Monday, November 30, 2020
Imported post: Facebook Post: 2020-11-30T01:57:11
ఒక పుస్తకాన్ని వెలువరించటానికి ఎతనయో వెలివేషంగళ్
ఆవిష్కరణ సభ, ఫ్లెక్స్ లు, వక్తల ప్రసంగాలు, శాలువాలు, ప్రెస్ కవరేజ్ వాటిఫొటోలు, వీడియోలు మరలా సోషల్ మీడియాలో షేర్ చేయటం, పుస్తకం పలానా 9866115655 నంబరులో లభిస్తుంది సంప్రదించండీ అంటూ ప్రకటనలు ..... ఎల్లాం వెలివేషం....
***
మరి ఇంట్లో ఏంజరుగుతుంది? కొన్ని విషయాలు వీళ్లకే తెలుస్తాయి
వేళకాని వేళల్లో ఎన్నెన్ని టీలు కాఫీలు....
ఏదో అర్ధరాత్రిపూట మేల్కొని నా గదిలో లైటు ఫాను కట్టేసి రెక్కపట్టుకొని లాక్కొని పోవటం...
ఏ రామకృష్ణతోనో, శివకామేశ్వరరావు గారితోనో గంటలతరబడి
ఫోన్ చర్చలు...
మీరు వెళ్ళి వచ్చేయండి.... నాక్కొంచెం పని ఉంది అంటూ నే చేసిన అభ్యర్ధనలూ....
ఇవన్నీ వీళ్లకే తెలుస్తాయి... బయట వాళ్లకేం తెలుస్తాయి.... అక్కడ నేను కట్టే వేషం వేరు కదా!
***
కరోనా కాలం కదా సభ జరుపుకొనే అవకాశం ఉండకపోవచ్చు అంటూ పుస్తకాలు ప్రెస్ నుంచి వచ్చిన రోజే ఇంట్లో మా పిల్లలు ఆవిష్కరణ సభ ఏర్పాటు చేసేసారు. మా ఆవిడ ఆవిష్కర్త... ఒక శాలువా, రచయితగా నాకు మూడు శాలువాలు....ముగ్గురినుంచీ...
ఉపన్యాసాలేమీ లేవు.... ఉత్త ప్రేమ, కొన్ని ఘనీభవించిన క్షణాలు తప్ప
బొల్లోజు బాబా
Friday, November 27, 2020
Imported post: Facebook Post: 2020-11-27T15:18:21
ప్రెస్ కవరేజ్ - తాంక్యూ పాత్రికేయ మిత్రులారా
పుస్తకం కొరకు 9866115655 లో పల్లవి పబ్లికేషన్స్ వారిని సంప్రదించగలరు.
బొల్లోజు బాబా
Wednesday, November 25, 2020
Tuesday, November 24, 2020
Imported post: Facebook Post: 2020-11-24T14:05:48
తాంక్యూ డాక్టరు గారు
For your kind gesture
కృష్ణా జిల్లా కైఫీయ్యతులు ఇప్పటికే పుస్తకం గా వచ్చాయండి.
Baba
Monday, November 23, 2020
Imported post: Facebook Post: 2020-11-23T10:57:11
Using sentences,incidents,descriptions of other contemporary writer or even paraphrasing them to create another work comes under ipr act. Whether it is for monitory or not.
Present incident is not an act of Citing the original work. It is violation of intellectual property rights.
One can create another story from a different point of view of the original, without using names of characters, same incidents, same descriptions, sentences..... It will be perfectly ok
To do so one should have tons of creativity. DUMB HEADS should not try 😎
Sunday, November 22, 2020
Imported post: Facebook Post: 2020-11-22T17:06:39
మిత్రులారా
ఈ రోజు జరగనున్న పుస్తకావిష్కరణ సభ లైవ్ నా వాల్ పై ఉండబోతున్నది.
Saturday, November 21, 2020
Imported post: Facebook Post: 2020-11-21T16:15:54
మేకంజీ కైఫీయ్యతులు-తూర్పుగోదావరి పుస్తక ఆవిష్కరణ విజయవాడలో 22 నవంబరున పల్లవి ప్రచురణల ఆధ్వర్యంలో జరగనుంది.
ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల కారణం గా నేను రాలేక పోతున్నాను.
ఈ సభలో పుస్తకంపై మాట్లాడనున్న డా.కె బాలకృష్ణ గారికి, డా.మొవ్వ శ్రీనివాస రెడ్డి గారికి నమస్కారములు, ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను
బొల్లోజు బాబా
Friday, November 20, 2020
Imported post: Facebook Post: 2020-11-20T23:55:40
“ఏ మాటర్ ఆఫ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్” – సారంగ
కొన్ని ప్రశ్నలు
ఇవి సారంగ నిర్వాహకులకు
1. ఒక రచయిత కథను, దానిపై అతని కాపీ రైటు హక్కులు ముగిసిపోకముందే, అతని అనుమతి లేకుండా రీరైట్ చేసే హక్కు ఇతర రచయితలకు ఉంటుందా?
