుగునా కనిపిస్తాయి
జీవితానుభవాల్ని కవిత్వానుభవాలుగా మార్చటంలో శిఖామణి నేర్పరి. అనుభూతిని భాషలోకి అనువదించటం తేలికైన విషయం కాదు. అనుభూతులను వ్యక్తీకరించటానికి ఒక్కోసారి భాష సరిపోదు. ఒక అనుభూతిని అంతే శక్తిమంతంగా చదువరిలో ప్రవేశపెట్టటంలో శిఖామణి ప్రతిభ అనన్యసామాన్యం.
రోడ్డుపై ఎదురయ్యే బిచ్చగాళ్లను విసుక్కొంటూనో, జాలితోనో ఎంతోకొంత దానం చేస్తాం. మనం ఇచ్చిన నాణెం ఎంతవిలువైనదో ఆ కబోది బిచ్చగాడు దాని అంచులను తడుముకొని తెలుసుకొంటాడు. ఆ విషయాన్ని కూడా మనం ఎపుడో ఒకప్పుడు గమనించే ఉంటాం. ఇంతవరకూ ప్రతిఒక్కరకూ ఎదురయ్యే అనుభవమే. కానీ శిఖామణి మరికొంత ముందుకు చూసి, ఆ అనుభూతిని ఒక అర్ధ్రతతో కూడిన చిత్రంగా రూపుకట్టగలిగారు.
ఈ రోజు కబోది బొచ్చెలో
నువ్వు వెయ్యవలసింది
చిల్లర నాణెం కాదు
వాడు నాణెపు అంచులు తడిమి
దాని విలువను తెలుసుకునేటప్పుడు
నాణెపు అంచుకు బదులు
అక్కడ
నీ హృదయపు అంచులు దొరకాలి (హ్రుదయదానం)
మామూలుగా జరిగే దైనందిన సంఘటనలను శిఖామణి అద్భుతంగా కవిత్వం చేస్తారు. ఉదాహరణకు బొబ్బిలి టు పార్వతీపురం అనేకవితలో కొన్ని వాక్యాలు ఇలా సాగుతాయి
ఒక అరుణోదయపు వేళ
ఇంటికి వెళ్లగానే
కాళ్లకు నీళ్ళిచ్చినప్పుడే అనుకొన్నాను
బొబ్బిలిలో ఉంటూ కూడా
ఈ కోడలు పిల్ల
మా యానాం చెరువు నీళ్ళు ఎలా తెచ్చిందా అని.
ఇక్కడ మా యానాం చెరువు నీళ్ళు అన్న వాక్యం వల్ల ఒక మామూలు విషయం కవిత్వమైంది. కవిది యానం, కవి చెపుతోన్న కోడలి పిల్లది కూడా యానామే. ఇద్దరూ యానాం చెరువునీళ్లు తాగిన వారే. ప్రస్తుతం ఆ కోడలు పిల్ల యానానికి సుమారు రెండువందల కిలోమీటర్లు దూరంగా బొబ్బిలి లో ఉంటుంది. మరి బొబ్బిలిలో యానాం చెరువు నీళ్ళు ఎలా సాధ్యం? అదే శిఖామణి కవిత్వ రహస్యం. అతని కవిత్వాన్ని చదువుతూంటే ఏదో సొంత ఇంట్లోకి అడుగుపెడుతున్నట్లు, మన ఆత్మలోకంలో మనమే సంచరించుతున్నట్లూ అనిపించకమానదు.
మిత్రుడు లేని ఊరికి వెళ్లటం అనే అనుభవం చిత్రమైనది. ఆ మిత్రుని జ్ఞాపకాలు ముసురు కొంటాయి. హృదయం భారమౌతుంది. ఆ భారాన్ని మాటల్లో అంత సులభంగా చెప్పలేం. చానాళ్లకి వెళ్లాను పాల్వంచకి అనే కవితలో ఆ అనుభవాన్ని అద్భుతంగా పట్టుకొంటారు శిఖామణి.
తీరా వెళ్ళాక తెలిసింది
ఇతఃపూఱ్వం
అతను కేవలం పాల్వంచలో మాత్రమే ఉండేవాడని
ఇపుడతను
హైదరాబాద్ లోనూ నరసరావు పేటలోను
మహబూబ్ నగర్ లోనూ భద్రాచలంలోనూ
ఎక్కడెక్కడ తన మిత్రులున్నారో
అక్కడక్కడ ఏకకాలంలో ఉంటున్నాడని తెలిసింది
అవును
నిత్యసంచారికి శరీరంతో ఏం పని
చనిపోయిన వ్యక్తులు బ్రతికున్నవారి జ్ఞాపకాలలో జీవిస్తూనే ఉంటారు అన్న సత్యాన్ని పై వాక్యాలలో చెపుతున్నాడు.
ఇదే కవితకు పొడిగింపా అన్నట్లు “నువ్వు గుర్తొస్తావు” అనే కవిత ఒకటి ఉంది. అలా జ్ఞాపకాలలో జీవించి ఉండటం కూడా ఎంతకాలం జరుగుతుంది అని ప్రశ్నించి గొప్ప తాత్వికంమైన సమాధానం చెపుతాడు ఇలా…
//నువ్వైనా ఎందాకా గుర్తొస్తావులే!
నిన్ను గుర్తు పెట్టుకున్నానన్న
గుర్తు నాకున్నంత వరకు.
ఒక శుభోదయాన
నేనెవరో ఇతరులు తప్ప
నన్ను నేను గుర్తు పట్టలేని క్షణాన
నిన్నూ నన్నూ కలిపి గుర్తు పట్టే వ్యక్తి
వ్యక్తంగానో అవ్యక్తంగానో
ఎక్కడో ఉండే వుంటాడు.
ఈ జ్ఞాపకాలన్నీ ఎప్పుడో ఒకప్పుడు ఆగిపోతాయి. అప్పుడు మనల్ని ఇతరులు గుర్తు పెట్టుకుంటారు అనటం జీవన వైచిత్రి.
కవిత్వానికి ఉండాల్సిన లక్షణాల పట్ల ప్రతికవికీ కొన్ని అభిప్రాయాలుంటాయి. అలాగే శిఖామణి కూడా “అప్పట్లో మా నాయన అనేవాడు” అనే కవితలో తన కవిత్వ మూలాలను చెప్పుకొంటాడు.
కవిత్వం రాయగానే సరికాదు
కాస్త జ్ఞానం వుండాలిరా అని
జ్ఞానం దేనికైనా అవసరపడుతుందేమోగానీ
కవిత్వం రాయడానికి కావాల్సింది
కాస్త అమాయకత్వం
లోకం మీద ఇంత దయా
అనుకొంటాను ఇప్పటికీ.//
పైన చెప్పినట్లుగా శిఖామణి కవిత్వంలో. మానవజాతిని కొత్తమలుపులు తిప్పాలనే గొప్ప గొప్ప ఊహలు, కార్యాచరణలు, సిద్దాంతాలు లాంటి జ్ఞాన ప్రకటనలు ఉండవు. ఉండేదల్లా ఉత్త హృదయ నివేదనా, ఈ లోకంపట్ల అపారమైన దయ. పూలకుర్రాళ్లు, అంధ భిక్షకులు, రైళ్లలో యాచకులు, ఆఫీసులో అటెండరు, మేడపై వాలే పావురాలు, మరణించిన బాల్య మిత్రులు, స్నేహితులు వీళ్ళే ఎక్కువగా శిఖామణి కవిత్వానికి వస్తువులు
తెలుగు సాహిత్యంలో శిఖామణి రాసినన్ని ఎలిజీలు వేరే ఎవరూ రాయలేదంటే అతిశయోక్తి కాదు. ఇవన్నీ “స్మరణిక” పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. దీనిలో మొత్తం 34 వ్యాసాలున్నాయి. శిఖామణి వ్యక్తులను ఎంతగా ప్రేమిస్తాడో, వారితో తనకు గల అనుభవాలను, వారిలోని మంచిని ఎంతెలా గుర్తుపెట్టుకొంటాడో ఈ నివాళి వ్యాసాలను చదివినపుడు అర్ధమౌతుంది. వారు మనకు తెలియని వ్యక్తులైనప్పటికీ గుండె బరువెక్కుతుంది. ఇవన్నీ శిఖామణి “మనిషి” గా జీవించాడు అనటానికి రుజువులు. శిఖామణికి ఈ లోకంపై, మనుషులపై ఎంత దయ, హృదయ వేదన లేకపోతే అంతఆర్థ్రంగా వారిగురించి వ్రాయగలడు
ఒక్క ఉదాహరణ
శిఖామణి బంధువు యొక్క మూడునెలల పసిబిడ్డ చనిపోవటం మీద వ్రాసిన “నిదురించిన చిన్నిముద్దు” అన్న కవితలో
ఈ చిన్నారి శిశువు కోసం తవ్విన గోతిని చూసి
వానలకు పైవర వరకు ఉబికొచ్చిన నూతి నీటిలా
దు:ఖం జీవితపు ఇంత పై పొరల్లోనే ఉంటుందనుకోలేదు” అన్న అత్యంత విషాదవాక్యాలతో సందర్భాన్ని కళ్లకు కడతాడు కవి. చిన్న పిల్లవానిని ఖననం చేయటానికి చిన్నగొయ్యి సరిపోయింది అన్న సూచనకూడా గుండెల్ని పిండే ఒక వాస్తవం.
కవిత్వానికి కావాల్సినమరో అంశం అమాయకత్వం అని శిఖామణి అంటారు కానీ, నిజానికి శిఖామణి కవిత్వం పైకి అమాయకంగా కనిపిస్తూ లోపల జీవనతాత్విక సముద్రాలను ఇముడ్చుకొని ఉంటుంది.
ఈ విషయం శిఖామణి వ్రాసిన చిలక్కొయ్య కవితను పరిశీలిస్తే అర్ధమౌతుంది. ఇది ఒక గోడకు ఉండే చిలక్కొయ్య పై వ్రాసిన వస్తుకవితైనప్పటికీ, ఒక సంపూర్ణజీవితాన్ని అంతర్లీనంగా చెపుతూంటుంది.
కవి బాల్యంలో చిలక్కొయ్యతో తనకు గల అనుభవాలతో కవిత మొదలౌతుంది.
