Tuesday, December 22, 2009

ఆకుపచ్చని తడిగీతం - పుస్తకావిష్కరణ



నేను ఇంతవరకూ రాసిన కవితలతో కూడిన సంకలనాన్ని “ఆకుపచ్చని తడిగీతం” పేరిట తీసుకురావటం జరిగింది.


ఈ పుస్తకావిష్కరణ 21-12-2009 న యానాం డిప్యూటీ కలక్టరు గారైన శ్రీ నామాడి అప్పారావు గారి చేతులమీదుగా జరిగింది.

ఇది నా రెండవ పుస్తకం. మొదటిది మా యానాంలో జరిగిన విమోచనోద్యమం గురించి.

ఈ కవితలను పుస్తకంగా తీసుకురమ్మని సూచించిన బ్లాగ్మిత్రులకు ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను. గత రెండు సంవత్సరాలుగా మీరందరూ ఇచ్చిన ప్రోత్సాహమే నన్నిలా ముందుకు నడిపించిందని భావిస్తున్నాను.

ఈ పుస్తకానికి మా గురువుగారు శిఖామణి గారు మరియు దాట్ల దేవదానం రాజుగారు పరిచయవాక్యాలు వ్రాసారు. అఫ్సర్ గారు, దార్ల వెంకటేశ్వరరావు గారు అట్ట వెనుక భాగంలో వేసిన ఆత్మీయ వాక్యాలు వ్రాసారు.

పుస్తకం దొరికు చోటు bollojubaba@gmail.com

హైదరాబాద్ లో జరుగుతున్న బుక్ ఫెస్టివల్ లో పాల పిట్ట పబ్లికేషన్స్ వారి స్టాలులో ఉంచమని కొన్ని కాపీలు పంపాను.

ఈ సభయొక్క పత్రికా క్లిప్పింగులు ఇక్కడ చూడవచ్చును

భవదీయుడు
బొల్లోజు బాబా

15 comments:

  1. బాబా:

    ఆవిష్కరణ వివరాలు ఇవ్వండి.
    చాలా కాలం తరవాత మా రాజు గారి దర్శనం అయ్యింది. ఆయనకి నా నమస్కారాలు చెప్పండి.

    అఫ్సర్

    ReplyDelete
  2. బాబాగారూ! అభినందనలు. మీ పుస్తకం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  3. ఏమిటి సార్ మాకెవ్వరికీ చెప్పకుండానే నిశ్శబ్ధంగా ఆవిష్కరించేసారు. యానాం గాలి, నీరు కొద్ది గంటలైనా రుచి చూసిన వాణ్ణే నేను. రాం వివాహానికి, పుస్తకావిష్కరణకు వచ్చాను. అక్కడే ఎండ్లూరి, సీతారాం, ఆశారాజు వంటి సీనియర్లను ప్రత్యక్షంగా కలిసాను. రాజుగారితో కూడా పరిచయమయ్యాను.
    మీ పుస్తకం పొందడం ఎలా?

    ReplyDelete
  4. అభినందనలు సార్. మీ పుస్తకం కొనే చదవాలని ఉంది :))
    అడ్రసు పంపుతాను మెయిల్లో. పుస్తకం పంపగలరు.

