జీవితం రోజాలుగాను,
చాక్లెట్ ముద్దులుగానూ ఉంటే
ఈ ప్రపంచమెంత అద్భుతంగా ఉండేది!
ప్రతీఒక్కరూ నవ్వుతూ ఉండినట్లయితే
ఈ ప్రపంచం మనతో కలసి హసించదూ!
కానీ
జీవితం కఠినమైనది, రోజాలూ లేవూ, నవ్వులూ లేవు.
చాక్లెట్ల ముద్దులూ లేవు. భాధఒక్కటే సత్యం.
ఏ ప్రేమా ఎప్పటికీ స్వచ్చంగా సత్యమైనది కాదు.
నీకూ నాకూ ఒక సౌలభ్యం మాత్రమే!
కనుచూపుమేరలో అన్నీ యుద్దాలే, ద్వేషాలే!
ప్రేమలేదు, స్వాంతన లేదు.
జనులు మనచుట్టూ చనిపోతున్నారు.
నాకాలమింకా ముగియలేదు. దేముడే నిర్ణయించాలి.
నేనింకా బతికున్నాను ఎందుకంటే ఇంకా చావలేదు కనుక.
బొల్లోజు బాబా (డోన్నా నిమ్మో వ్రాసిన "లైఫ్ థ్రూ మై ఐస్ " అనే కవితకు అనువాదం)
No comments:
Post a Comment