చిలక్కొయ్యపై పిచ్చుకలు వాలటం, కవి తల్లిగారు ఉత్త పసుపు పుస్తెలతాడు వేలాడదీయటం, దానికి తగిలించిన సీమవెండి కేరేజీలో చప్పరింపు చప్పరింపుకు రంగులు మారే బిళ్లలను వారి అమ్మగారు దాయటం, మూడో పురుషార్థ సాధనలో ఉన్న దంపతులను ఆ చిలక్కొయ్య నిర్వికారంగా చూడటం, ఈ ఒంటరి ప్రయాణంలో ఈదలేక నిష్క్రమిస్తూ అదే చిలక్కొయ్యకు ఆత్మను తగిలించటం -ఇవీ ఈ కవితలో కనిపించే వివిధ దృశ్యచిత్రాలు. అతి సామాన్యంగా కనిపించే వాక్యాలతో కవిత మొదలై ముగింపుకు వచ్చేసరికి అవే పదాలు మరో గొప్ప అర్థాన్నిచ్చే విధంగా మారతాయి. కవిత ప్రారంభంలో కనిపించిన కొయ్య చిలుక నెమ్మది నెమ్మదిగా కనుమరుగవుతూ, ఓ జీవితం కనిపించటం మొదలవుతుంది.
2. శిఖామణి కవిత్వంలో దళిత ఈస్తటిక్స్
శిఖామణి మొదట మనిషి ఆ తరువాత దళితుడు. దళిత కవిత్వం ఉత్తుంగ తరంగంలా తెలుగు సాహిత్యలోకంలో ఎగసినపుడు శిఖామణి ఆ కవిత్వానికి తాను అందించాల్సిన సామాజిక కర్తవ్యాన్ని గుర్తించారు. దళితుల పక్షన నిలబడి కవిత్వం వ్రాసారు. అంతకు మునుపు దళితుల సమస్యలను కవిత్వీకరించలేదనే విమర్శను నిజాయితీ గా అంగీకరిస్తారు శిఖామణి.
పూల కుర్రాళ్ల గురించీ
గుడ్డి బిచ్చగాళ్ల గురించీ
పుప్పొడి పదాలతో పలవరించిన నేను
పదిరికుప్పం పరాభవాల గురించి
పన్నెత్తు మాటయినా పలకలేకపోయాను..... అంటూ.
ఆ తరువాత కిర్రుచెప్పుల భాష, చూపుడువేలు పాడే పాట కవిత్వ సంపుటులను, దళిత సాహిత్యతత్వం, దళిత సాహిత్యోద్యమం పేర్లతో విమర్శనా గ్రంధాలను వెలువరించారు. శిఖామణి దళిత ఈస్తటిక్స్ దళిత కవిత్వానికి కళాత్మకతను అద్దింది. ఆ విషయంలో శివసాగర్ పక్కన స్థానం ఈయతగినవారు శిఖామణి.
కవిని నేను
వర్ణచాపాన్ని విరగ్గొట్టడానికి వచ్చిన
దళిత కవిని నేను --- అని ప్రకటించుకొంటాడు.
శిఖామణి వ్రాసిన “మా బాప్ప”, “నల్లని దానను” కవితలలో దళిత ఈస్తటిక్స్ నిరుపమానంగా వ్యక్తమౌతాయి.
మా బాప్ప
వాడతప్ప వూరు లేని
కులంతప్ప పేరు లేని
శ్రమ తప్ప సుఖం లేని
మా బాప్ప కథ వింటారా?
బాప్పంటే మాటలా
పొడుగాటి బొప్పాయి చెట్టులా
వెనక్కి తిరిగి చూడని యేరులా
ఆకాశాన్ని సవాలు చేసే
సన్నని సరివి చెట్టులా
చేయెత్తు మనిషి
కచ్చా బిగించి
భుజాన కొడవలితో పొలానికి వెళ్తుంటే
తోక మీద నిలబడిన
ఆరడుగుల నల్ల తాచులా
అగుపించేది మా బాప్ప
నలుపంటే నలుపా అది!
గుత్తులుగా విరగకాచిన నేరేడు నలుపు
దుక్కిదున్నిన నల్లరేగడి మడిచెక్క నలుపు
పంటబోదెలో విరబూసిన నల్లకలువ నలుపు
అప్పుడే కోసి ఆరబోసిన మిరపకళ్లంలా
ఆ నల్లని నుదుటిమీద ఎర్రని బొట్టు
రూపుకు నల్లనే కాని
మా బాప్ప మనసు పుచ్చపువ్వు తెల్లన
బూరుగు దూది మెత్తన//
ఊరుతో వైరం వచ్చినప్పుడు
చెంగులో ఇంతకారప్పొడి
చేతిలో హరకెన్ లాంతరుతో
తెల్లవార్లూ ఏటిగట్టున కాపలా తిరిగిన
మా బాప్ప
చుండూరులో ఎందుకు పుట్టలేదా
అనుకొంటాను//
ఈ కవితలో కనిపించే కచ్చాబిగించటం, కొడవలితో పొలానికి వెళ్లటం, నేరేడు, కలువ, దుక్కిదున్నిన నల్లరేగడి, మిరప కళ్ళం, ఊడ్పుల కాలం, బడిపిల్లల మధ్యాహ్న భోజన పథకం, వెండి కడియాలలో లక్క, ఊరితో వైరం లాంటి దృష్టాంతాలన్నీ దళిత జీవనాన్ని దృశ్యమానం చేస్తూ కవిత సాంద్రతను పెంచుతాయి.
నల్లని దానను అనే కవితలో- నవధాన్యాలలో నాలుగవదానను, హంసలమధ్య పికిలిపిట్టను, చెమ్మసోకితే ఉబ్బిపోతాను, ఆపై స్పృశిస్తే తెల్లగా మెరిసిపోతాను వంటి పైపై పోలికలను బట్టి ఇది మినువులపై చెపుతున్న కవితగా అనిపించినా -- జాత్యాహంకారాన్ని దహించే నీలి అగ్నిశిఖ, ఆఫ్రికానుండి మొహంజొదారో వరకు నిక్షిప్తమైన నలుపు ధాతు శిలాజాలు, వీరబాహుడినుండి మండేలా వరకు సాగిన నల్లరక్తపు వెలిగే పాదముద్రలు, తెల్లజాతిని అబ్బురపరచిన నల్ల మైఖేల్ జాక్సన్ వంటి అనేక మెటఫర్ ల ద్వారా ఒక వర్గదృక్ఫధాన్ని కవితలో అత్యంత ప్రతిభావంతంగా ప్రవేశపెడతాడు కవి. దళిత ఈస్తటిక్స్ ఈ కవితలో అద్భుతంగా పలుకుతాయి.
శిఖామణి కవిత్వానికి అనుభూతి, మానవత, తాత్వికతలు పుష్కలంగా పొటమరించే అందాలు. ఉపమ, రూపకాలు శిఖామణి కవిత్వానికి మణిపూసలు. "సస్టైయిన్డ్ రిలీజ్ డ్రగ్ లాగ శిఖామణి అక్షరాల్లో కవిత్వం నిలకడగా స్రవిస్తూ ఉంటుంది అంటారు ప్రముఖ విమర్శకుడు శ్రీ కె.శ్రీనివాస్
****
3. విమర్శకునిగా శిఖామణి
వివిధ, సమాంతర, దళిత సాహిత్య తత్త్వం, దళిత సాహిత్యోద్యమం, సేతువు, వాగర్ధ వంటి పుస్తకాలు శిఖామణిని మనకున్న మంచి విమర్శకునిగా నిరూపిస్తాయి.
ప్రయోగవాది పఠాభి, తెలుగు-మరాఠి దళిత కవిత్వం లాంటి పుస్తకాలు శిఖామణిలోని పరిశొధకుడిని మనకు చూపుతాయి.
విశ్వవిద్యాలయ ఆచార్యుని వృత్తిలో భాగంగా 24 పి హెచ్ డీలు, 42 ఎంఫిల్ లకు శిఖామణి పరిశోధక పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. పద్యసాహిత్యం, తులనాత్మక పరిశీలన, ఆధునిక వచనం, కవిత్వం, నాటకం, సంస్కరణలు వంటి ఒకదానికొకటి సంబంధం లేని అంశాలకు పరిశోధక పర్యవేక్షకుడిగా ఉండటం ఒక అరుదైన విషయమని అనుకొంటాను.
పుస్తకానికి పీఠిక అనేది ఒక రికమెండేషన్ లెటర్ లాంటిది. శిఖామణికి గారికి ఈ విషయం చాలా బాగా తెలుసు. అందుకనే వీరి పీఠికలలో కవి పట్ల, అతని కవిత్వం పట్ల అవ్యాజమైన ప్రేమను చూపుతారు. వెన్ను తడతారు. లోపాలను సున్నితంగా చెపుతారు. 116 పుస్తకాలకు పీఠికా కర్తగా కూడా శిఖామణి సాహిత్యసేవ గణనీయమైనది.
కవిత్వం వ్రాయటం ద్వారా కవి సమాజం నుంచి ఎంతో గౌరవం, సన్మానాలు పొందుతాడు. కవిత్వాన్ని రాయటమే కాక మోయటం కూడా కవి భాద్యతగా తీసుకోవాలి అనుకొంటాను.
“యానమా నా ఆరో ప్రాణమా” అని పలవరించిన శ్రీ శిఖామణి యానాన్ని తన కవిత్వ కార్యక్షేత్రంగా చేసుకొని గత మూడు సంవత్సరాలుగా యానాం ప్రపంచ కవితా దినోత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నారు. తెలుగు సాహిత్యంలో లబ్దప్రతిష్టులను యానానికి తీసుకొని వచ్చి పొయెట్రీ వర్క్ షాపు నిర్వహించారు. “శిఖామణి కవితా పురస్కారం” నెలకొల్పి, తెలుగు సాహితీదిగ్గజాలను ఏటా సత్కరించుకొంటున్నారు. ఆంధ్ర దేశంలో వందలాది సభలలో అలుపెరుగక పాల్గొంటూ సాహిత్యప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే “కవి సంధ్య” పత్రికను మూడేళ్ళుగా అప్రతిహతంగా ఒంటిచేత్తో నడిపించుకొంటూ రావటం మరొక ఎత్తు. ఈ పనులన్నీ శిఖామణి మంచి కవే కాదు “గొప్ప కవిత్వ కార్యకర్త” కూడా అని నిరూపిస్తాయి.
