Thursday, September 22, 2022

థేరీ గాథలు – తొలితరం బౌద్ధ సన్యాసినుల గాథలు



చాన్నాళ్ళ క్రితం మిత్రులు అద్దేపల్లి ప్రభు, థేరీగాథలు చదివారా అని అడిగారు. అప్పటికి వాటిగురించి విన్నాను తప్ప చదవలేదు. నెట్ లో వెతికితే శ్రీ వాడ్రేవు వీరభద్రుడు గారి వాల్ పై థేరీ గాథలపై వ్రాసిన అద్భుతమైన వ్యాసం కనిపించింది. రెండువేల ఆరువందల సంవత్సరాల క్రితం జీవించిన బౌద్ధ సన్యాసినులు తమ జీవితానుభవాలకు ఇచ్చుకొన్న కవిత్వ రూపం ఈ థేరీగాథలు. మూలాలకోసం అన్వేషిస్తే చాలానే కనిపించాయి. శ్రద్ధగా చదూకొన్నాను. ఆనాటి స్త్రీలు, వారి జీవనం, చారిత్రిక నేపథ్యం చదువుతూ దివ్యానుభూతి పొందాను.
 
నా ఆనందాన్ని అనువదించాలనే లౌల్యం నన్ను నిత్యం బతికిస్తూ ఉంటుంది.

అలా "థేరీగాథలు-తొలితరం బౌద్ధ సన్యాసినుల గాథలు" ఈరోజు పుస్తకరూపంలో మీ ముందు ఉన్నది. ఆనాటి బౌద్ధ సన్యాసినుల కవితలే కాక అవసరమైన చోట్ల వాటి చారిత్రిక నేపథ్యాన్ని విపులంగా ఎండ్ నోట్స్ రూపంలో ఇచ్చాను.

నాకు బౌద్ధ పరిభాషపై పట్టు లేదు. పుస్తక జ్ఞానమే. ఈ పుస్తకరాతప్రతిలో వాడిన బౌద్ధ పరిభాషలో దొర్లిన అనేక దోషాలను పూజ్య బిక్ఖు ధమ్మరఖిత స్వామి సరిదిద్దారు. ఆశీపూర్వక ముందుమాట కూడా వ్రాసారు. వారికి వినయపూర్వక నమస్కారాలు.

శ్రీ గిరిధర్ చక్కని కవర్ పేజ్ ఇచ్చారు వారికి ధన్యవాదములు
క్రాంతి గారు అందంగా పేజ్ సెటప్ చేసారు వారికి కృతజ్ఞతలు.
నాపై వాత్సల్యంతో అట్టవెనుక బ్లర్బ్ రాసి ఇచ్చిన భద్రుడు గారికి నమస్సులు.

ఇంకా శ్రీ అవధానుల మణిబాబు, శ్రీ గనారా, ప్రభు, మార్ని చౌదరిగారు, అనిల్ డానీ, సుంకర్ గోపాల్, పుప్పాల శ్రీరామ్, డా. కాళ్ళకూరి శైలజ గారు, అగ్రజులు మధునాపంతుల గారు, దాట్ల రాజు గారు, బాల్యమిత్రుడు ముమ్మిడి చిన్నారి, నా గురువు శిఖామణి గారికి అనేకానేక కృతజ్ఞతలు,
***
ఈ పుస్తకం ఛాయా ప్రచురణల ద్వారా వస్తున్నది. మోహన్ గారికి ధన్యవాదములు.
ప్రింటింగ్ మేకప్ చాలా బాగా ఉంది. చేతిలో ఇమిడిపోయే సైజు. తేలిక పేపరు. చాలా డిఫరెంటుగా, అందంగా వచ్చింది.
 
182 పేజీల పుస్తకం వెల 150 రూపాయిలైనా లాంచింగ్ ఆఫర్ గా ఈ నెలాఖరు వరకూ 100 రూపాయిలకే ఇస్తున్నారు. 40 రూపాయిల పోస్టేజ్.

మొత్తం 140 రూపాయిలు
 
9848023384 నంబరుకు ఫోన్ పే చేసి పుస్తకం పొందవచ్చును.
ఈ పుస్తకం కవిత్వ పరంగా, చరిత్ర పరంగా మీ ఆసక్తిని నిరాశపరచదు.
9848023384 నంబరుకు 140/- ఫోన్ పే చేసి పుస్తకం పొందవచ్చును.
దయచేసి ఆదరించండి.
 
భవదీయుడు

బొల్లోజు బాబా


2 comments:

  1. బొల్లోజు బాబా గారు,
    థేరీ గాథలు పుస్తకరూపంలో తీసుకువచ్చి మంచి పని చేశారు.

    పైన మీరిచ్చిన పబ్లిషర్ సెల్ ఫోన్ నెంబరుకు ఇవాళ (23-09-2022) ఫోన్ చేసి నా కాపీ ఏర్పాటు చేసుకున్నాను.

    మీరు ఫోన్ పే అన్నారు. ఫోన్ పే తో బాటు గూగుల్ పే కూడా తీసుకుంటామని ఆ పబ్లిషర్ అన్నారు (బ్లాగు పాఠకుల కోసం ఈ సమాచారం ఇక్కడ ఇస్తున్నాను).

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ నరసింహారావు గారు. మీ ప్రోత్సాహానికి ధన్యవాదములు.
      థాంక్స్ అలాట్ అండి

      Delete