Tuesday, October 8, 2024

సాయిబాబా విగ్రహాలు తొలగింపు

యూపి ఆలయాల్లో సాయిబాబా విగ్రహాలు తొలగింపు పై పెట్టిన ఒక పోస్టు వద్ద నే చేసిన కామెంట్లు ఇవి.
.
ఇది ఇక్కడితో ఆగుతుందా? హిందూ, బౌద్ధ ఆ తరువాత శైవ వైష్ణవ గొడవలుగా మారదని గ్యారంటీ లేదు.
***
శైవ వైష్ణవ గొడవలు వచ్చేంతగా శాస్త్రం ఎవరూ చదువుకోలేదు అన్న మిత్రుని వ్యాఖ్యకు ఇచ్చిన సమాధానం ఇది.
***
మీరు శాస్త్రం మాట్లాడుతున్నారు.
వాస్తవం అలా లేదు.
ఈ రోజు హిందుత్వ పేరుతో జరుగుతున్న ఈ విభజన, ద్వేషానికి కారణం వైష్ణవమే అనే భావన బలపడుతోంది.
మొన్న అయోధ్యాలయ ప్రారంభోత్సవ వేళ కూడా పిఠాధిపతుల నిరసనలో ఈ శైవ వైష్ణవ విభేధాలు స్పష్టపడ్డాయి
రాహులుడు శివుని పటం ప్రదర్శిస్తూ కూడా ఇదే అభిప్రాయాన్ని నర్మగర్భంగా ప్రకటించాడు
ఓట్లకోసం తాత అడ్డబొట్లు పెట్టుకొని శివాలయాలచుట్టూ తిరిగాడు మొన్న తమిళనాడులో.
పొలిటికల్ గా, మతపరంగా శైవ వైష్ణవ బేధాలు కన్సాలిడేట్ అవుతున్నాయి.
ఇక వ్యవహారపరంగా మతం బ్రాహ్మణుల చేతులలోంచి భజరంగ్ సేవకుల చేతులలోకి ఏనాడో జారిపోయింది.
బ్రాహ్మణుల చేతుల్లో రాజకీయనిర్ణయాలకు శాస్త్రప్రకారం సమర్ధింపులు చేయటం మిగిలింది.
ఒక వేళ అన్నిటినీ మింగేసి వైష్ణవం ఒకటే మిగిలినా.... అందులో మళ్ళా ద్వైత, అద్వైత, గౌడీయ అంటూ భిన్న శాఖల ఆధిపత్య పోరు మొదలౌతుంది.
మత ఆధారంగా విభజన ద్వేషం మొదలయ్యాకా దానికి అంతం ఉండదు. చరిత్ర ఈ నరమేథాలను చాలానే చూసింది.
బొల్లోజు బాబా

3 comments:

  1. ముందు ఒక విషయం చెప్పండి. మీరు హిందువులా ?

    ఒకవేళ హిందువు అయితే నిశ్చింత గా ఉండండి. హిందువులలో ఎన్ని శాఖలు ఉన్నప్పటికీ వేల ఏళ్లుగా ఎన్ని సమస్యలు, విభేదాలు వచ్చినా అవి అధిగమించి నిలబెట్టింది సనాతన ధర్మం. పరమత సహనం అన్నది హిందువులు సహజ గుణం.

    హిందువు కాకపోతే అనవసరంగా బాధ పడకండి. మీ మతం సంగతి మీరు చూసుకోండి.

    వ్యర్థ సిద్ధాంతాలు, వాదనల వల్ల ఉపయోగం లేదు.

    ReplyDelete
    Replies
    1. నేను హిందువునే. ఇప్పుడు జరుగుతున్నవి పరమత సహనానికి విఘాతం కలిగించేవే అని నా అభిప్రాయం.

      Delete
  2. సాయిబాబా వుంటే ట్రస్టు
    లేకుంటే హిందూ ఎండోమెంటు బోర్డు క్రింద తోసేయొచ్చు. May be they wanted it to go under HEB?

    ReplyDelete