Tuesday, October 8, 2024

కొంచెం ప్రజాస్వామ్యం కండి.

వేదాలు వినకూడదని, చదువుకోకూడదని, బ్రాహ్మణులను పూజించాలని లాంటి రాతలన్నీ వ్యాసుడు, వాల్మీకి లాంటి బ్రాహ్మణేతరులే రాసుకొన్నారని అని వాదించటం ఏదైతే ఉందో అది హిలేరియస్.
బ్రాహ్మణాధిక్యతను స్థిరపరచే రాతలు రాసిన బ్రాహ్మణులను, బ్రాహ్మణేతరులు అని ప్రచారించటం గొప్ప మార్కెటింగ్ టెక్నిక్.
ఇలాంటి వాదనలు శతాబ్దాలుగా చేసారు. ఇంకానా... ఇది డా. అంబేద్కర్, పెరియార్, పూలే ల యుగం. తర్కం నడుస్తున్న రోజులు ఇవి.
కొంచెం ప్రజాస్వామ్యం కండి.

Reference comment

కృష్ణుడు ఏంచెప్పాడు- బ్రాహ్మణాధక్యతను, చతుర్వర్ణాలను చెప్పాడు గీతలో. స్వధర్మం పాటించమన్నాడు. గీత దాటొద్దన్నాడు.
విశ్వామిత్రుడు- బ్రాహ్మణ జన్మ ఉత్తమమైనదని దాన్ని కోరుకోవటానికి తపస్సుచేసాడు
అరుంధతి - బ్రాహ్మణ కశ్యపుని ముని కుమార్తె. బ్రాహ్మణుని భార్య. మాదిగ స్త్రీ అని కథనాలు అల్లారు.
వాల్మీకి: బ్రాహ్మణుడు పేర్లు, అగ్నిశర్మ/లోహ జంఘ. బోయ అని కల్పించారు. రాసిందంతా బ్రాహ్మణాధిక్యతను స్థిరపరచే రాతలు.
వ్యాసుడు: బ్రాహ్మణ పరాశురుడికి జన్మించాడు. తాత బ్రాహ్మణ వశిష్టుడు. రాసిన రాతలు బ్రాహ్మణాధిక్యతను స్థిరపరచే కావ్యాలు, ఇతిహాసాలు.
మనువు కూడా బిసి అని వాదించాడో అతితెలివి మేధావి.
ఇలాంటి వాదనలనే లోతుతక్కువ వాదనలు అంటారు. బ్రాహ్మణవాదాన్ని చెప్పినవారందరూ బ్రాహ్మణేతరులు కనుక బ్రాహ్మణవాదం/సనాతనం అనేది బ్రాహ్మణేతరులే కావాలని తమమీద వేసుకొన్నారు;
వేదాలు వినకూడదని, చదువుకోకూడదని, బ్రాహ్మణులను పూజించాలని లాంటి రాతలన్నీ తమకు తామే రాసుకొన్నారని అని వాదించటం ఏదైతే ఉందో అది హిలేరియస్.
బ్రాహ్మణాధిక్యతను స్థిరపరచే రాతలు రాసినవారిని బ్రాహ్మణేతరులు అని ప్రచారించటం మార్కెటింగ్ టేక్నిక్.
ఇలాంటి వాదనలు శతాబ్దాలుగా చేసారు. ఇంకానా... ఇప్పుడు డా. అంబేద్కర్, పెరియార్, పూలే ల యుగం, తర్కం నడుస్తున్న రోజులు ఇవి.
కొంచెం ప్రజాస్వామ్యం కండి.
పిఎస్. ఆయా పాత్రలు చారిత్రికమైనవని నమ్మలేను కానీ పురాణ పాత్రలుగా ఎంచి వాటిపై విశ్లేషణ ఇది.



బొల్లోజు బాబా

7 comments:

  1. If possible, study ten major Upanishads which deal with the most fundamental concepts of Jeeva, Jagat, Eshwara and Atma.
    Upanishads contain universal truths and are a treasure for entire mankind.

    Listen to Yallamraju Srinivasa Rao garu . Your perception about sanatana dharma wil change.

    Engagement in vain polemics about caste will yield no result.

    https://youtu.be/Y2_-9llqhO0?feature=shared

    My sincere advice to you not to see everything through the prism of caste.

    ReplyDelete
    Replies
    1. నేను పైన చెప్పినవాటిగురించి మీ అభిప్రాయాలు పంచుకోండి.

      Delete
    2. ఏ వర్ణం వారు వ్రాశారు అన్న విషయం మీద వాదించుకుని ఏమి ఉపయోగం?
      ప్రపంచ సాహితీ చరిత్ర లో రామాయణం, భారతం, అష్టాదశ పురాణాలు, కావ్యాలు, ఇతిహాసాలను మించిన సాహిత్యం ఉన్నదా ? భాషా భావ సౌందర్యంలో అత్యున్నత మైన సాహితీ రాశి గురించి ఆనందించి ఆస్వాదించే ప్రయత్నం చేయడం మంచిదా లేక వర్ణాధిక్యం పేరిట వాదనలు మంచిదా ఒక్కసారి ఒక మేధావిగా ఆలోచించండి.

      మీరు హిందువు అన్నారు సంతోషం. It is very sad you seem to support a rabid Hinduphobic person like Audrey Trusche. Even anti Hindu persons like Irfan Habib acknowledged the barbarism of religious bigot Aurangazeb whereas Audrey Trusche whitewashed the atrocities of Aurangazeb.

      That's why I advised you to study at least Ishavasya upanishad if not already done with open mind.

      Show me a single secular islamic country out of 57.
      India is secular because of Hindus. Hindus have lived together for millennia in a harmonious manner. Social problems will be there in any society and religion.