2. ఒక వేళ ఉన్నట్లయితే ... ఆ కథకు ఇంట్రో వాక్యాలలో ఒరిజినల్ రచయిత గౌరవానికి భంగం కలిగించే విధంగా దూషించవచ్చా?
3. పై రెండు ప్రశ్నలకు అవునని నమ్మితే - అలాంటి సందర్భాలను సాహిత్యచరిత్రలోంచి ఏమైనా ఉదాహరణలుగా చూపించగలరా?
4. పై మూడు ప్రశ్నలకు సమాధానం సారంగ వద్ద లేకపోతే.... సారంగ నిర్వాహకులు నైతిక నియమావళి తప్పినట్లుగా, ఇది సాహిత్యద్రోహంగా భావించవలసి వస్తుంది.
http://nerdwriter.blogspot.com/2010/07/is-rewriting-same-as-plagiarism-answer.html
బొల్లోజు బాబా
https://magazine.saarangabooks.com/%e0%b0%8f-%e0%b0%ae%e0%b0%be%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%86%e0%b0%ab%e0%b1%8d-%e0%b0%b2%e0%b0%be%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%86%e0%b0%ab%e0%b1%8d-%e0%b0%a1%e0%b0%bf%e0%b0%ab%e0%b0%b0/
Wednesday, November 18, 2020
Imported post: Facebook Post: 2020-11-18T20:17:34
మిత్రులకు విన్నపం
నేను ఇంతవరకూ ఏడు పుస్తకాలు వెలువరించాను - రెండు చరిత్రపై, మూడు కవిత్వసంపుటులు, ఒక అనువాదం, మరొకటి సాహిత్య వ్యాసాలు. ఇవన్నీ నేను సొంతంగా ప్రచురించుకొన్నవి.
నా ఎనిమిదవ పుస్తకం "మెకంజి కైఫియ్యతులు- తూర్పుగోదావరి జిల్లా". ఈ పుస్తకావిష్కరణ ఈ రోజు కాకినాడలో జరిగింది.
ఈ పుస్తకాన్ని పల్లవి పబ్లికేషన్స్, అధినేత Sri. Sv Narayana గారు ముద్రించారు. ఖరీదైన పేపరు, మంచి ప్రింటింగ్ క్వాలిటీ.
ఈ పుస్తకం విజయవాడ పుస్తక ప్రదర్శనలో పల్లవి స్టాల్ నందు లభిస్తుంది.
శ్రీ నారాయణ గారి ఫోన్ నంబరు: 98661 15655
ఫేస్ బుక్: https://www.facebook.com/sv.narayana.9400
.
మిత్రులారా...... దయచేసి...... ఈ పుస్తకాన్ని కొని చదవండి.
.
మీరు నేరుగా కొనటం కానీ, ఫోన్ ద్వారా సంప్రదించి తెప్పించుకోవటం కానీ చేస్తారని ఆశిస్తున్నాను.
***
ఈ రోజు పుస్తకావిష్కరణ సభా విశేషాలు ఇవి.
.
మెకంజీ కైఫియ్యతులు -తూర్పుగోదావరి జిల్లా పుస్తకావిష్కరణ
తూర్పుగోదావరిజిల్లా చరిత్ర-సంస్కృతి సామాజిక విషయాల అధ్యయన సంస్థ, కార్యదర్శి డా. పి.చిరంజీవిని కుమారి అధ్యక్షతలో జరిగిన సభలో ప్రముఖ కవి, చరిత్రకారుడు శ్రీ బొల్లోజు బాబా రచించిన "మెకంజీ కైఫియ్యతులు- తూర్పుగోదావరి జిల్లా" పుస్తక ఆవిష్కరణ జరిగింది.
ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన డా. పి. చిరంజీవిని కుమారి మాట్లాడుతూ "బ్రిటిష్ వారు భారతీయులకు చరిత్ర లేదు అనే అభిప్రాయాలను కలిగి ఉండేవారు, కానీ మన ప్రాచినులు దండకవిలెలలో అనూచానంగా మన చరిత్రను లిఖించుకొంటూ వచ్చేవారు. వాటిని బ్రిటిష్ అధికారి కాలిన్ మెకంజీ సేకరించి కైఫియ్యతుల పేరుతో భద్రపరిచాడు. ఈ కైఫియ్యతుల అధ్యయనంలో ఒక ప్రాంతపు ప్రజలు తమచరిత్రను ఏ విధంగా సృష్టించుకొన్నారు అనేది తెలుస్తుందని, ఏ దేశ చరిత్ర అయినా ఆ దేశంలోని ప్రాంతాలు, గ్రామాలు, వాడలలో జనం ఎలా జీవించారు, ఏ విధంగా పాలించబడ్డారు, మరి ఏ విధంగా మలుపు తీసుకుంటూ వచ్చారు అనేది వెలికితీయటం చరిత్రకారుల విధి - ఆ విధంగా రెండువందల ఏండ్ల క్రితం బ్రిటిష్ అధికారి కొలిన్ మెకంజీ సేకరించిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన స్థానికచరిత్రల కైఫియ్యతులను శ్రీ బొల్లోజు బాబా పుస్తకరూపంలోకి తీసుకురావటం అభినందనీయమని" అన్నారు.
సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గనరా మాట్లాడుతూ "తూర్పుగోదావరి జిల్లాచరిత్రకు సంబంధించి ఈ పుస్తకం ఎంతో విలువైనదని, దీనిద్వారా ఒకప్పటి ఈ ప్రాంత సామాన్య ప్రజలు ఎలాజీవించారు, వారి అనుభవాలు, ఆనాటి రాజకీయాలు అర్ధం చేసుకోవటానికి ఎంతో సహకరిస్తుందని, ఆంధ్రప్రదేష్ కు చెందిన పదమూడు జిల్లాలలో ఇంతవరకూ పది జిల్లాలకు చెందిన కైఫియ్యతులు పుస్తకరూపంలో వచ్చాయని, మన జిల్లాకు చెందిన కైఫియ్యతులు ఇంతవరకూ పుస్తకరూపంలో రాలేదని- తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మెకంజీ కైఫియ్యతులను ఎంతో శ్రమకోడ్చి శ్రీ బొల్లోజు బాబా సేకరించి వాటిని, సమకాలీన భాషలోకి మార్చి, లోతైన విశ్లేషణలతో, సమగ్రంగా చేసిన ఈ రచన కైఫియ్యతులను ఎలా అర్ధం చేసుకోవాలి, ఎలా సమకాలీన పఠితలకు అందించాలి అనే విషయంలో ఒక నమూనాగా నిలిచిపోతుందని" అన్నారు.
పుస్తక రచయిత శ్రీ బొల్లోజు బాబా మాట్లాడుతూ - భారతదేశ సర్వేయర్ జనరల్ గా పనిచేసిన కాలిన్ మెకంజీ మొత్తం రెండువేలకు పైబడి కైఫియ్యతులు అని పిలవబడే స్థానిక చరిత్రలను సేకరించాడు. వీటిలో తూర్పుగోదావరికి జిల్లాకు చెందిన రాజమహేంద్రవరం, కోరుకొండ, సామర్లకోట లాంటి మొత్తం పది ప్రాంతాల స్థానికచరిత్రలను 1814-15 ప్రాంతాలలో సేకరించాడు. ఇవి సమగ్రంగా ఇంతవరకూ పుస్తకరూపంలో రాలేదు. "మెకంజి కైఫియ్యతులు-తూర్పుగోదావరి జిల్లా" పుస్తకం ఆ లోటు తీరుస్తుందని భావిస్తున్నానని, ఈ పుస్తక ఆవిష్కర్తకు, ప్రచురించిన పల్లవి పబ్లికేషన్స్, ఫోన్:9866115655 వారికి కృతజ్ఞతలు తెలియచేసారు.
ఈ సభలో ఇంకా ప్రముఖకవి విమర్శకులు శ్రీ మాకినీడి సూర్యభాస్కర్, ప్రముఖరచయిత్రి పద్మజావాణి, ఐడియల్ కాలేజ్ అధికారి శ్రీ వర్మ, శ్రీ గౌరినాయుడు, శ్రీ సుబ్బారావు, శ్రీ సరిపల్లి శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు.
****
కాపీల కొరకు
శ్రీ ఎస్వి నారాయణ ఫోన్ నంబరు: 98661 15655
పల్లవి పబ్లికేషన్స్
పేజీలు-192. వెల 200/-
దయచేసి సంప్రదించండి.
.
బొల్లోజు బాబా
Tuesday, November 17, 2020
Imported post: Facebook Post: 2020-11-17T19:49:23
దర్శనం
దైవదర్శనం ముగించుకొని
కోనేరు మెట్లపై కూర్చొన్నాను.
ఎవరో భక్తుడు కొట్టిన గంట
నిశ్శబ్దంలో మెరుపులా మెరిసి
కోనేటి నీటిపై తరంగాలు తరంగాలుగా
కంపించింది కాసేపు.
ప్రదక్షిణాలు చేస్తున్న మువ్వల సవ్వడి
ఒక క్రమవిరామంతో
దగ్గరగా వచ్చి దూరమౌతోంది.
కొబ్బరినీళ్ళ వాసనను
మోసుకొచ్చిన గాలి
చెంపలను తాకి ఎటో సాగిపోయింది.
ఉడతల జంట ఒకటి
చెట్టు మొదలువద్ద కనిపించినట్లే కనిపించి
రెప్పపాటులో కొమ్మల్లోకి అదృశ్యమైంది.
పసుపుపచ్చని సీతాకోక చిలుక
నా భుజంపై కాసేపు తచ్చాడి
కలువల్ని కూడా కనికరించేందుకు కదిలింది.
ఒక్కసారిగా
గుడిలో ఎలెక్ట్రిక్ భజంత్రీలు మోగటం మొదలైంది
ఢంకాలు, గంటలు, మువ్వలు ఏకకాలంలో
ఒకదానిలోకి ఒకటి లయమౌతూ - ఒక శబ్దబీభత్సం
గోపురంపై రామచిలుకలు పైకి లేచాయి
నేనూ లేచాను .... ఇది నా సమయం కాదని.
బొల్లోజు బాబా
Subscribe to:
Posts (Atom)