Wednesday, August 13, 2008

సౌందర్యం


సెలయేటి ఎగువన ఎవరో
నీటిలో వెన్నెల బిందువుల్ని
కలిపారు.

సెలయేరు పొడవునా వెన్నెలే!

నీరుతాగాలని వంగితే
దోసిట్లో చందమామ.

బొల్లోజు బాబా

14 comments:

  1. బహు బాగు.
    మధ్య రెండు లైన్లు అనవసరం

    ReplyDelete
  2. కొత్త పాళీ గారి అభిప్రాయం కరక్టేనేమో ఒకసారి ఆలోచించడి గురూజీ. అన్నట్టు నేనుకూడా ఒక చిన్న కవిత రాసా మీకోసం ఎదురు చూస్తుంది అది.

    ReplyDelete
  3. వావ్.. జెన్ హైకూలా ఉంది

    ReplyDelete
  4. బాబా గారు, బాగుంది!

    ReplyDelete
  5. మంచి భావుకత.
    మాలతి

    ReplyDelete
  6. మంచి భావుకత.
    మాలతి

    ReplyDelete
  7. అదిరింది గురువుగారూ,వెన్నెల బిందువుల్ని కలిపింది నేనే..చందమామను మాత్రం తుంచలేదండోయ్!

    ReplyDelete
  8. కవిత బుల్లిదయినా నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.
    ఈ కవిత వెనుక చిన్న కధ ఉంది.
    ఇదివరలో " పుస్తకంలోకి నడవటమంటే,,,,,," అనే కవిత వ్రాసేటప్పుడు అందులోంచి తొలగించిన ఒక పదచిత్రం ఇది. ఎందుకో ఆకవితలో ఇది ఇమడటం లేదన్న భావనతో వాడలేదు.
    విడిగా కూడా బాగానే ఉందన్న అభిప్రాయంతో ఇలా పోష్టు చేసాను.
    స్పందిచిన, సుజాతగారికి, కొత్తపాళీగారికి, నిషిగంధగారికి, మురళి గారికి, నాగన్న గారికి, గిరీష్ గారికి, సుబ్రహ్మణ్యంగారికి, అనానిమస్ గారికి, తెతూలిక గారికి ధన్యవాదములు.
    మహేష్ గారూ, మీరా ఆపని చేసింది. శబాసో.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  9. కొత్తపాళీగారు
    మీ సలహా మేరకు మార్చేసాను. గమనించారా. థాంక్యూ.
    బొల్లోజుబాబా

    ReplyDelete
  10. చాలా బాగుంది....
    నాకెందుకో ఇది ("సెలయేరు పొడవునా వెన్నెలే!") కూడ అనవసరం అనిపించింది.

    ReplyDelete