Monday, July 21, 2008
నిరీక్షణ
అమలిన చింతనో లేక
అలౌకికానందమో తెలీదుకానీ
ఆత్మరహిత దేహాన్ని
నిరీక్షణలు, నిరీక్షణలుగా
శిల్పీకరించుకోవటంలో
ఎంతానందముందనుకున్నావ్!
కొమ్మను తాకగానే పాటను
స్రవించిన కోయిలలా
చెమ్మను తాకగానే దళాల్ని
ప్రసవించిన విత్తనంలా ......
అత్యంత ప్రకృతిసహజంగా
నా ఈ నిరీక్షణా శిల్పాల మద్య
రెమ్మకూ రెమ్మకూ మద్య తిరుగాడే తుమ్మెదల్లా
నీ జ్జాపకాలు తిరుగాడుతూంటాయి.
బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
బాబా గారు,
ReplyDeleteమీ బ్లాగ్ కూడలిలో చూడగానే ఎంత ఆత్రంగా link open చేసానో. కాని చదివిన తర్వాత ఎందుకో మరి ఏదో miss అయినట్లనిపించింది. అది ఏమిటో చెప్పలేను. దయ చేసి అన్యధా భావించకండి.
ప్రతాప్ గారు
ReplyDeleteసారీ టు డిసప్పాయింట్ యు.
కామెంటు చెయ్యటం ద్వారా నన్ను నేను మెరుగుపరచుకొనే అవకాసం ఇచ్చారు. ధన్యవాదాలు.
ఇక పోతే కవిత గురించి. కాకి పిల్ల కాకికి ముద్దే కదు సారూ.
బొల్లోజు బాబా
బాబా గారు,
ReplyDeleteఅత్యద్భుతం అని అనలేను కాని, అద్భుతం అని అనగలను.
నాకు కొన్ని బుల్లి బుల్లి doubts ఉన్నాయి. మిమ్మల్ని ప్రశ్నించేంత గొప్పదాన్ని కాదనుకోండి, కానీ
ఈ జీవికి సందేహాలు రావడంలో తప్పు లేదుగా?
దేహం ఆత్మ రహితం అయినచో దాన్ని నిరీక్షణలు గా ఎలా మలచుకోవడం?
విత్తనం మొలకెత్తగానే ఆకులు వస్తాయా? ఏవో కొన్నింటికి వస్తాయి అని చెప్పి తప్పించుకోకండి :-)
తుమ్మెదలు పువ్వు, పువ్వుకి మధ్య తిరగాడుతాయి కదా? అంటే ఒకే రెమ్మకి 2 అంతకన్నా ఎక్కువ పువ్వులుంటే తుమ్మెదలు వాటిలో ఏదో ఒక పువ్వులొని మకరందాన్నే గ్రోలుతాయా? ఇంకో పువ్వు జోలికి వెళ్ళవా?
@ప్రతాప్ అర్ధం కాని శేషప్రశ్నలుండబట్టే ఇది నీకు నిరాశని మిగిల్చిందేమో?
This comment has been removed by the author.
ReplyDeleteబాగుందండి చర్చ!ఒకమైనరు మార్మిక కవితలాగా,ఒక ఆబ్స్ట్రాక్ట్ చిత్రం లాగా రూపుదిద్దుకోవాల్సిన పదబంధాలను బోటనీ క్లాసుగా మార్చారు అందరూ కలసి!!మరి కాస్త హ్యూమన్ అనాటమీ కూడా జోడించారు.
ReplyDeleteకల గారూ
ReplyDeleteముందుగా మీకు థాంక్స్.
నేనేమీ గొప్పవాడిని కాదు,
మీబ్లాగు చూసాను మీరేమీ సామాన్యులు కాదు.
ఈ కవితను చాలా రోజుల క్రితం వ్రాసినది.
ఈ కవితలోని అస్ఫష్టత ని బాగానే పట్టుకున్నారు.
ప్రతాప్ గారు చెప్పలేక పోయినది మీరు చాలా స్పష్టంగా చెప్పారు.
నిజమె. ఈ కవిత చాలా అస్ఫష్టం గానె ఉంది. పొంతన లేదు. అది నాకు మొదట్లో అనిపించకపోయినా ఇప్పుడు అర్ధం అవుతూనే ఉంది.
ఇక నా భావన ఏమిటంటే
ప్రియురాలి ఎడబాటువలన దేహం ఆత్మరహితమైనది అని నా భావన.
ప్రియురాలికోసమై నిరీక్షణ.
ఆ నిరీక్షణలో కూడా ఆనందం. (విరహంకూడా సుఖమే కాదా రీతిలో)
అటువంటి నా నిరీక్షణ అనే శిల్పాల మద్య నీజ్ఞాపకాలు తుమ్మెదల్లా తిరుగాడుతున్నాయ్.
అలా తిరగడం కూడా చాలా సహజమనీ, ఎంతసహజమంటే వసంతంలో కోయిలపాటంత, విత్తనం మొలకెత్తినప్పుడు వచ్చే చిరు ఆకులంత అని.
విత్తనాలనుండి మొదట సన్నని కాండం దానికిరువైపులా ఆకులు (చిన్నవి)
ఉంటాయనే అనుకుంటున్నాను. చిక్కుడు మొక్క మొలకెత్తటం గమనించండి.
బహుసా ఈ కవిత ఈ విధంగా ఉంటే కొంచెం క్లారిటీ ఉంటుందేమో!
ప్రియా
అమలిన చింతనో లేక
అలౌకికానందమో తెలీదుకానీ
నీ వియోగంతో ఆత్మరహితమైన
ఈ దేహాన్ని
నిరీక్షణలు, నిరీక్షణలుగా
శిల్పీకరించుకోవటంలో
ఎంతానందముందనుకున్నావ్!
కొమ్మను తాకగానే పాటను
స్రవించిన కోయిలలా
చెమ్మను తాకగానే దళాల్ని
ప్రసవించిన విత్తనంలా ......
అత్యంత ప్రకృతిసహజంగా
నా ఈ నిరీక్షణా శిల్పాల మద్య
తుమ్మెదల్లా
నీ జ్జాపకాలు తిరుగాడుతూంటాయి.
ఈ కవితలో కవి ఉద్దేశిస్తున్నది ప్రియురాలేకాకపోవచ్చు.
కామెంట్లకు నేచెప్పేధన్యవాదాలు చాలా చాలా పొడుగ్గా ఉంటాయని ఓమిత్రుడు కామెంట్ చేసాడు. ఈ కవిత మినహాయింపు అనుకున్నాను. కానీ మీ కామెంటు ద్వారా పొడుగు కామెంటు వ్రాసే అవకాసం నాకిచ్చారు.
నేను ముందుగా చెప్పినట్లు గా నన్ను నేను రిఫైను చేసుకోవటంలో మీ అందరి సహకారాన్ని మరువలేను. మీ లాజిక్ చాలా బాగుంది. మీ అభిప్రాయం తెలియచేసినట్లయితే సంతోషించగలవాడను.
ధన్యవాదములతో
బొల్లోజు బాబా
"కొమ్మను తాకగానే పాటను
ReplyDeleteస్రవించిన కోయిలలా
చెమ్మను తాకగానే దళాల్ని
ప్రసవించిన విత్తనంలా ......"
ఆహా... అనిపించింది... ఇంక మాటల్లేవ్...
baba mee kavithalanni simply superb. babalo o kavi dagunnadani naakinthathavaraku thelidu.meenunchi marinni kavithalu ashisthu
ReplyDeletebhagavan