ఇక చివరగా
శిఖామణి లేని తెలుగు కవిత్వం ఎలా ఉండేదని ప్రశ్నించుకొంటే – మొదట్లో చెప్పినట్లు, సూర్యుడు, నెత్తురు, అడవి, తుపాకి గొట్టం, ఎన్ కౌంటర్లు లాంటి ఘాటైన పదాలతో తెలుగు కవిత్వం మరికొంతకాలం ఉక్కిరిబిక్కిరి అయిఉండేదేమో; తెలుగు కవిత్వంలో మానవసంబంధాలను ఆర్థ్రంగా చెప్పటం అనే అర వెలితిగా ఉండేదేమో అనిపిస్తుంది.
బొల్లోజు బాబా
17/5/2019
(శ్రీ శిఖామణి చందుసుబ్బారావు సాహిత్య పురస్కారాన్ని పొందిన సందర్భంగా చేసిన ప్రసంగపాఠం.
మరొక్కసారి అభినందనలు తెలుపుతూ)
Sunday, May 30, 2021
Saturday, May 22, 2021
Imported post: Facebook Post: 2021-05-22T21:11:01
చిన్నారి థాంక్యూ.
చిన్నారి నా బాల్యమిత్రుడు. ఒకటోతరగతి నుంచి ఒకే బెంచిమీద కూర్చొని చదూకున్నాం. టెంత్ తరువాత తను ఆర్ట్స్ కి నేను సైన్సుకీ విడిపోయాం.
నా పుస్తకాలకు కవర్ పేజ్ లు చిన్నారితో వేయించుకోవటం నాకు సెంటిమెంట్. కొన్నింటికి ఫ్రంట్ పార్ట్ బయటివారు వేసినప్పటికీ బాక్ పేజ్ చిన్నారి చెయ్యవలసిందే. అలా చేయటానికి ఏనాడు ఈగో ఫీలవకపోవటం చిన్నారి మంచితనం.
కవర్ పేజ్ చేసేటపుడు ఇక్కడ రంగుమార్చు, ఈ ఫాంటు మార్చు, ఇది సైజు పెంచు అంటూ ఎంత ఇబ్బంది పెట్టినా ఏనాడూ విసుగు అనేది నేను చూడలేదు. అంత ఓపిక
వృత్తిరీత్యా డ్రాయింగ్ టీచర్. పాతికేళ్ళక్రితం రీజెన్సీ సిరామిక్స్ లో పనిచేసేటపుడు ఫొటోషాప్ డిజైనింగ్ ఇటలీ వెళ్ళి నేర్చుకొన్నాడు. అప్పట్లో యానాం రీజెన్సీ టైల్స్ డిజైన్స్ అన్నీ చిన్నారి చేసినవే.
డిజిటల్ ఆర్ట్ ని పక్కన పెడితే చిన్నారి is best at Charcoal Art. అతని ఇంట్లో గోడలను అలంకరించి ఉండే అనేక పెయింటింగ్స్ చూస్తే ఇతని నైపుణ్యానికి ఆశ్చర్యపడతాం.
ఇప్పుడు ఫేస్ బుక్ వాల్స్ పై మిత్రుల ఫొటోలను డిజిటల్ పిక్స్ గా చేసి అందరినీ సర్ ప్రైజ్ చేస్తున్నాడు. చిన్నారికి ఖాళీ ఎక్కడ ఉంటుందా అని ఆశ్చర్యం వేస్తుంది. బహుసా ఈ కరోనా క్వారన్ టైన్, లాక్ డౌన్ ప్రభావం కావొచ్చు. ఇంత భయానక పరిస్థితులలో నలుగురికీ నవ్వులు, సర్ప్రైజెస్ పంచుతోన్న ఈ ప్రయత్నం మిత్రుల పై నిష్కల్మషమైన ప్రేమే తప్ప మరేమీ కాదని అనుకొంటాను.
వారి తండ్రిగారి టైము నుంచే ఆర్ధికంగా బాగా ఎదిగిన కుటుంబం వీరిది. నాకు తెలిసి యానాంలో మా సర్కిల్ లో పది లక్షల విలువచేసే స్పోర్ట్స్ బైక్ వాడింది చిన్నారే. చిన్నారి అన్నగారు డాక్టరు. చిన్నారికి ఇద్దరు అబ్బాయిలు, వారి శ్రీమతి ప్రభుత్వ టీచర్.
చిన్నారి మంచి కవి. అతని వద్ద కనీసం ఒక ఐదు పుస్తకాలకు సరిపడా కవితలు ఉన్నాయి. పుస్తకం తేవయ్యా మహానుభావా అంటే నవ్వి ఊరుకొంటాడు. బద్దకం కాదు, పెర్ ఫెక్షన్ కోసం అనుకొంటాను. నిజానికి చిన్నారి అముద్రిత కవితలు పెర్ ఫెక్షన్ కు ఓ మెట్టు పైనే ఉంటాయి. ఎంతచెప్పినా నా మాట నమ్మడు. (మీరైనా చెప్పండీసారి.. వీలైతే)
చిన్నారి మంచి ఆర్గనైజర్. తన గంభీరమైన స్వరంతో సమయోచిత చతురోక్తులతో సభలను ఆద్యంతం రక్తికట్టించేలా నడిపిస్తాడు. కవి సంధ్య యానాంలో జరిపే సభల వెనుక చిన్నారి పాత్ర గణనీయమైనది.
సౌమ్యుడు, సమర్ధుడు, సహృదయుడు అయిన చిన్నారి నా బాల్యమిత్రుడు కావటం అదృష్టంగా భావిస్తాను.
నీ తలపుల్లో నేను ఉన్నందుకు, నీ జ్ఞాపకాల నీడలలో నాకూ చోటున్నందుకు, నీ సమయాన్ని నాకొరకు వెచ్చించగలిగే అర్హత నాకిచ్చినందుకూ ....
అనంతానంత ధన్యవాదములతో, అభినందనలతో,

Imported post: Facebook Post: 2021-05-22T20:22:52
అనువాద కవిత్వం e-book
.
ఇంతవరకూ చేసిన అనువాద కవితలను అన్నింటిని ఒక ebook రూపంలోకి తీసుకొచ్చాను. దానిని ఇక్కడనుంచి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును.
.
https://archive.org/details/bolloju-baba-translations
***
ఈ పుస్తకానికి వ్రాసుకొన్న కొన్ని మాటలు, కవర్ పేజ్, కంటెంట్స్ పేజ్ ఫొటోలు.
***
మనవి మాటలు
ఒక అనువాద కవిత
మట్టి ముద్దను పాత్రగా మలచు
దాని శూన్యతలోనే
దాని ఉపయోగం ఉంటుంది.
గుమ్మాలు, కిటికీలతో
గృహాన్ని నిర్మించు
దాని శూన్యతలోనే
దాని ఉపయోగం ఉంటుంది.
దేన్నో పొందుతూ ఉంటాం కానీ
దాని శూన్యతనే వాడుకుంటూ ఉంటాం.
మూలం: టావో టె షింగ్ (Mould Clay into a vessel)
SEPTEMBER 22, 2008
నేను మొదటిసారిగా సోషల్ మీడియాలో నా బ్లాగు ద్వారా పోస్ట్ చేసిన అనువాదమిది. ఆ తరువాత విశ్వకవి రవీంద్రుని స్ట్రే బర్డ్స్ అనువదించి స్వేచ్ఛావిహంగాలు పేరుతో పుస్తకరూపంలో వెలువరించాను. ఇదే కాలంలో రవీంద్రుని క్రిసెంట్ మూన్ ను, వివిధ సూఫీకవుల గీతాలను “ఎడారి అత్తరులు” పేరిటా, పాబ్లోనెరుడా “Twenty love poems and a song of despair” ను అనువదించి e-books గా విడుదల చేసాను.
సప్తశతి గాథలు, కె.సచ్చిదానందన్ కవిత్వానువాదాలను పుస్తకరూపంలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాను.
ఇవి కాక ఈ పదమూడేళ్లలో చేసిన వివిధ భారతీయ, ప్రపంచకవుల కవితల అనువాదాలు అన్నింటినీ ఒకచోటికి చేర్చాలనే ప్రయత్నమిది. ఇవన్నీ నా వాల్ లేదా బ్లాగులో ప్రచురించినవే. భిన్నకాలాలకు, నేపథ్యాలకు చెందిన వివిధ కవుల కవిత్వం ఇది. వీటన్నింటిని ఏకబిగిన చదివినప్పుడు కవిత్వం ఒక్కటే అన్నింటినీ కలిపే అంతఃసూత్రంగా ఉందని అర్ధమైంది.
కవిత్వాన్ని ఇష్టపడేవారికి తప్పక నచ్చుతుందనీ, నిరాశపరచదనీ భావిస్తాను.
భవదీయుడు
బొల్లోజు బాబా 22/5/2021
another link
https://ia601400.us.archive.org/15/items/bolloju-baba-translations/Bolloju%20Baba%20Translations.pdf

Thursday, May 20, 2021
Imported post: Facebook Post: 2021-05-20T16:16:43
Samih al-Qasim జోర్డాన్ లో జన్మించిన పాలస్తీనియన్ కవి. ఇతను అనేకసార్లు రాజకీయకారణాల వల్ల జైలు పాలయ్యాడు. ఇతర కవుల్లా ఇతను పాలస్తీనియాను విడిచిపెట్టి పోలేదు దానికి కారణం నా మాతృభూమిపై నా అనుబంధమే అని ప్రకటించుకొన్నాడు. తన జీవితంలో ఎక్కువకాలం గృహనిర్భంధంలోనే గడిపాడు "The only way I can assert my identity is by writing poetry" అనేది Samih al-Qasim కవిత్వ వస్తువు మరియు శిల్పము. Samih al-Qasim 2014 లో మరణించాడు.
Samih al-Qasim కవితల అనువాదాలు ఇవి.
1.
Travel Tickets
నన్ను చంపినరోజు
నా జేబులో Travel Tickets గమనిస్తావు నువ్వు
శాంతిలోకి
పంటపొలాలలోకి, వానలోకి
మనుషుల అంతరాత్మలలోకి
తీసుకెళ్ళే Travel Tickets
ప్రియమైన నా హంతకుడా
ఆ టికెట్లను వృధాచేయకు.
వాటిని వాడుకో.
దయచేసి ప్రయాణించు
2.
Slit lips
చనిపోయిన
ఒక కోకిల కథను
నేను నీకు చెప్పి ఉండేవాడిని.
వాళ్ళు నా నాలుకను
చీల్చి ఉండకపోతే
ఆ కథను నీకు......
3.
Abandoning
నేను చూసాను ఆమెను
నేను చూసాను ఆమెను కూడలిలో
నేను చూసాను కూడలిలో ఆమె రక్తంచిందించటం
నేను చూసాను కూడలిలో ఆమె నడవలేకపోవటం
నేను చూసాను కూడలిలో ఆమె చంపబడటం
నేను చూసాను... నేను చూసాను....
