Monday, December 21, 2009

తొలి మల్లెలు

(రవీంద్రుని క్రిసెంట్ మూన్ లోని First Jasmines కు అనువాదం)

ఆహా ఈ మల్లెలు, ఈ తెల్లని మల్లెలు.
నా దోసిలి నిండా తెల్లని మల్లెల్ని నింపుకొన్న ఆ తొలి రోజు నాకింకా గుర్తుంది.

రవికిరణాల్ని, ఆకాశాన్ని, పచ్చని నేలని నేను ప్రేమించాను.
నడిరేయి చీకటిలో నదీ జలాల గుసగుసల్ని విన్నాను.

మైదానపు త్రోవ మలుపు వద్ద వసంత కాల సంద్యారాగాలు
ప్రియుని అంగీకరిస్తూ మేని ముసుగు తొలగించిన వధువలె
నన్ను చుట్టుముట్టాయి.

అయినప్పటికీ
నా బాల్యపు చేతిలో మొదటి సారిగా
నేనింపుకున్న తెల్లని మల్లెపూల జ్ఞాపకం ఇంకా తీయగానే ఉంది.

ఎన్నో సంతస దినాలు నా జీవితంలోకి వచ్చాయి.
పండుగ రాత్రులలో మిత్రులతో కూడి హసించాను.
ముసురుపట్టిన ఉదయాల్లో ఎన్నో వ్యర్ధ గీతాలు పాడుకున్నాను.
ప్రేమతో అల్లిన సాయింకాల సంపెంగ మాలలనెన్నో
నా మెడలో ధరించాను.

అయినప్పటికీ
నా బాల్యపు చేతిలో మొదటి సారిగా
నేనింపుకున్న తెల్లని మల్లెపూల జ్ఞాపకం ఇంకా తీయగానే ఉంది.


THE FIRST JASMINES


Ah, these jasmines, these white jasmines!

I seem to remember the first day when I filled my hands with
these jasmines, these white jasmines.

I have loved the sunlight, the sky and the green earth;

I have heard the liquid murmur of the river through the darkness
of midnight;

Autumn sunsets have come to me at the bend of a road in the
lonely waste, like a bride raising her veil to accept her lover.

Yet my memory is still sweet with the first white jasmines that I
held in my hand when I was a child.

Many a glad day has come in my life, and I have laughed with
merrymakers on festival nights.

On grey mornings of rain I have crooned many an idle song.

I have worn round my neck the evening wreath of bakulas
woven by the hand of love.

Yet my heart is sweet with the memory of the first fresh jasmines
that filled my hands when I was a child.


భవదీయుడు
బొల్లోజు బాబా

5 comments:

  1. బాబా గారూ. అనువాదం పుష్టిగా ఉంది.

    ReplyDelete
  2. బాబాగారు... థాంక్సండి. ఎమ్మెస్ నాయుడుగారి బ్లాగు మీ బ్లాగు ద్వారా పరిచయమైనందుకు.
    ===
    త్రోవ మలుపు వద్ద వసంత కాల సంద్యారాగాలు
    ప్రియుని అంగీకరిస్తూ మేని ముసుగు తొలగించిన వధువలె
    నన్ను చుట్టుముట్టాయి.
    ===
    ఈ లైనులు చాలా బాగా వచ్చాయండి.

    ReplyDelete
  3. చాలా బావుందండి. సాయికిరణ్ గారికి నచ్చిన లైన్సే నాకూ నచ్చాయి :-)

    ReplyDelete
  4. బాగుంది తొలి మల్లెల జ్నాపకం...

    ReplyDelete
  5. చాలా బావుందండి...

    ReplyDelete