నువ్వు నన్ను ప్రేమించావు
కనుకనే ఇన్ని విజయ పుష్పాలను
నేను పూయించగలిగాను.
నీవు నా స్వప్నాలకు రెక్కలు తొడిగి ఉండకపోతే
నేనో బోంసాయ్ మొక్కగానే ఉండే వాడిని.
నువ్వు నన్ను విశ్వసిస్తున్నావన్న వాస్తవం నన్నీ
జీవన సంద్రంలో తేలుతూ ఉండేలా చేస్తుంది.
నీ జీవితంలోకి నన్ను లాగేసుకొన్నావన్న భావనే
ఈ జీవన రణ రంగంపై నన్నో
అజేయ గ్లాడియేటర్ ని చేస్తుంది.
నీ కాలంలో నా కలల ఉనికి
నా గడియారంలోంచి నిష్ఫల, నిష్క్రియా
నిముషాలను తరిమేస్తాది.
నీ ప్రతీ మాటనిండా సుమాలుంటాయి.
నా శరీరంపై నీడలా జీవించే నీ జ్జాపకాలు
ఘనీభవించిన ఓ సువాసన.
నాకు మరో దారి లేదు
నిన్ను తిరిగి ప్రేమించటంతప్ప.
బొల్లోజు బాబా
Tuesday, April 29, 2008
Subscribe to:
Post Comments (Atom)
కొసమెరుపు బాగుంది.
ReplyDeleteరాజారావు
"నీవు నా స్వప్నాలకు రెక్కలు తొడిగి ఉండకపోతే
ReplyDeleteనేనో బోంసాయ్ మొక్కగానే ఉండే వాడిని".
ఎంత బాగా చెప్పారండి.......
Really u r great sir.....