ఈమె సంరక్షకుడు ఎవరని అతను బిగ్గరగా అరచినప్పుడు
నాకు ఆమె పరిచయమే అనే విషయాన్ని చెప్పలేదు
ఆ కూడలిలో ఆమెనలా విడిచిపెట్టేశాను
ఆ కూడలిలో రక్తమడుగులో ఆమెనలా విడిచిపెట్టేసాను
ఆ కూడలిలో నడవలేకపోతున్న ఆమెనలా విడిచిపెట్టేసాను
ఆ కూడలిలో మృత్యువుకి ఆమెనలా విడిచిపెట్టేసాను
ఆమెనలా విడిచిపెట్టేసాను....
4.
End of Discussion with a Jailer
నా జైలుగది కిటికీలోంచి
నన్ను చూసి నవ్వే చెట్లు
నా ప్రజలతో నిండిన ఇంటికప్పులు
నాకోసం విలపిస్తూ ప్రార్ధించే కిటికీలు కనిపిస్తాయి
నా ఇరుకైన గది తలుపురంద్రంలోంచి
నీ విశాలమైన గది కూడా కనిపిస్తుంది.
5. Confession at Midday
.
ఒక చెట్టును నాటాను
దాని ఫలాల్ని తృణీకరించి
మానుని కలపగా వాడుకొన్నాను
కొమ్మలను వీణగా చేసి
గొప్ప రాగాల్ని పలికించాను
వీణ పగిలిపోయింది
రాగాలు ఆగిపోయాయి
ఫలాలు పోగొట్టుకొన్నాను
ఇప్పుడు చెట్టు కొరకు దుఃఖిస్తున్నాను.
,
మూలం- Samih al-Qasim
అనువాదం: బొల్లోజు బాబా

Tuesday, May 18, 2021
Imported post: Facebook Post: 2021-05-18T09:56:44
ఒకానొకప్పుడు Once Upon A Time by K. Sachidanandan
.
నీకుతెలుసా
ఒకానొకప్పుడు కోకిలమాత్రమే కాదు
ప్రతీ పక్షీ గానం చేసేది, కాకితో సహా
అవే మనకు పదాలను ఇచ్చాయి
వాటి పాటలు పంటచేలలో నీళ్ళై పారేవి
వాటిపాటలు పూలను కవిత్వంతో,
పళ్ళను కథలతో, నిద్రను కలలతో,
స్తనాలను పాలతో, దేహాలను కోర్కెలతో
హృదయాలను కరుణతో నింపేవి.
ముక్కులలో రక్తం నిండగా పక్షులు
పాడటం మానేసాయి
ఆపై, చెట్ల నృత్యాలు, మృగాల నవ్వులు
శిలల సంభాషణలు, సెలయేర్ల తియ్యదనాలు
నిలిచిపోయాయి.
చివరకు బుద్ధుడు నేనూ ఒంటరిగా మిగిలిపోయాం
చీకట్లో ఒకరికొకరు అగోచరంగా ఉన్నాం.
ఒణికించే చలిలో రావి ఆకుల్లా రెపరెపలాడాం
బుద్ధుని గద్గదాక్రందనలు శూన్యాన్ని ప్రకాశింపచేశాయి
ఇక ఎంతమాత్రమూ తాళలేక
ముక్తకంఠంతో 'ఓయని' రోదించాం మేం.
వెలుగు విచ్చుకొంది.
సగంకాలిన రెక్కలు అల్లాడిస్తో పక్షులు తిరిగి వచ్చాయి.
భూమిపై అంతరించిన రంగులగురించి, స్వరాల గురించి
నులిమివేయబడిన గొంతుకలతో
ఇంకా మిగిలున్న కొద్ది పదాలతో
పాటలు గానం చేసాయి
మా సమాధుల తోటలో.
.
Once Upon A Time by K. Sachidanandan

Monday, May 17, 2021
Imported post: Facebook Post: 2021-05-17T17:59:50
అలిఖిత కవిత The Unwritten Poem by K. Sachidanandan
ఇంకా ఎవరూ రాయని కవితను నేను
ఎందరో కవుల వేలికొనల వరకూ ప్రయాణించి
సరైన లిపి లేక అవ్యక్తప్రేమలా
స్వప్నంలోకి వెనుతిరిగాను ఎన్నోసార్లు
భవిష్యత్తును వ్యక్తీకరించగలిగినంతవరకూ
భాషపట్ల నాకే ఆక్షేపణా లేదు.
ఏదో ఒక రోజు నాక్కావాల్సిన పదాల్ని పట్టుకొంటాను:
ఓ కొత్త నక్షత్రపు నీడలో
ఖాళీపేజీపై ఒక తెరచాప విచ్చుకొని
మెలమెల్లగా పైకిలేచి రెపరెపలాడటం
విప్పారిన కళ్ళతో ఓ పిలగాడు తదేకంగా చూస్తాడు.
.
మూలం The Unwritten Poem by

Sunday, May 16, 2021
Imported post: Facebook Post: 2021-05-16T09:57:02
ప్రముఖ అభ్యుదయకవి శ్రీ అదృష్ట దీపక్ గారికి నివాళులు
బొల్లోజు బాబా
Imported post: Facebook Post: 2021-05-16T09:57:02
ప్రముఖ అభ్యుదయకవి శ్రీ అదృష్ట దీపక్ గారికి నివాళులు
బొల్లోజు బాబా
Wednesday, May 12, 2021
Imported post: Facebook Post: 2021-05-12T23:47:08
Mona Sa'udi కవిత్వం
.
Mona Sa'udi 1945 లో జోర్డాన్ లో జన్మించారు. కవయిత్రిగా, ఆధునిక శిల్పకారిణిగా ఈమె ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. Darwish, Adonis లు తనకు ప్రేరణ అనే ఈమె కవిత్వంలో దార్విష్ శైలి ప్రముఖంగా కనిపిస్తుంది. Ruya Ula (First Visions), In Times of War Children Testify ఈమె కవిత్వ సంపుటులు.
Mona Sa'udi కవిత్వంలో దుఃఖపు జీర, మిరిమిట్లు గొలిపే ప్రతీకలు ఆకర్షిస్తాయి.
***
1.
అంధనగరం
దాని వీధుల్లో నా చూపులు విస్తరిస్తాయి
వస్తువుల గందరగోళంలో
నిద్రలేమి పద్మవ్యూహంలో
నిశ్చల సముద్రం, కాలం
రాత్రి మృత్యువుల
నిశ్శబ్దపు స్వరాలు వింటాను.
దుఃఖించే పేవ్ మెంట్లతో
నన్ను నేను వెచ్చబరచుకొంటాను
అక్కడ చిన్న నీటిగుంటలో సైతం
కాంతి చిమ్మే జీవితం తళుక్కున మెరుస్తుంది.
2.
ఉప్పు స్పటికాల ఓడలపై
ఎడారులు నిండిన నిశీధి నగ్నత్వంపై
నక్షత్రాల త్రోవల్లో, గ్రహాల దారుల్లో
నా ప్రయాణం.
స్వప్నాల రేవులో నాకు నేను దొరుకుతాను
ఈ ప్రపంచం ఒక ఆటబొమ్మ స్థాయికి కుదించుకుపోయింది
అంధగాయకుడొకరు పాటఎత్తుకొంటాడు
రాత్రి చీకటిపై కాసేపు తచ్చాడుతాను
అంధులైన అందరితో ప్రేమలో పడతాను
ఈ రాత్రి నేను జన్మిస్తాను
ఈ రాత్రి నేను మరణిస్తాను
జీవించి ఉన్న అందరకూ అభినందనలు
మరణించినవారికి కూడా.
3.
శవపేటికలోని ఏకాంతం అంగడిలోని
అనామక వస్తువులపై కాసేపు వాలి
అంత్యక్రియల రోదనశబ్దాలుగా పైకి లేచింది.
నేను కన్నీళ్ళకన్నా ధృఢంగా మారతాను
కన్నీళ్ళు శిలారూపం పొందుతాయి
శిల, నేను నిలుపుకోలేకపోయిన ఓ స్నేహితుడు
సకల పరిమాణాలలో నేను విచ్ఛిన్నమౌతాను
హెచ్చవేయబడతాను
ద్రవంలా భిన్న ఆకారాలు పొందుతాను.
.
Source: Mona Sa'udi poems

Tuesday, May 11, 2021
Imported post: Facebook Post: 2021-05-11T21:10:13
Who remains standing - Andree Chedid - Egypt Poetess.
.
ముందుగా
నీ పేరు చెరిపేసుకో
గతాన్ని రద్దుచేసుకో
నిన్ను చుట్టుముట్టినవాటిని చెదరగొట్టు
నువ్వు దేన్నైతే
నీ అస్తిత్వం అనుకొంటున్నావో
దాన్ని సమూలంగా పెకలించుకో
చివరకు ఏం నిలిచింది?
అప్పుడు
నీ పేరుని మరలా రాయి
నీ వయసును తిరిగి తెచ్చుకో
నీ ఇంటిని మరలా నిర్మించుకో
నీ మార్గాన్ని అనుసరించు
ఇంకా
మళ్లీ ప్రారంభించు... మొదటి నుంచీ.
.
Andree Chedid - Egypt born French Poetess

Saturday, May 8, 2021
Imported post: Facebook Post: 2021-05-08T19:42:29
కల్నల్ కాలిన్ మెకంజీ
.
