Saturday, April 22, 2023

Kuruntokai 152



.
నన్ను లోకులు నిందిస్తారు కానీ
వారికేంతెలుసు?
తాబేలు పిల్ల గుడ్డునించి బయటకు రాగానే
తల్లిని చూస్తూ శక్తిని పొందినట్లుగా
నేనూ నా ప్రియుని చూస్తూ
జీవనేచ్ఛను పొందుతాను
అతను నాకు దూరమైన మరుక్షణం
నేనొక తల్లిలేని గుడ్డులా
కృశించి నశించిపోతాను
.
(Kuruntokai 152 - BCE రెండో శతాబ్దానికి చెందిన తమిళ కావ్యం)
అనువాదం: బొల్లోజు బాబా

2 comments:

  1. -

    పొందెద ననయమతని కెడ
    డెందంబారంగ నే కడిమిని జిలేబీ !
    నిందింపనేమి లోకులు
    బంధము నాదీ ప్రియునిది ప్రసువు శిశువుదౌ!


    జిలేబి కురున్ తొగై :)


    ReplyDelete
    Replies
    1. ప్రసువు అర్ధంకొరకు నిఘంటువు చూడవలసి వచ్చిందండీ..... గ్రేట్ ఇదే పద్యంపై మంచి చర్చ జరిగింది నా ఫేస్ బుక్ వాల్ పై. వీలైతే చూడండి ఇక్కడా

      https://www.facebook.com/bollojubaba/posts/pfbid0bpS79oXswe16nspRepHYmsCqcgmriRP9UiFN7mLLuymoAhBkp7MMitJevKyQep2vl

      Delete