Tuesday, July 29, 2008

ఒకే ఒక ఆశ చాలు.......

వనంలో కార్చిచ్చు కదిలింది
అగ్నికీలలు వేన వేల నాలుకలతో
ఊగిపోతున్నాయి.

చెట్ల ఆకులు, పూవులూ,
వసివాడని మొగ్గలూ
మసివాడి పోయాయి.
పక్షులు ప్రశాంత తీరాలకై
ఎగిరిపోయాయి.
వేడిని తాళలేక
పులుగూ పుట్రా పరుగులెట్టాయ్.

అరణ్యం అగ్నిదుప్పటి
కప్పుకున్నట్టుంది.
నేలపై బూడిద ఎండలా
పరచుకొంది.

పచ్చని దృశ్య విధ్వంసం పూర్తయింది.
************

మనసుకు ఒక
అపజయం గుచ్చుకుంది.

వేన వేల నిరాశానీడలు
కదలాడుతున్నాయి.
స్వప్నాలూ, సౌరభాలు
మసివాడిపోయాయి.
సుఖ సంతోషాలు
విలాస విలాసాలకై ఎగిరిపోయాయి.
నిస్పృహా బూడిద
హృదంతా పరచుకొంది.

వెచ్చని దృశ్యం భళ్లున బద్దలయింది.
***********
ఆ మరునాడు
వనంలో మిగిలిన
ఒకే ఒక విత్తనం పగిలింది
పున:సృష్టి జరపడానికై.

ఆ మరునాడు
మదిలో జనించిన
ఒకే ఒక ఆశ రగిలింది
పునరుజ్జీవనం ఇవ్వటానికై.

బొల్లోజు బాబా

11 comments:

  1. దృశ్యవిధ్వంశం--విధ్వంసం
    అరణ్యం అగ్నిదుప్పటి
    కప్పుకున్నట్టుంది.---చాలా బాగుంది

    ReplyDelete
  2. "అరణ్యం అగ్నిదుప్పటి
    కప్పుకున్నట్టుంది."

    బాగుంది

    ReplyDelete
  3. "అగ్నికీలలు వేన వేల నాలుకలతో
    ఊగిపోతున్నాయి."
    "నేలపై బూడిద ఎండలా
    పరచుకొంది."
    నాకు కొత్తగా భలే ఉన్నాయి...

    "సుఖ సంతోషాలు
    విలాస విలాసాలకై ఎగిరిపోయాయి." ఇది అర్ధం కాలేదు... ఏదైనా అచ్చు తప్పు ఉందేమో అనిపించింది...

    రెండిటి పోలికా అద్భుతంగా ఉంది...

    ReplyDelete
  4. నరసింహ గారికి
    ధన్యవాదములు
    రాజేంద్ర గారికి
    సరిచేసాను. సూచనకు కృతజ్ఞతలు.
    మురళి గారు
    కృతజ్ఞతలు
    దిలీప్ గారికి
    ఈ కవిత కొంచెం ఎక్స్పెరిమెంటల్ గా వ్రాసింది. రెండు విడివిడి కవితలుగాకూడా లాగించేయచ్చు. కానీ వైవిధ్యం కోసం రెంటినీ కలిపి ఒక పోలిక తీసుకొని వచ్చి (అందుకోసం కవితలోని కొన్ని పదచిత్రాలను రిపీట్ చెయ్యవలసి వచ్చింది) వ్రాయటం జరిగింది.

    ఈ ప్రయోగం మీకు నచ్చినందుకు చాలా ఆనందం గా ఉంది.

    ఇక విలాసవిలాసాలు అంటే విలాసాల చిరునామాలని నా ఉద్దేశ్యం.
    ఈ సంధి కరక్టా కాదా అనే విషయం పెద్దలెవరైనా చెపితే కరక్ట్ చేసుకోగల వాడను.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  5. చాలా బాగుంది.
    I think HOPE is the only imperishable attribute that a man owns until he dies.Even a dying destitute hopes and hopes for ever.
    ఆశ మనిషికి ఊపిరి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనిషికి, మనసుకి జీవం పోసేది ఆశ అని చాలా చక్కగా చెప్పారు.

    ReplyDelete
  6. ప్రకృతి,మనిషిలోని destruction...reconstruction...and recreation ను చాలా బాగా బంధించారు.సృష్టి రహస్యాల్ని ఇంత సింపుల్గా బంధించడం కష్టమే! మీరు అర్జంటుగా మాలాంటి వాళ్ళకు తెలుగు రాయడం నేర్పించాలి.

    ReplyDelete
  7. చాలా బాగుంది బాబా గారూ

    ReplyDelete
  8. aasa manishiki uupiri. poem chala bagundi..bhavani

    ReplyDelete
  9. మహేష్ గారికి చాలా సింపుల్ గా చెప్పారండీ. థాంక్యూ
    మోహన గారు శ్రవణ్ కుమార్ గారు, మీకు నచ్చినందుకు ధన్యవాదములు.
    దేవి గారికి థాంక్సండీ

    బొల్లోజు బాబా

    ReplyDelete