(కాలిన్ మెకంజీ ద్విశతవర్ధంతి సందర్భంగా)
కాలిన్ మెకంజీ 1754లో స్కాట్లాండ్ లోని Stornoway, Isle of Lewis లో జన్మించాడు. 2 సెప్టెంబర్ 1783 న ఈస్టిండియా కంపనీ ఉద్యోగిగా మద్రాసులో అడుగుపెట్టాడు. అది మొదలు 1821 లో కలకత్తాలో చనిపోయేవరకూ మెకంజీ ఇండియాలోనే ఉన్నాడు. 1784-90 ల మధ్య ఇతను రాయలసీమ-కృష్ణా పరిసర ప్రాంతాలలో కంపనీ సైనిక ఇంజనీరుగా పనిచేసాడు. 1799 లో టిపు సుల్తాను ఓటమి కారణంగా కంపనీ పరమైన కర్ణాటక జిల్లాలను, నిజాం దఖలు పరచిన సీడెడ్ జిల్లాలను సర్వే చేసే బాధ్యతను కంపనీ మెకంజీకి అప్పగించింది. ఆ సమయంలో సర్వే నిమిత్తం కృష్ణా దిగువ ప్రాంతాలను విస్త్రుతంగా పర్యటించాడు. ఏలూరుకు చెందిన కావలి సోదరుల సహాయంతో మెకంజీ అనేక స్థానికచరిత్రలను, శాసనాలను సేకరించాడు. అప్పటివరకూ హిందువులకు చరిత్రను దాచుకోవాలనే శ్రద్ధలేదు అని వాదించిన బ్రిటిష్ చరిత్రకారులను గ్రామకరణాలవద్ద ఉండే కవెలకట్టలలో (తాటియాకు పత్రాలు) ఆ గ్రామచరిత్ర, సరిహద్దులు, పాలించిన స్థానికనాయకుల వివరాలను స్థానికులు భద్రపరచుకొన్నారన్న విషయం, విస్మయపరచింది. వీటిని కైఫియ్యతులు అన్నారు. తాను సేకరించిన చారిత్రిక సమాచారాన్ని తన మిత్రులతో తరుచూ పంచుకొంటూ చర్చిస్తూ ఉండేవాడు మెకంజీ. హిందువుల చరిత్రను వ్రాయటానికి హిందువుల మూలాలను శోధించాలి తప్ప పెర్షియన్ మూలాలను కాదు అని మెకంజీ వాదించేవాడు.
ఈస్ట్ ఇండియా కంపనీ 1810 లో ఇతనిని మద్రాసు ప్రెసిడెన్సీ సర్వేయర్ జనరల్ గా నియమించింది. 1811 లో జావా ద్వీపంపై కుంఫణీ సైన్యం దండయాత్ర చేసినపుడు మెకంజీ కూడా ఉద్యోగ రీత్యా కంపనీ సైన్యాన్ని వెంబడించవలసి వచ్చింది. ఎందుకైనా మంచిదని వీలునామా రాసి పెట్టాడు. అక్కడ 18 నవంబరు 1812న డచ్ సంతతికి చెందిన Petronella jacomina Bartels ను వివాహమాడాడు.
1815లో తిరిగి ఇండియా చేరుకొన్నాకా మెకంజీ భారతదేశ సర్వేయర్ జనరల్ గా నియమించబడ్డాడు. కలకత్తా సెయింట్ జార్జి కోటలో ఇతని ఆఫీసు. అక్కడకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ – అప్పటిదాకా ఆంధ్ర, తమిళ, కర్ణాటక ప్రాంతాలలో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించటం కోసం మద్రాసులో ఉండేందుకు కంపనీ అనుమతి తీసుకొని 1817 వరకూ మద్రాసులోనే ఉన్నాడు.
1817 లో మెకంజీ తన మిత్రుడైన అలెగ్జాండర్ జాన్ స్టన్ కు వ్రాసిన ఒక లేఖలో ఈ స్థానిక చరిత్రలను సేకరించటంలో తన ఉద్దేశాలను, నిబద్దతను, కష్టాలను ఇలా చెప్పుకొన్నాడు .
1. 1799 లో కంపనీకి సంక్రమించిన ప్రాంతాల హద్దులను నిర్ణయించే పని నాకు అప్పగించినపుడు- సరిహద్దులే కాక ఆ ప్రాంత చరిత్ర, భౌగోళిక స్వరూపాన్ని కూడా అధ్యయనం చేస్తానని నేను చెప్పిన ప్రణాళికను కంపనీ ఆమోదించి ముగ్గురు గుమస్తాలను, ఒక నాచురలిస్ట్ ను నాకు సహాయకులుగా ఇచ్చింది. కానీ 1801 లో వీరిని తొలగించటంతో నా ప్రణాళికలన్నీ భగ్నమయ్యాయి. ఈ ప్రాంతాల జీవరాశిని రికార్డు చేద్దామనే నా ఆలోచన ఫలించలేదు. అంతే కాక నా జీతం, నాకు ఇచ్చే కంటింజెన్సీ డబ్బులు కూడా తగ్గించేసారు. దీనివల్ల నా ప్రణాళిక దాదాపు కుంటుపడింది.
2. అయినప్పటికీ నేనీ పనులు చేయగలిగాను
జైనులు, బుద్ధులు వేరు వేరు అని నిర్ధారించగలిగాను (అప్పట్లో ఈ మతాలను హిందూ మతంలో అంతర్భాగాలుగా భావించేవారు); ప్రాచీన మతసాంప్రదాయాలైన లింగాయత్, శైవం, పాండరం, మఠాలు వివిధ శాఖలు వాటి పుట్టుపూర్వోత్తరాలు స్పష్టపరిచాను;
సుమారు మూడు వేల వివిధ శిలా శాసనాలు, తామ్రపత్రాలకు నకళ్ళు తీయించాను; ఢిల్లీ నుంచి కేప్ కొమరిన్ దాకా ఉన్న Veeracul, Maastie cull లలోని పురాతనజాతుల సంస్కృతిని వెలికితీసాను.
(పైన చెప్పిన అన్ని అంశాలను మెకంజీ మొత్తం 12 రీసెర్చ్ పేపర్లుగా ఆసియాటిక్ జర్నల్ లో ప్రచురించాడు)
3. కొన్నాళ్ళు మద్రాసులోనే ఉంచమని కోరటానికి కారణాలు ఈ లేఖలో ఇలా చెప్పుకొన్నాడు మెకంజీ – “నాకు సహాయకులుగా ఉన్న వ్యక్తులతో నా అనుబంధం వ్యక్తిగతమైనది. వాళ్ళు ఈ ప్రాంతపు స్థానికులు, కలకత్తాకు నాతో పాటు వాళ్ళు వచ్చి జీవించలేరు. మేము సేకరించిన విషయాలను కేటలాగ్ చేయాలి. చాలా వాటిని అనువదించాలి. ఇది కలకత్తాలో సాధ్యపడదు. నేను ఇంగ్లాండు వెళ్ళేలోగా కనీసం స్థానిక వ్రాతప్రతులు, పుస్తకాలు, శాసనాల సంక్షిప్తసమాచారాన్ని పుస్తక రూపంలో చూడాలని నా కోరిక. దీనికి నా ఆరోగ్యం సహకరించకపోవచ్చు. కనీసం విద్యావంతులకు తదుపరి పరిశోధనలకు వీలుగానైనా వీటిని కేటలాగ్ చేయించాలి.
***
అలా ఇంగ్లాండు వెళ్లాలని ఆశపడ్డ మెకంజీ పాపం వెళ్ళనే లేదు. మెకంజీ సేకరణలు శిధిలమౌతున్నాయని గమనించిన సి.పి. బ్రౌన్ 1840లలో సుమారు 419 వాల్యూములకు నకళ్ళు తయారు చేయించాడు. వాటికి మరలా తిరిగి 1940-65ల మధ్య మరోసారి నకళ్ళు తీయించటం జరిగింది . ఆంధ్రప్రదేష్ ఆర్చైవ్స్ విభాగం వారు 1970 లలో మెకంజీ సేకరణలను మైక్రోఫిల్ములుగా మార్చారు. నేడు మద్రాసు లైబ్రేరీలో ఉన్నతెలుగు మెకంజీ కైఫియ్యతుల వ్రాతప్రతులు చదవటానికి వీల్లేని విధంగా పూర్తిగా పాడయిపోయాయి.
****
మెకంజీ సేకరణా విధానం
మెకంజీకి భారతీయ భాషలు రావు. దీనికి కారణం ఇతని ఉద్యోగమే. మెకంజీ ఒక సర్వేయరు. ఇతని ఉద్యోగం విపరీతమైన శారీరిక శ్రమ, నిత్యం ప్రయాణాలతో కూడుకొని ఉండేది. ఒక చోట స్థిరంగా, స్థిమితంగా కూర్చుని గురుముఖంగా బారతీయ భాషలను అధ్యయనం చేసే అవకాసం అతనికి ఎన్నడూ రాలేదు. భారతీయభాషలు నేర్చుకోలేకపోవటం తన బలహీనత అయినప్పటికీ తనవద్ద నున్న పండితులు బహుభాషాకోవిదులు కనుక ఆ లోపం పెద్దగా ఇబ్బంది పెట్టలేదు అని చెప్పుకొన్నాడు మెకంజీ.
సర్వే అనేది స్థానికంగా వెళ్ళి చేయాల్సినపని. అందువలన ఇతనికి ఆయాప్రాంతాలలో స్వయంగా పర్యటించే అవకాశం వచ్చింది. దీనిని వినియోగించుకొని స్థానిక గ్రామకరణాల వద్ద ఉండే కవెలకట్టలలోని గ్రామ చరిత్రలను, స్థానికంగా లభించే తాళపత్ర గ్రంధాలను సేకరించాడు. వివిధ ఆలయశాసనాలను చూసి వాటి ప్రతులను తయారుచేయించాడు. శిల్పాలు శిధిలమౌతున్న ప్రాచీనకట్టడాల చిత్రాలు గీయించటం లాంటి పనులకు ఎక్కువ విలువ ఇచ్చేవాడు. గ్రామాలనుంచి సేకరిస్తున్న కైఫియత్తులతో భారతదేశ చరిత్రను తెలుసుకోవచ్చునని మెకంజీ నమ్మాడు. గ్ర్రామ చరిత్రలే కాక, ఆయాప్రాంతాలలోని వృక్ష, జంతురాశి, ప్రజల అలవాట్లు ఆచారాలగురించి కూడా సమాచారం సేకరించాలని అనుకొన్నాడు మెకంజి.
ఇతను నియమించుకొన్న ఉద్యోగుల జీత భత్యాలు కంపనీ భరించేది. ఇది లక్షరూపాయిల మేరకు అయినట్లు రికార్డులు చెపుతున్నాయి. క్రమేపీ కంపనీ డబ్బులు ఇవ్వటం మానేసాకా ఒకానొక దశలో వారికి జీతాలు మెకంజీయే స్వయంగా ఇచ్చాడు. మెకంజీ సేకరణలలో ఎక్కువ భాగం ఈ విధంగా స్వయంగా సేకరించినవే. తాను స్వయంగా వెళ్లలేని ప్రదేశాలకు తన అనుచరులను పంపి రిపోర్టులు తెప్పించుకొనే వాడు.