      Some of this may not be directly related to this post. I observed that you are projecting Hinduism and it's varna system in a poor light in some of your posts and wanted to share my opinion.

      Why intellectuals like you seldom raise the persecution of Hindus and Buddhists in Bangladesh, Pakistan?

      So called liberals stand with Palestinians but not with Hindus in Bangladesh or Pakistan. Why ?

      You may also be aware about the discrimination against GC Hindus in Bharat now. As a Hindu I request you to identify the real threat Hindus and Sanatan Dharma is facing from global religious and adharmic behemoths.

      Thank you.


      Delete
    3. 1. రామాయణం, భారతం, పురాణాలు ఏంచెబుతున్నాయనేది ముఖ్యం. వాక్యవాక్యానా బ్రాహ్మణాధిక్యం ఉంటుంది. రాముడంతటి రాజు ఒక బ్రాహ్మణ గురువుని, ఆహ్వానించి ఉచితాసనం మీద కుర్చో బెట్టి, కాళ్ళుకాడిగి, నీళ్ళు తలపై జల్లుకున్నాడని చెప్పటం నాకు చాలా స్పష్టంగా బ్రాహ్మణుడిని చక్రవర్తి కూడా పూజించాలి అని చేస్తున్న సజెషన్ గా కనిపిస్తుంది.
      ఇదే భారతదేశ బ్రాహ్మణాధిక్య చరిత్ర. ఇదే ఘటన ఎన్ని పురణాలలో ఎన్ని రకాల కథనాలలో వచ్చి ఉంటుందో ఊహించండి. ఒక మేధావి ఇలా ఆలోచించాలి. అంతే తప్ప పురాణాలలో ఇతిహాసాలలో బ్రాహ్మణుడి ఆధిపత్యం చెప్పబడింది కదా, నేను బ్రాహ్మణుడిని కదా, భలే భలే వాటినే ఇంకా మనం పొగుడుదాం, శూద్ర అతి శూద్రుల మీదా యూట్యూబ్ చానెల్స్ లో ప్రవచనాల, ప్రసంగాల రూపంలో రుద్ది, మన కుల ఆధిపత్యాన్ని స్థిరపరచుకొని పాదనమస్కారాలు, ప్రధమ తాంబూలాలు దక్కించుకొందాం అని ఇంకా ఆశపడటమే రాక్షసత్వానికి ప్రతీక. మీకు అర్ధం కావటం లేదు.
      2. ఉపనిషత్తులు శృతులకు అనుగుణంగా ఉంటాయి. శృతులు మనుషుల మధ్య జన్మ ఆధారిత హెచ్చుతగ్గులను చెప్పాయి. ఈ జన్మ ఆధారిత హెచ్చుతగ్గులను వ్యతిరేకించే నాలాంటివాడు ఎందుకు చదవాలో చెప్పండి?
      3. ఇస్లామిక్ కంట్రీ గొడవ నాకెందుకు అయ్యా? వాల్ల గొడవ వాల్లు చూసుకొంటారు. నేనేమైనా ప్రస్తావించానా? మాట్లాడితే ఇస్లాము, క్రైస్తవమూ. నావద్ద ఎందుకు వాటి ప్రస్తావన? నేను అడిగిన వాటికి సమాధానం చెప్పు. వాటి ప్రస్తావన కావాలంటే మౌల్వీల దగ్గరకో , పాస్టర్ల వద్దకో పోయి చర్చించు. ఎనకటికి ఎవడో నన్ను ప్రస్నించటం కాదు ప్రెసిడెంటుగారిని ప్రశ్నించు, సెకెట్రీ గారిని ప్రశ్నించు అన్నాట్ట. నావద్ద మరొకరి ప్రస్తావన తేవొద్దు.
      4. నాకు హిందు చరిత్రకారులపై నమ్మకం లేదు. వీళ్ళు రేషనల్ గా ఆలోచించరు. హిందుత్వ నెరేటివ్ కొరకు చరిత్రను వంకర్లు తిప్పుతున్నారు. (నా బ్లాగుళో రామపండిత జాతకకథను ఎలా ట్విస్ట్ చేసారో చెప్పాను. వీలైతే చూడండి) వ హిందుత్వ చరిత్రకారుల గురించి నాకు చెప్పకు. అంతర్జాతీయ ఇండాలజిస్టుల కథనాలు నాకు సహేతుకంగా అనిపిస్తాయి.
      5. నేను చెప్పాను కదా. మరలా బంగ్లాదేష్, పాకిస్తాను సంగతులు నాకెందుకు. ఇక్కడ గురించి మాట్లాడు. నాది బంగ్లాదేషు, పాకిస్తాను కాదు. అక్కాడేం జరుగుతుందో మీకు తెలిస్నట్లు నాకు తెలియదు. వారి ప్రస్తావన తేవద్దు. ఇక్కడి విషయాలు తెండి. డా. అంబేద్కర్, పెరియార్, పూలే ల గురించి మాట్లాడండి.
      6. ఈ సనాతన ధర్మం పేరుతో శూద్రులను, అతిశూద్రులను వివక్షకు గురిచేశ్తున్నారని నా అవగాహన. అది చేశ్తున్న వారెవరో మీరు కొంచెం శోధించి చెప్పండి

      Delete
  2. మిస్టర్ బుచికి

    Do you know to whom you are advising?
    First know about Bolloju ji and comment.

    ReplyDelete
    Replies
    1. Easy m(s)ister jilebee. Bolloju babaji garu is a writer. He may or may not take my advice. Why you are worried?

      बालादपि ग्रहीतव्यं युक्तमुक्तं मनीषिभिः

      Delete
    2. :)

      What I wanted from you I got - a deep resourceful post as a response for this post of Bolloju ji

      Colored glasses blind us all equally - bolloju is no exception too

      Delete