Tuesday, July 21, 2009

ఆ క్షణం

కొన్ని దృశ్యాలకు

కళ్లు తమ కర్టెన్లను

మూసివేస్తాయి.

కొన్ని స్పర్శలకు

చర్మం జలదరిస్తూంటుంది.

కొన్ని వాసనల్ని

ముక్కు చీదరించుకొంటుంది.


బతికుండగా వేటినైతే

తప్పించుకోచూస్తామో

వాటిని కాటికాపరి

మట్టితో కప్పేస్తాడు.


జీవితం నిండా పూయించుకొన్న

ప్రేమలు, విజయాలు

ఆ క్షణాన కానరావు.


బొల్లోజు బాబా

3 comments:

  1. కానీ ఆ మూడు ఇంద్రియాలు చర్య తీసుకునేముందు మనసు స్పందిస్తుంది. ప్రేమ కనరాదు కానీ ఆ కాటి కాపరికీ ఓ మనసు వుంటుంది అది నిర్లిప్తతనో నిర్వేదాన్నో మట్టి కప్పిన మనసుకి చేరవేస్తుంది. మనిషిపోయినా ఆ తలపు మరి కొన్ని మనసుల్లో మిగిలేవుంటుంది. విజయాలు, ప్రేమలు పోయిన వారితో పోవు కానీ మిగిలిన వారి మనసున అమరం. ఎందుకో మీ కవితలోని చీకటి నాకు నచ్చలేదు అందుకే ఈ వెలుగు రవ్వలు చిమ్మాను. మరోలా అనుకోకండి బాబా గారు.

    ReplyDelete
  2. హ్మ్ చాలా "లోతు"లోకి తీసికెళ్ళారు.

    ReplyDelete
  3. బాబా గారూ చాలా బాగుంది. తెరలో రెప్పలో అంటే అంతా తెలుగయేదనిపించిందండీ..

    ఉష గారూ.. అన్నీకప్పేసుకున్నాక ఇంకా అక్కడ చీకటి ఎక్కడ కనపడిందండీ మీకు... నాకంతా వెలుతురే కనిపించింది... మరో సారి చూడండి

    మహేష్ గారూ...నిజమే... బ్రతికుండగానే... కదా.. !!?

    ReplyDelete