***
కాలిన్ మెకంజీ స్వయంగా చిత్రకారుడైనప్పటికీ ఇతనివద్ద వివిధ చిత్రకారుల బృందమొకటి ఉండేది. వీరు మెకంజీ ఆదేశాలకనుగుణంగా అనేక చిత్రాలను లిఖించారు. మెకంజీ గీయించిన చిత్రాల ఆధారంగా Illustrating India, The Early Colonial Investigations of Colin Mackenzie పేరుతో Jennifer Howes 2010 లో ఒక పుస్తకాన్ని వెలువరించింది. ఈ పుస్తకంలో ఆమె కొన్ని వందల మెకంజీ డ్రాయింగ్స్ ని తీసుకొని, వాటి చారిత్రిక నేపథ్యాన్ని ఆ చిత్రంలో ఉన్న లోతైన విశేషాలను అద్భుతంగా వర్ణించింది.
మెకంజీ వద్ద సహాయకులుగా ఉన్న కావలిసోదరులకు తిరిగి మరలా సహాయకులు ఉండేవారు. అలాగ కావలి వెంకట లక్ష్మయ్య వద్ద నారాయణ రావు, నిట్టల నారాయన, ఆనందరావు, నరసింహులు, సీతయ్య అనే అనుయాయీలు ఉండేవారు. వీరిని వివిధ ప్రాంతాలు పంపించి అక్కడి వివరాలను రిపోర్టులు రూపంలో తెప్పించుకొనేవారు. అలా నారాయణరావు అనే వ్యక్తి పంపిన అనేక రిపోర్టులు మెకంజీ కైఫియ్యతులలో లభిస్తాయి. ఇతని రిపోర్టులలో ఆ యా ఊర్లకు ఎలా వెళ్ళిందీ, ఎంతదూరం, ఎక్కడ బసచేసాడు, ఎంతెంత ఖర్చయింది లాంటి వివరాలు కూడా ఉండటం విశేషం.
ఎక్కడకు వెళ్లాలి, ఏం సేకరించాలి అనే విషయాలపట్ల మెకంజీ చాలా స్పష్టంగా వీరందరికీ దిశానిర్ధేశం చేసే వాడు. ఒకసారి మెకంజీ వెంకటలక్ష్మయ్యను మహాబలిపురం పంపిస్తూ – “నువ్వు అక్కడ మొదటగా ఆలయప్రధాన అర్చకులను, ఊరిపెద్దలను కలుసుకో, వారితో మర్యాదగా వ్యవహరించు, వారి విశ్వాసాన్ని చూరగొను, నీపని తప్ప మరే ఇతర విషయాలలోను తలదూర్చకు, అక్కడి వివరాలు ప్రతీరోజు డైరీలో రాయి, అక్కడి భవనాలు, శిల్పాలు, ఆసక్తి కలిగించే అంశాలు అన్నింటినీ నమోదు చెయ్యి, వారితో పరిచయం పెంచుకొన్నాక మొదట వ్రాతప్రతులు సేకరించు, తరువాత శాసనాలు, ఆ పిదప ఆ ప్రాంతంలో గతంలో జరిగిన ఆసక్తికర ఉదంతాలను అడుగు - అంటూ ఖచ్చితమైన సూచనలు ఇచ్చాడు .
కొన్ని చోట్ల స్థానికులు సమాచారాన్ని పంచుకోవటానికి ఇష్టపడక మెకంజీ అనుచరులను అటకాయించిన సంఘటనలు ఎదురయ్యేవి. తమిళనాడులోని ఈరోడ్ నుంచి నిట్టల నాయిన 10 మార్చ్, 1807 న వ్రాసిన ఉత్తరంలో “ఇక్కడ సమాచారం ఇవ్వకుండా ఇద్దరు బ్రాహ్మలు నన్ను బెదిరిస్తున్నారు, మీరీ విషయాన్ని కలక్టరుగారికి చెప్పి నాకు మార్గం సులభం చేస్తే తప్ప ఇక్కడి శాసనాల వివరాలను సేకరించలేను” అని వ్రాసాడు. మెకంజీ బహుసా M. Gorrow అనే కలక్టరుకు ఈ విషయం చెప్పి ఉంటాడు. ఏప్రిల్ 18 న నిట్టల నాయన వ్రాసిన మరో ఉత్తరంలో “కలక్టరు M. Gorrow గారి చొరవవల్ల నేను ఇక్కడ 20 శాసనాలు, కొన్ని తామ్రపత్రాలు, చాలా గ్రామాల కైఫియత్తులను సేకరించాను” అని చెప్పాడు.
మొదట్లో మెకంజీ సేకరిస్తున్న స్థానిక చరిత్రలను సమకాలీన బ్రిటిష్ చరిత్రకారులు పెద్దగా పట్టించుకొనేవారు కాదు. వాటిని పురాణగాథలని వాటికి చారిత్రిక విలువ ఉండదనీ తీసిపారేసేవారు. కానీ HH Wilson, Charles Wilkins లాంటి చరిత్రకారులు మెకంజీ చేస్తున్న ఈ ప్రయత్నం చాలా గొప్పదని, దీని ద్వారా భారతదేశ చరిత్ర, సంస్కృతులను అర్ధంచేసుకొనే అవకాసం చిక్కుతుందని సమర్ధించారు. శాసనాలలో, తామ్రపత్రాలలో దానం ఇచ్చిన రాజు వంశావళిద్వారా హిందువుల చరిత్రను నిర్మించవచ్చు అని Mark wilks అనే మరో చరిత్రకారుడు గమనించాడు.
ఈ నేపథ్యంలో తన అనుచరులు తనకు కావాల్సిన సమాచార సేకరణలో వివిధ చోట్ల ఎదుర్కొంటున్న సమస్యలను ఈస్ట్ ఇండియా కంపనీ బోర్డు సభ్యులకు చెప్పి వారిని తన బృహత్ యత్నానికి సహాయపడవలసినదిగా మెకంజీ కోరి ఉంటాడు. కంపనీబోర్డు సానుకూలంగా స్పందించి తమ ఆధీనంలో ఉన్న జుడిషియల్, మెడికల్, రెవెన్యూ అధికారులకు 14 ఫిబ్రవరి 1808న ఒక మెమో జారీచేసి మెకంజీ చేస్తున్న సేకరణలకు సహకరించమని కోరింది. ఆ మెమోలో ఏయే అంశాలలో సహాయపడాలో స్పష్టంగా తెలిపింది.
అవి 1.వంశావళులు. 2. దండకవెలలు. 3. కాలజ్ఞానం సంగతులు (భవిష్యత్తును ఊహించి చెప్పే విషయాలు). 4.చరిత్రలు (ప్రసిద్ధిగాంచిన కథలు, పాత్రలు). 5. పన్ను వసూళ్ల వివరాలు. 6. ఒక గ్రామంలో ఉండే కుటుంబాల సంఖ్య, గ్రామజనాభాలో కులాల వారి విభజన. (ఇది చాలా విలువైన సమాచారం. మరి ఎందుచేతనో ఈ వివరాలు ఏ కైఫీయత్తులోను కనిపించలేదు) 7. గుడులు, గుడిమాన్యాలు, మఠాలు మఠాధిపతులు, స్థలపురాణాలు. 8. శాసనాలు, తామ్రపత్రాలు. 9. దానపత్రాలు. 10. పురాతన దేశీ విదేశీ నాణాలు. 11. ఒకనాటి ప్రధానపట్టణాలలో నేటికీ ఉన్న పాత భవనాలు, శిధిలమౌతున్న ఆలయాల చిత్రాలు. 12. వీరకల్ లు (వీరుల స్మారకంగా నిర్మించే శిలా విగ్రహాలు) 13. వివిధ శిల్పాల, నగిషీల చిత్రాలు.
ఈస్ట్ ఇండియా కంపనీ మెకంజీ పట్ల మొదట్లో కొంత ఉదాసీనతచూపినా పై మెమోద్వారా అతని కృషిని గుర్తించి సహాయపడినట్లు గ్రహించవచ్చు. ఒక గ్రామంలో పైన చెప్పిన అన్ని రకాల వివరాలు లభించకపోవచ్చు. కానీ పై సూచనలు మెకంజీ అనుచరులకు ఒక చెక్ లిస్ట్ లా ఉపయోగపడి ఉంటుంది.
***
1797లో అమరావతి స్థూపాన్ని గుర్తించిన మొదటి యూరోపియన్ కాలిన్ మెకంజీ. ఒక స్థానిక జమిందారు అమరావతిలో తాను చేపట్టిన ఒక భవన నిర్మాణరాయి కొరకు "దీపాల దిన్నె" గా స్థానికులు పిలుచుకొనే ఒక ఎత్తైన గుట్టను తవ్వించటం మొదలుపెట్టాడు. ఈ తవ్వకాలలో అక్కడ పాలరాతి ఫలకాలు అనేకం ఉన్నట్లుగా గుర్తించారు. ఈ వార్త కాలిన్ మెకంజీ దృష్టికి రావటంతో 1796 లో అమరావతి వచ్చి అక్కడ తొంభై అడుగుల వ్యాసంతో ఇరవై అడుగుల ఎత్తులో పాలరాతినిర్మాణం ఉందని, అక్కడ లభించిన కొన్ని శిధిలాల చిత్రాలతో కూడిన ఒక వ్యాసాన్ని వ్రాసాడు .
అనేక ఉద్యోగ ఒత్తిళ్ల వల్ల మరలా 1816కి కానీ మెకంజీ అమరావతి రాలేదు. అప్పుడు కూడా తన అనుచరులను, చిత్రకారులను ఆ ప్రాంతంలో పెట్టి తిరిగి వెళిపోయాడు. వీరు అమరావతి కట్టడం యొక్క అనేక చిత్రాలను రెండేళ్లపాడు గీస్తూనే ఉన్నారు. మెకంజీకి 1818 లో తిరిగి అమరావతికి వచ్చాడు. అక్కడ ఆ జమిందారు ఒక చెరువును నిర్మించటం వలన అమరావతి స్థూపం మరింత శిధిలమై కన్పించింది మెకంజీకి. అనేక ఫలకాలు చెల్లాచెదురుగా ఆ చెరువుగట్టున పడిఉండటాన్ని గమనించాడు. అక్కడ తవ్వకాలు జరిపించి బాగున్న ఫలకాలను భద్రపరచమని మచిలీపట్నం పంపించాడు. మెకంజీ చిత్రకారులు 1798-1818 ల మధ్య చిత్రించిన 132 అమరావతి ఫలకాలలో 81 ఫలకాలు 1845 నాటికే అదృశ్యమైపోయాయి, డ్రాయింగ్స్ మాత్రమే మిగిలాయి . వాటి ఆధారంగా Elliot, Sewell లాంటి ఆ తదుపరి చరిత్రకారులు అమరావతి స్థూపస్వరూపాన్ని నిర్ణయించారు .
