Sunday, April 27, 2008

కాలం

భవిష్యత్తంటూ ఏమీ ఉండదు
అనంతమైన అవకాశాలన్నీ
వర్తమానంలోకి కుప్పకూలుతాయి.

వర్తమానమూ ఒక భ్రమే ఎందుకంటే
దాన్ని చేరగానే గతంగా మారిపోతుంది కనుక.
గతం మాత్రమే నిజంగా నిజం
జ్ఞాపకాల మచ్చలు, జీవితాన్ని నిర్ధేశించే అనుభవాలు
కళ్ల వెనుక కదలాడే నులివెచ్చని దృశ్యాలు
కళ్లు మూసేదాక వెంటాడుతూంటాయి.

బొల్లోజు బాబా

7 comments:

  1. this poem is very good

    chandrika

    ReplyDelete
  2. కవిత చాలా బాగుంది. ఒకట్రెండు అచ్చు తప్పులు సరిదిద్దగలరు.

    ReplyDelete
  3. kavitha bagundi. kani print mistakes are many.

    ReplyDelete
  4. it is really very nice & goob

    ReplyDelete
  5. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను కొత్త కోణంలో నుంచి చూపారు, ఆలోచింప చేసే రచన.

    ReplyDelete