Saturday, April 18, 2009

ఫ్రాగ్మెంట్స్ 3

1.
ఇక ఇప్పుడు
సంభాషణ అంటే
సెల్ పోను డిస్ప్లేలో
నంబరుచూసుకొని
టాక్ బటను నొక్కడమే!

నాగరికతా
నరకాన్ని ప్రేమిస్తాను
కొలిమిలోకి ఒంటరిగా సాగనీ.
******


2.

రాత్రినుంచి వానచినుకులు
మంత్రాల్ని జపిస్తూ,
ఆకులతో వల్లె వేయిస్తూన్నాయి.

వానచినుకుల
చుంబనాలతో అలసిన
తడితడి పూలపెదవులపై
వేకువ వెండివెలుగై పరచుకుంది.

*****


3
నీ నిష్క్రమణ
తరువాత రోజులన్నీ
ఒకేలా ఉన్నాయి.

మరోసారి
ఏడవటం తప్ప
మరేం చేయగలను చిన్నమ్మా!

*****


4
అలంకరణ అద్దం
ఆమె అందాన్నంతా
తిరిగిచ్చేసింది.


బొల్లోజు బాబా

6 comments:

  1. బాబా గారూ చాలా బాగున్నాయి.

    ౧. దానికీ మీటలొచ్చేశాయిప్పుడు. స్వర్గద్వారాలకీ రెమోటులేమో !!
    ౨. కవిగారి కళ్ళు తళుక్కుమన్నట్టున్నాయి
    ౩. నిజమె బాబాగారు.. ఎంత పొగిలినా అవెలితి నిండదు.
    ౪. అవును నిజంగానే.. ఇప్పుడే చూశా.. దాంట్లో ఏమీ లేదు. తెల్లగడ్డి పెరిగిన రన్వే (runway) తప్ప :-)

    ReplyDelete
  2. బావుంది బాబాగారు. 4 కొత్తగా ఉంది. కొలిమి అంటే స్వర్గమా??

    ReplyDelete
  3. బాబా గారూ చాలా బాగున్నాయి.
    1. ఇంటి ఫోను బిల్లు తక్కువ చెసింది. అసలా నంబరు గుర్తుపెట్టుకునే అవసరమేపోయింది. మామంచి సెల్లు నా మతిమరపుకి మంచి మందిచ్చింది.

    2. ఇపుడా పూల పెదాలీ ఉదయాన మరి గాలి బాలుడుకి అధరామృతాలు పంచుతున్నాయి ;) ఎంత జాణలో..

    3. అసలు రోజులొచ్చిపోతున్నాయనే తెలియని మనసుకి ఒకేలా వున్నాయో లేదో పడతదా..

    4. పగిలిన అద్దంలో ముక్కకొక రూపంగా ఆ అందం ఇపుడు వికృతంగా వుందేమో..

    ReplyDelete
  4. బాబాగారు...బాగారాసారు అంటే బాగుండదు!!
    ఇంకా గొప్పగా వ్రాద్దామంటే నాకు భాషరాదు!!

    ReplyDelete
  5. మీరు మీ బ్లాగులో తెలుగు - తెలుగు / ఆంగ్ల నిఘంటువు కి ఒక లంకె ని తగిలించాలి..:)


    బాబా గారు, ఖదీర్ బాబు కధ
    lఒక వంతు ని చదివి మీ అభిప్రాయం చెప్పండి.

    ReplyDelete
  6. Baba garu, This is perhaps a wrong place to put this comment. Yet, as and when your spare time permits, can you please share your views at: http://maruvam.blogspot.com/2009/04/blog-post_16.html#comments

    I appreciate it a lot! I am open for any constructive criticism though Maruvam is all about my poetic passion. Thanks in advance.

    ReplyDelete