అమరావతి స్థూపాన్ని మెకంజీ మొదట్లో జైన నిర్మాణంగా భావించాడు. అమరావతిపై వ్రాసిన మొదటి వ్యాసంలో దాన్ని జైన ఆలయంగా పేర్కొన్నాడు. 1818 లో తవ్వకాలు జరిపినపుడు అది బౌద్ధమతసంబంధమైనదనే అనుమానం కలిగింది మెకంజీకి. అప్పట్లో సాంచీ స్తూపం పై పరిశోధనలు చేస్తున్న Edward Fell కు బౌద్ధ నిర్మాణాల వివరాలు పంపమని కోరాడు. ఆ వివరాల ఆధారంగా వ్రాసిన రెండవ వ్యాసంలో మెకంజీ జైన మత ప్రస్తావన తేలేదు. ఇదేసమయంలో మెకంజీకి ఉదరసంబంధ అనారోగ్యం మొదలైంది.
మద్రాసులో పదివేల వరహాల విలువచేసే భవనాన్ని మెకంజీ అద్దెకు ఇచ్చేసి కలకత్తాకు వెళ్ళిపోయాడు. 1820 నాటికి ఇతని ఆరోగ్యం మరింత క్షీణించింది. గాలి మార్పు కొరకు ఒరిస్సా వెళ్లాడు. అక్కడ పూరీ జగన్నాధ ఆలయం, రధయాత్ర, చిల్కా సరస్సుల డ్రాయింగ్స్ సేకరించాడు. తిరిగి కలకత్తా వచ్చేసాడు. తీవ్ర అనారోగ్యం వల్ల తన సేకరణలపై పెద్దగా దృష్టి నిలపలేకపోయేవాడు. ఉప్పుగాలిని పీల్చితే రోగం నయమౌతుంది అన్న వైద్యుల సలహామేరకు హుగ్లీ నదిపై రోజూ 12 మైళ్ల దూరం పడవ సవారి చేసేవాడు. 8 మే 1821 న అలా పడవప్రయాణం చేస్తూ పడవలోనే మరణించాడు .
మెకంజీ సేకరించిన ప్రతులు సుమారు “14 భాషలకు” సంబంధించినవి. వీటిని మెకంజీ కూడా సంపూర్ణంగా పరిశీలించలేదు. వాటిని ఎప్పటికైనా స్థిమితంగా కూర్చొని క్రోడికరించాలని అనుకొని తనదారిలో కనిపించిన ప్రతి చిన్న అంశాన్నీ జీవితాంతం సేకరించుకొంటూ పోయాడు.
***
మెకంజీ మరణం తరువాత
మెకంజీ చనిపోయేనాటికి అతని భార్య పెట్రొనెల్లా వయసు ఇరవై ఏళ్ళు. ఈమె తన స్వస్థలమైన Isle of Lewis లో ఉంటున్న తన అక్క మేరి వద్ద ఉండేటట్లు మెకంజీ తనవీలునామాలో ఏర్పాట్లు చేసాడు. పెట్రొనెల్లా 1823 లో Robert Fulcher అనే సైనికాధికారిని పెళ్ళి చేసుకొని కొంతకాలం ఇండియాలో ఉండి 1828 లో భర్తతో పాటు లండన్ వెళిపోయింది.
మెకంజీ సొంతడబ్బులతో పెట్టికొనుక్కొన్న పుస్తకాలు, పురావస్తువుల విలువ సుమారు లక్షరూపాయిలు ఉండొచ్చని విలువకట్టారు. వీటన్నింటిని ఇరవై వేల రూపాయిలకు మెకంజీ భార్య కంపనీ ప్రభుత్వానికి ఇచ్చివేసింది. బహుసా విడివిడిగా వ్యక్తుల వద్ద ఉండే కంటే ఒకచోట ఉంటాయని భావించిందేమో.
మెకంజీ మరణించాక అతని స్థానంలోకి వచ్చిన అధికారికి దాదాపు “లక్ష పేజీల” వరకూ ఉన్న ఈ వ్రాతప్రతులను, ఇతరసేకరణలను ఎలా మదింపువేయాలో అర్ధంకాలేదు. వాటిని ఏంచేయాలో తెలియక కంపనీ అధికారులు తలలు పట్టుకొని కూర్చునేవారు. అలాంటి సమయంలో మెకంజీ మిత్రుడు H H Wilson అనే అధికారి, వీటిని క్రోడికరించటానికి ముందుకురాగా కంపనీ బోర్డు వెంటనే అనుమతినిచ్చింది.
విల్సన్ మెకంజీ సేకరణలను పరిశీలించి వాటిలో - 2070 స్థానిక చరిత్రలు; 8076 శాసనాలు; పన్నెండు భారతీయ భాషలకు చెందిన 1568 కావ్యాలు, తెలుగులో ఉన్నవి 176; 2159 ఇంగ్లీషు అనువాదాలు; 79 పటాలు; 2630 డ్రాయింగ్స్; 106 ఇమేజెస్; 6218 నాణాలు అంటూ వేరుచేసి వాటికి ఇండెక్స్ నంబర్లు ఇచ్చి మొత్తం ఆ వివరాలను 1828 లో Meckenzie Collection - A Descriptive Catalogue of the Oriental Manuscripts and Other articles అనే రెండువాల్యూముల పుస్తకాలుగా వెలువరించాడు. పైన చెప్పిన సేకరణలలో చాలా మట్టుకు బ్రిటిష్ లైబ్రేరీకి, కొన్నింటిని మద్రాసు లైబ్రేరీకి తరలించారు.
విల్సన్ ఈ పుస్తకానికి వ్రాసిన ముందుమాటలో- వీటన్నింటిలో శాసనాలు, స్థానిక చరిత్రలు ముఖ్యమైనవని, వీటిని మరింత శోధించవలసి ఉందని బావించాడు. తెలుగు సాహిత్యంలో ఎక్కువగా సంస్కృత అనువాదాలు ఉన్నాయని, కొద్దిగా మాత్రమే స్వతంత్ర రచనలు లభించాయని అన్నాడు. మెకంజీ కృష్ణా నదికి దక్షిణభాగం (రాయలసీమ ప్రాంతం) నుంచి ఎక్కువ సేకరణలు జరిపినట్లు ఉత్తరభాగం నుంచి పెద్దగా సేకరణలు లేనట్టు గుర్తించాడు. బహుసా ఆ కారణం వల్లనే కడపజిల్లా కైఫియ్యతులు ఏడు సంపుటాలుగా మనకు లభించినట్లుగా ఇతరకోస్తా జిల్లాల కైఫియ్యతులు లభించవు.
ఆ తరువాత William Taylor మద్రాసులోని మెకంజీ వ్రాతప్రతులకు సంక్షిప్తానువాదం చేసి Examination and analysis of the mackenzie manuscripts deposited in the madras library అనే పేరుతో 1862 నాటికి మూడువాల్యూములు వెలువరించాడు.
విల్సన్, టేలర్ చేసిన కేటలాగులను సమన్వయపరుస్తూ T.V. Mahalingam, 1976 లో Mackenzie Manuscripts: Summaries of the Historical Manuscripts in the Mackenzie Collection పేరుతో రెండువాల్యూములను వెలువరించాడు.
***
కాలిన్ మెకంజీ ప్రాసంగికత
మెకంజీ భారతీయులు చరిత్రను రకరకాల రూపాల్లో భద్రపరచుకొన్నారని గ్రహించాడు. ఏఏ చోట్ల భారతదేశ నిక్షిప్తమై ఉందో కూడా మెకంజీ గుర్తించాడు. వాటిని తన జీవితకాలం అకుంఠిత దీక్షతో శ్రమించి సేకరించాడు.
విల్సన్ అన్నట్లు మెకంజీ సేకరణలలో శాసనాలు, కైఫియ్యతులు ముఖ్యమైనవి. వీటి ద్వారా అప్పటి సామాజిక వ్యవస్థ, చరిత్ర, సాహిత్యం, గ్రామాల సరిహద్దులు, ఆనాటి పాలకుల వంశావళి వంటి అనేక అపురూపవిషయాలు తెలుస్తాయి. ఒక గ్రామంలోని ఆలయాలు, వాటికి ఇచ్చిన దానాలు, వాటి మాన్యాలు, ఆ ప్రాంతంలో పండే పంటలు, ప్రజలుకట్టిన పన్నులు, ఆ గ్రామం పుట్టుపూర్వోత్తరాల గురించిన కథలు, ఆనాటి కథలు గాథలు, విశ్వాసాలు, ఆచారవ్యవహారాలులాంటి అనేక సంగతులు కైఫియ్యతులలో ఉన్నాయి. రెండు శతాబ్దాల క్రితం తెలుగునేల ఎలాఉండేది అనే విషయాలు నేడు తెలుసుకోవటంలో మెకంజీ సేకరణల పాత్ర తక్కువేమీ కాదు. మెకంజీ వీటిని సేకరించి ఉండకపోతే చాలాస్థానిక విషయాలు కాలగర్భంలో కలసిఫోయిఉండేవి. ఈ కైఫియ్యత్తులు స్థానికులు వ్రాసుకొన్న చరిత్రలు. నేడు సబ్ ఆల్ట్రన్ చరిత్రల అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా విస్త్రుతంగా జరుగుతున్నది.
నేడు చరిత్రను మూడు కోణాలలో అధ్యయనం చేస్తున్నారు
1. చరిత్రను స్థలము, కాలము, అక్కడి ప్రజల సంస్కృతులను దృష్టిలో ఉంచుకొని చూడటం.
2. చారిత్రిక దస్తావేజులను ఆ దేశ స్మృతులుగా గుర్తించటం
3. వివిధ శాస్త్రాలు పరస్పరసహకారం అందించుకొని చరిత్రను నిర్మించటం.
పై మూడు కోణాలలోంచి చరిత్రకారులు నెరేటివ్స్ ను నిర్మిస్తున్నారు. చరిత్రలో జరిగిన వివిధ సంఘటనలద్వారా మానవజాతి గమనం ఇలా నడిచింది అని చెప్పే కథనాలను హిస్టారికల్ నెరేటివ్స్ అంటున్నారు. ఇది ఒకరకంగా Civil history of Mankind. దీనిలో ఆధారాలను సేకరించటం ఒక ఎత్తు అయితే వాటిని విశ్లేషించటం మరొక ఎత్తు.
