Wednesday, December 2, 2009

ఆట వస్తువులు

(విశ్వకవి రవీంద్రనాధ్ టాగోర్ రచించిన క్రిసెంట్ మూన్ లోని “ప్లే థింగ్స్” అనే కవితకు స్వేచ్చానువాదం.)

బాలకా
ఉదయం నుంచీ ఆ ఇసుకలో కూర్చొని
విరిగిన ఆ పుల్లతోఆడుకొంటూ ఎంత
ఆనందంగా ఉన్నావూ!

ఆ సన్నని విరిగిన పుల్లముక్కతో నీ ఆటను
చూసి నేను నవ్వు కొంటాను.
గంటలతరబడి అంకెల్ని కూడుకొంటో
నేను నా పద్దులతో తీరిక లేకుండా ఉంటాను.

బహుసా నీవూ నా వైపు చూసి
“ఈ శుభోదయాన్ని నాశనం చేసే ఎంతటి
మూర్ఖపు ఆట అది” అని అనుకోవచ్చు.

చిన్నారీ
పుల్లముక్కలు, మట్టి ముద్దలలో లీనమయ్యే కళ
నేనేనాడో మరచిపోయాను.
ఖరీదైన వస్తువులు, వెండి బంగారు ముద్దలపైనే నా దృష్టి.

దొరికిన దానితో నీ ఉల్లాసకేళులను సృష్టించుకోగలవు.
నేనేమో నేనేనాటికీ పొందలేని విషయాలపట్లే
శక్తినీ, కాలాన్ని వెచ్చిస్తూంటాను.

నా ఈ దుర్భల నావతో కోర్కెల సంద్రాన్ని
దాటటానికై పోరాడుతూంటాను,
నేనూ ఓ ఆటాడుతున్నానన్న విషయాన్ని విస్మరించి.

బొల్లోజు బాబా

9 comments:

  1. మీ అనువాదం హత్తుకుంది...

    ReplyDelete
  2. బాబాగారూ...వెలుగుకోసం వేదనని దాచుకున్న రాత్రిలా ఉంది ఈ అనువాదం. ప్రశాంతిని బెదరగొట్టే తుఫాను ప్రశాంతిలోనే అంతమవుతుందిట. :)

    అయినా ఇది చదువుతుంటే అక్కడెక్కడో, అప్పుడెప్పుడో ఎందులోనో చదివింది గుర్తుకొచ్చింది.

    "నీవు"గా పిలువబడే వ్యక్తి ఒక చీకటి కోణంలో మగ్గుతూ విలపిస్తున్నాడు. ఆ చీకటిని దాటుకుని రావాలని ఒక గోడను కట్టే ప్రయత్నంలో ఎంతో తపిస్తున్నాడు. అలా మొదలైన గోడ నిర్మాణంలోనే ఆయన కాలం గడిచిపోతోంది. ఆ గోడ కడుతూ కడుతూ కడుతూనే ఉండటం వల్ల పెరిగీ, పెరిగీ, పెరిగీ ఆకసమంత ఎత్తుకు పోతోంది. అలా పోయిన కొద్దీ "నీవు" లోని వ్యక్తి ఆ గోడ చీకటిలో దాగి ఇతరులకు కనపడకుండా పోతున్నాడు. ఆ గోడకు చిల్లులు లేకుండా సున్నాలు పూసి ఆ "నీవు"ను బయటకు తెచ్చే ప్రయత్నం సాగించాలా వద్దా అనేది ఆ ప్రసంగంలోని ప్రశ్న !!

    దానికి సమాధానం ఇంతవరకూ తెలియలా నాకైతే - కానీ ఒక్కోసారి అనిపిస్తుంది - ఆ చిల్లులు, సున్నాలని పక్కనబెట్టి గోడను కూలగొట్టి ఆ వ్యక్తిని సమాధి చేసేస్తే పీడా పోతుందని, కానీ ఇంతవరకూ అంతుపట్టలా ఎలా చెయ్యాలనేది.....మరింత కోపం వచ్చేస్తుంది, ద్వేషంతో గోడలు కట్టుకుంటున్న కుల మత వర్గ కాముకులని చూస్తూ ఉంటే - ఏరీ ఎక్కడ ఉన్నారు అని అంటే - మన చుట్టూనే అనో చిన్న సమాధానం చప్పున చెప్పెయ్యొచ్చు, సందులో సందుగా బ్లాగ్లోకంలో కూడ అని అనెయ్యచ్చండోయి..:)

    ఏదైనా ఆ ప్రసంగ ప్రశ్నకు ఇప్పుడు మీ అనువాదం ఒక దారి చూపిస్తోందేమో అని అనిపిస్తోంది.

    తీరిగ్గా తర్వాత !

    వంశీ

    ReplyDelete
  3. అనువాదం అంతా ఒక ఎత్తు, ఇదొక్కటీ మరింత ఎత్తు

    "నా ఈ దుర్భల నావతో కోర్కెల సంద్రాన్ని
    దాటటానికై పోరాడుతూంటాను"

    మీకు పోటీ ఎవరు కనుక.

    ReplyDelete
  4. మీ కవితల గురించి చెప్పాల్సిందేమీ లేదు. అయితే, కవిత చదివిన తర్వాత శీర్షిక ఊహించే ప్రయత్నం చేస్తే, నాకు "బుడిగీలు" అనే మాట గుర్తొచ్చింది. "బుడిగీలు" అంటే, మాండలికంలో పిల్లల ఆటసామానులు అని మీకు తెలుసుండాలి.

    ఇది విమర్శ, సూచనా కాదు, కవితను నా ఊహతో కలిపి ఆనందించే ప్రయత్నం.

    ReplyDelete
  5. మీ స్వేచ్చానువాదం చాలా బావుంది

    ReplyDelete
  6. రవి గారి మాట ననుసరించి మా కజిన్ ముద్దు పేరు బుడిగి. దాన్ని బుడాపెస్ట్ అని కూడా పిలిచేవాళ్ళం. అంతేకాకా "బుడిగి బుడిగీ నిన్నె నిన్నే చూడు బుల్లెమ్మా మాటాడు చిన్నమ్మా" అని కూడా ఏదిపించేవాళ్ళం.

    బాబా గారు మళ్ళీ రూటు మార్చేసానా? ;)

    ReplyDelete
  7. స్పందించిన అందరకూ ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.

    ReplyDelete