Friday, December 18, 2009

నిన్ను కప్పే కాంతి - పాబ్లో నెరుడా

నిన్ను కప్పే కాంతి

కాంతి తన మృత్యు జ్వాలతో నిన్ను పెనవేసుకొంటుంది.
నీ చుట్టూ తిరుగుతూ నిన్ను ముందుకు గెంటే
అనాది సంధ్యలకు ఎదుట
పరధ్యాన దు:ఖితుని వలె నిలచినావు.


గతించిన ఘడియ ఏకాంతంలో
జీవ జ్వాలలు నింపుకొని,
శిధిల దినపు నిజమైన వారసునిగా
మాటల్లేక మిగిలిపోయావా మిత్రమా.

నీ చీకటి దుస్తులపై ఫలమేదో సూర్యునినుండి రాలిపడింది.
రాత్రి వేళ్లు, అకస్మాత్తుగా నీ ఆత్మలోంచి మొలచుకొచ్చాయి.
నీలో దాగున్నవన్నీ మరలా బయటకు వచ్చేస్తున్నాయి.

ఒహ్! ఘనమైన, ఫలవంతమైన, ఆకర్షణీయమైన
చీకటి వెలుగులలో తిరుగాడుతూండే ఈ వలయం
పెంచి, నడిపించే ఈసృష్టి విషాదంతో నిండి ఉంది,
దాని పువ్వులు వాడిపోతూంటాయి


The Light Wraps You

The light wraps you in its mortal flame.
Abstracted pale mourner, standing that way
against the old propellers of twilight
that revolves around you.

Speechless, my friend,
alone in the loneliness of this hour of the dead
and filled with lives of fire,
and pure heir of the ruined day.

A bough of fruit falls from the sun on your dark garment.
The great roots of night
grow suddenly from your soul,
and the things that hide in you come out again
so that a blue and pallid people,
your newly born, takes nourishment.

Oh magnificent and fecund and magnetic slave
of the circle that moves in turn through black and gold:
rise, lead and possess a creation
so rich in life that its flowers perish
and it is full of sadness.
2.

No comments:

Post a Comment