    ReplyDelete
  5. అఫ్సర్ గారికి
    సభ విశేషాలేమీ పెద్దగా లేవండీ. పుస్తకాన్ని యానంలోని నా మిత్రులకు కొంతమంది పెద్దలకు ఇవ్వటానికి వెళ్లాను. ఈనాడు విలేఖరి గా పనిచేస్తున్న ఫణి అనే నా బాల్యమిత్రుడు చేసిన హడావిడి ఇది. నేనూ ఊహించలేదు. శ్రీ నామాడి అప్పారావు గారు సాహిత్యాభిమాని, నాటక కళాకారుడు.(ఫొటోలో నాల్గవ వ్యక్తి). శ్రీ దాట్ల గారు యానానికి చెందిన కవి, విమర్శకుడు. (ఫొటోలో అయిదవ వ్యక్తి). వీరిరువురూ పుస్తకంపై మాట్లాడారు. ఈ కవర్ డిజైన్ చేసిన మిత్రుడు శ్రీ చిన్నారి (ఫొటోలో మొదటి వ్యక్తి). తనుకూడా కవి. అలా ఆ సాయింత్రం మిత్రులు మధ్య, సుమారు ఓ పదిమంది విలేఖరుల మధ్య సరదాగా గడిచింది అంతే.
    ప్రత్యేకమైన ఆవిష్కరణ సభల పట్ల నాకు నిరాశే ఎప్పుడూనూ. ఎందుకంటే ఇక్కడ చూస్తూంటాను. ఎంత పెద్ద వ్యక్తిని తీసుకొచ్చినా పట్టుమని పదిమంది ఆహూతులు కూడా రావటం లేదు.
    వాసు గారికి, వర్మ గారికి థాంక్యూలు. :-) . వర్మగారూ విన్నారు కదా కధ.

    పుస్తకం కావలసినవారు వారి చిరునామాను నా మెయిల్ కు తెలుప గలరు.
    my postal address is

    Bolloju baba, Lecturer
    A1 Flat, Bhanu buildings, Ramarao pet
    Kakinada, E.G District. 533401.

    భవదీయుడు.
    బొల్లోజు బాబా

    ReplyDelete
  6. బాబాగారూ! అభినందనలు. మీ పుస్తకం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను.
    గత సంవత్సరం మీ కవిత "ఆకుపచ్చని తడిగీతం" చదివి బ్లాగుల్లోని కవిత్వ సంకలనం చెయ్యాలనుకున్నాను, అంతగా నన్ను ప్రేరేపించింది.
    చాలా అంశాలువున్నాయి పంచుకోవడానికి

    ReplyDelete
  7. బాబాగారూ,
    అభినందనలు! పుస్తకం అందింది.నా యాహూ లో సమస్య ఉన్నందున బ్లాగ్ముఖంగానే తెలియజేస్తున్నాను. చదవడం మొదలుపెట్టాను కూడా! ఒక్కో కవితా ఒక్కో అద్భుతం! ఇంకేం చెప్పను? పుస్తకం పంపినందుకు ధన్యవాదాలు!

    ReplyDelete
  8. బాబా గారు,

    మంచి వార్త చెప్పారు...అభినందనలు!

    నా చిరునామా మెయిల్ చేస్తాను. పుస్తకం పంపగలరు.

    -- సుబ్రహ్మణ్యం.

    ReplyDelete
  9. చాలా సంతోషం బాబాగారు. ఇట్లాంటి విశేషాలు కాస్త ముందు చెప్పుకుని నలుగురితో పంచుకోవాలి. పోన్లెండీ ఇప్పుడైనా చెప్పారు.
    అభినందనలు. టైటిలు చాలా బావుంది

    ReplyDelete
  10. సంతోషకరమైన వార్త చెప్పారు.. హృదయపూర్వక అభినందనలు బాబాగారు.. సంకలనం పేరు చాలా బావుంది! :-)

    ReplyDelete
  11. బాబా గారు..
    మంచి టైటిల్ తో పుస్తకం వెలువరించి నందుకు అభినందనలు..
    తడి లేని జీవితాల దప్పిక తీరుస్తుందని ఆశిస్తాను..
    శుభాకాంక్షలు ..
    పెరుగు.రామకృష్ణ నెల్లూరు

    ReplyDelete
  12. అభినందనలు బాబా గారు... త్వరలో మీ పుస్తకం చదవాలని ఉంది... Cover page looks good. (Recently, i went thru Yanam and Kakinada. I thought about you but i have no contact info, i will try to reach you in my next visit)

    ReplyDelete
  13. బాబాగారూ! అభినందనలు.

    ReplyDelete
  14. బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు,
    http://bhadrasimha.blogspot.com/
    ధన్యవాదములు
    - భద్రసింహ

    ReplyDelete