మిత్రులారా,
జలాలుద్దీన్ రూమి వాక్యాల కోసం ఈ గ్రూపు సృష్టించబడింది. అంతర్జాలంలో అనేక రూమీ వాక్యాలు విహరిస్తూంటాయి. వాటిని తెలుగులోకి అనువదించి ఒకచోటికి తీసుకొని వస్తే బాగుంటుందన్నది ఈ గ్రూపు ఉద్దేశం.
కొన్ని వాక్యాలు.....
నీ పని ప్రేమను అన్వేషించటం కాదు- దానికి వ్యతిరేకంగా నీలో నిర్మించుకొన్న అన్ని అడ్డంకులనూ వెతుక్కొని పట్టుకోవటం మాత్రమే. --రూమీ
దేన్నీ వ్యక్తిగతంగా తీసుకోకు. నీ గురించి ఇతరులు చెప్పేదంతా నీవు కాదు అది వారి ప్రతిబింబం మాత్రమే --రూమీ
ఇతరులకు ఏంజరిగిందో తెలిపే కథలతో తృప్తి చెందకు. నీ గాథను నీవే విప్పుకో –రూమీ
మంచి చేయటం చెడు చేయటం అనే ఆలోచనలకు దూరంగా ఒక మైదానం ఉంటుంది. అక్కడ నిన్ను నేను కలుస్తాను --రూమీ
పదాలను ఉచ్ఛరించని స్వరమొకటుంది. జాగ్రత్తగా విను --రూమీ
మరిన్ని "రూమీ వాక్యాల" కోసం లింకు ఇక్కడ.
https://www.facebook.com/groups/1286654614695032/
భవదీయుడు
బొల్లోజు బాబా
No comments:
Post a Comment