వెలుతురు
దుస్తులు తీసేసిన పగల్లాంటి
చిక్కని
చీకటి రాత్రి జ్ఞాపకం
ఏం
చూసావో నీకు గుర్తుండదు
ఇసుకపై
బజ్జున్న పసి పిల్లాడ్నో లేక
చెట్టుకొమ్మకు
వేలాడుతున్న పిడికెడు మట్టినో
కానీ
దాని జ్ఞాపకం మాత్రం
చీకటి
రాత్రిలా నీలో విచ్చుకొంటుంది.
లోహ
శబ్దాలు నిండిన మెలకువ
నిశ్శబ్దంగా
పరచుకొంటుంది నీ చుట్టూ.
చరిత్ర
నదిలో వెచ్చని కన్నీరు
ప్రవహించే
సందర్భమది.
బొల్లోజు బాబా
No comments:
Post a Comment