దక్షిణభారతదేశ చరిత్రను అధ్యయనం చేసే చరిత్రకారులకు మెకంజీ సేకరణలు ఇంకా చాలా తరాలవరకూ తరగని గనివంటివి. రెండువందల ఏళ్లతరువాత కూడా ఇంకా తరగని గని లాగ ఉన్నాయి.
ఇటీవలికాలంలో యూరోపియన్ చరిత్రకారుల దృష్టి బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న అపారమైన మెకంజి సేకరణలపై పడింది. వాటిపై గొప్ప రీసర్చ్ జరుగుతోంది. Jennifer Howes, Philip Wagnoner, Dirks Nicholas, Nick Barnard, Rama Sundari Mantena, Sushma Jansari లాంటి చరిత్రకారులు Mackenzie సేకరణలపై గొప్ప పరిశోధనలు చేసి పుస్తకాలు వ్రాస్తున్నారు.
***
ఉపసంహారం
కాలిన్ మెకంజీ దిగువమధ్యతరగతికి చెందిన కుటుంబంనుంచి వచ్చాడు. ఇతని తండ్రి ఒక పోస్ట్ మాస్టర్.
మెకంజీ ఆరు అడుగుల రెండు అంగుళాల పొడవుతో బలమైన దేహంతో ఉండేవాడు. మెకంజీ 57 ఏండ్ల వయసులో జావాయుద్ధంలో పాల్గొన్న నాటి ఒక సంఘటనను అతనితో పాటు ఆ యుద్ధంలో పాల్గొన్న ఒక యువసహచరుడు చెప్పిన ఒక ఉదంతమిది. "ఒకరోజు అకస్మాత్తుగా చాలా సమీపంనుంచి మాపై శతృవుల దాడి జరిగింది. ఏం చేయాలో పాలుపోని నేను, ఆ ముసలాయన (మెకంజీ) జేబులో రెండు రైఫిల్స్ పెట్టి అతని తలరాత బాగుంటే తప్పించుకొంటాడు అని వదిలేసి మేం మా స్థావరాలవైపు పరుగులు తీసాం. ఆశ్చర్యకరంగా అతను మాకన్నా వేగంగా పరిగెత్తి, పొడవైనదేహంతో నీళ్లల్లో ఈదుకొంటూ మమ్ములను దాటుకొని శిబిరాన్ని చేరుకొన్నాడు. అప్పుడు అతని శరీర సామర్ధ్యం, హృదయ సామర్ధ్యంతో సమానమని మాకు అర్ధమైంది. "
***
మెకంజి ప్రతినెలా తన జీతంలో చాలా భాగం లండన్ లో ఉండే తన మిత్రుడైన Thomas Anderson ద్వారా స్కాట్లాండ్ లోని తనకుటుంబానికి పంపించేవాడు. 1793 లో వ్రాసిన ఒక ఉత్తరంలో - తండ్రికి 50 పౌండ్లు, అక్కకు 25 పౌండ్లు, మేనత్తకు 10 పౌండ్లు అందచేయమని చెపుతాడు. 1796 లో వ్రాసిన మరో ఉత్తరంలో తాను పంపుతున్న వంద పౌండ్లతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తన తండ్రిని చిక్కుల్లోంచి బయటపడేయమని కోరాడు. వీలైతే స్వయంగా వెళ్లి ఎలా మంచిదనిపిస్తే అలా సమస్యను పరిష్కరించమని అభ్యర్ధించాడు. మెకంజీ లేఖలలో తాను స్వస్థానికి వెళ్లాలన్న కోర్కెను పదే పదే చెప్పుకొనేవాడు. చివరకు ఇండియాలో అడుగుపెట్టిన తరువాత ఒక్కసారికూడా ఇంగ్లాండ్ వెళ్ళకుండానే ఇక్కడే చనిపోయాడు .
అతని సోదరి మేరీ మెకంజీ అక్కడే ఉండేది. తమ కుటుంబసభ్యుల కొరకు ఈమె 1823 లో అక్కడ ఒక సమాధి మందిరాన్ని కట్టించింది. మెకంజీ తల్లిదండ్రులు, మేరీ మెకంజీలు కూడా అక్కడే ఖననం చేయబడ్డారు. అక్కడ ఖననం చేయబడని కల్నల్ మెకంజీ సమాధిఫలకాన్ని కూడా మేరీ వేయించింది. దీన్ని నేటికీ అక్కడ చూడవచ్చును. ఆరుద్ర అక్కడకు వెళ్లి ఆ విశేషాలు సమగ్రాంధ్రసాహిత్యచరిత్ర లో పొందుపరచాడు.
మేరీ తన తమ్ముడిని 29 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు చూడటమే. మెకంజీ భారతదేశంలో ఏమి సేకరించాడో కళ్ళారా చూడలేదు. ఉత్తరాల ద్వారా, సన్నిహితులు చెప్పే విషయాల ద్వారా మాత్రమే ఆ అక్కాతమ్ముళ్ళ అనుబంధం కొనసాగింది. ఆ పరిమితజ్ఞానంతోనే ఆమె వేయించిన మెకంజీ జ్ఞాపికాఫలకంలోని “నాలుగు దశాబ్దాల పాటు భారతదేశంలో ప్రాచీన చరిత్ర, సాహిత్యం, పురావస్తువుల సేకరణలో- మానవ శ్రమకు, అన్వేషణకు మించి చేసిన విశేషకృషి వల్ల ఎంతో విలువైన అపార సంపద నేడు ప్రపంచానికి కానుకగా మిగిలి ఉన్నది” అనే వాక్యాలు మెకంజీ సార్ధకజీవనానికి అద్దంపడతాయి.
(కాలిన్ మెకంజీ కాలిన్ మెకంజీ ద్విశతవర్ధంతి సందర్భంగా సందర్భంగా - తూర్పుగోదావరి జిల్లా- మెకంజీ కైఫియ్యతులు పుస్తకంలోని వ్యాసం)

Friday, May 7, 2021
Imported post: Facebook Post: 2021-05-07T20:52:12
విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ చిన్నారులకొరకు చేసిన రచన "క్రిసెంట్ మూన్". దీన్ని 2011 లో అనువదించి నా బ్లాగులో పోస్ట్ చేశాను. కవితా వస్తువు చిన్నపిల్లలు వారి నిష్కల్మష ఆలోచనలు, ఆశ్చర్యాలు, కలలు నిండిన ఒక శుభ్రజ్యోత్స్న ప్రపంచం.
నిజానికి ఇలాంటి ఒక జానర్ నేడు కనుమరుగైపోవటం తెలుగు సాహిత్యం చేసుకొన్న దురదృష్టం. ఈ తరహా రచనలు ఎందుకు ప్రగతినిరోధకమో, ఎలా దోపిడీశక్తులకు దోహదపడతాయో నాకు ఎన్నటికీ అర్ధం కాని విషయం.
బొల్లోజు బాబా
***
ప్రారంభం
"నేనెక్కడి నుండి వచ్చాను?
నేను నీకు ఎక్కడ దొరికానూ?" పాపాయి అమ్మనడిగింది.
పాపాయిని గుండెలకదుముకొని
" నీవు నా హృదయంలో దాని వాంఛై ఉండినావు చిన్నారీ"
నవ్వుతూ, కనులనీరు నించుకుంటో అమ్మ బదులిచ్చింది.
నీవు నా బాల్యపు ఆటలలో బొమ్మవై ఉండే దానవు.
ప్రతి ఉదయమూ నా దేవుని ప్రతి రూపాన్ని మట్టితో చేసే దానిని.
అపుడే నిన్ను కూడా తయారు చేసి చేజార్చుకొనే దానిని.
మా కులదైవంతో సమానంగా నీకు కొలువుండేది.
ఆతని పూజలో నిను సేవించే దానిని.
నా అన్ని ఆశలలో, ప్రేమలలో, జీవితంలో, నా తల్లి జీవితంలో నీవు సంచరించావు.
మా ఇంటిని పాలించే అమృతమూర్తి ఒడిలో నీవు అనాదిగా సాకబడుతున్నావు.
కౌమార్యంలో నాహృదయం తన రేకలు విచ్చుకొన్నప్పుడు
నీవు దాని సుగంధానివై పరిమళించావు.
నీ సౌకుమార్యం నా యవ్వనాంగాలలో వేకువవెలుగులా వికసించింది.
స్వర్లోకపు ఆదిమ సఖి, ఉదయకాంతికి సహోదరివి అయిన నీవు
ఈ ప్రపంచ జీవన వాహినిపై తేలియాడ దిగివచ్చావు,
చివరకు నాహృదయానికి చిక్కావు.
నిన్నలా తేరిపార చూస్తే రహస్యమేదో ముంచెత్తుతుంది.
అందరకూ చెందిన నీవు నాకే సొంతమైనావు.
ఏ ఇంద్రజాలం నా దుర్భల చేతులలో
ఇంతటి భువనైక సౌందర్యాన్ని బంధించగలదు?
మూలం: రవీంద్రుని క్రిసెంట్ మూన్
అనువాదం: బొల్లోజు బాబా
మొత్తం అనువాదాన్ని ఈ క్రింది లింకులోనుండి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును.
https://archive.org/details/crescentmoontelugutranslationbaba

Wednesday, May 5, 2021
Imported post: Facebook Post: 2021-05-05T23:00:42
రక్తచుంబనం
దయలేని ఈ సాయింత్రం
కళ్ళల్లో
ఎండుటాకుల్నీ, తుమ్మముళ్ళనీ
ఎడారి తునకల్ని, తూనీగరెక్కల్ని
కుమ్మరిస్తోంది.
గరుకుకాగితంలాంటి తన నాలుకను
నోట్లో జొనిపి
గాఢంగా గొప్ప తమకంతో చుంబిస్తోంది
నోరంతా ఉప్పని రక్తం రుచి
సాయింత్రపు తీరంపై అలలు అలలుగా
ఒకే మృత్యుగీతం పదే పదే
ప్రతిధ్వనిస్తోంది
ఇంతమందిని
దాటుకొంటూ ముందుకు నడవటం
ఎవరి నీడల మధ్య వారే సంచరించటం
శిక్షే కావొచ్చు బహుశా ఎప్పటికీ!

Tuesday, May 4, 2021
Imported post: Facebook Post: 2021-05-04T09:19:21
Thank you Iqbal Chand gaaru
Bolloju baba
You can down load the book here
https://archive.org/details/bolloju-babu-moodo-kanneeti-full/page/1/mode/2up

Subscribe to:
Posts (Atom)